పార్టీ మారినందుకు చెప్పు దెబ్బ
Published Sat, Dec 31 2016 1:57 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM
కృష్ణా: గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో శనివారం రగడ జరిగింది. వైఎస్సార్సీపీ టిక్కెట్టుపై గెలిచి టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లకు చేదు అనుభవం ఎదురైంది. పార్టీని వీడి టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావును వైఎస్సార్సీపీ కౌన్సిలర్ రవికాంత్ చెప్పుతో కొట్టారు. పదవికి రాజీనామా చేసి టీడీపీ తరఫున పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కౌన్సిల్ హాల్ లో గందరగోళం ఏర్పడింది.
Advertisement
Advertisement