హత్నూర: కంట్రిబ్యూషనరీ పింఛన్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలని కోరుతూ ఈ నెల 12న సంగారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా నాయకుడు శ్రీనివాస్‌రావు అన్నారు.
బుధవారం దౌల్తాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. సీపీఎస్ రద్దు కోసం దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో దశలవారీగా కార్యక్రమాలకు ఎస్‌టీఎఫ్‌ఐ పిలుపునిచ్చిందన్నారు.