
సాక్షి, కృష్ణా జిల్లా: అమరావతి పేరిట చేపట్టిన పాదయాత్రలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. గుడివాడలో వైఎస్సార్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వాహనం నిలిపి పాటలు పాడే యత్నం చేశారు. పోలీసులు వారించినా వినకుండా టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు.
కొడాలి నానికి చెందని శరత్ సినిమా థియేటర్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత మాగంటి బాబు చెప్పు చూపిస్తూ రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టడమే లక్ష్యంగా టీడీపీ నేతల డైరెక్షన్ సాగుతున్న పాదయాత్రలో ఆ పార్టీ నేతలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
చదవండి: (అచ్చెన్నకు లోకేష్‌తో చెడిందా?.. చినబాబుకు కళా అందుకే దగ్గరవుతున్నారా?)
Comments
Please login to add a commentAdd a comment