
జె ఎస్ ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డను హీరోగా పరిచయం చేస్తూ జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పని చేసే నారాయణ’ ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఆగస్ట్ 24న రిలీజ్‌కి రెడీ అయ్యింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభిమాని అయిన హీరో హరికృష్ణ జగన్ కోసం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ‘ఎదురు లేని మనిషి జననేత జగన్ అన్న’ అనే ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ఆ పాటను వైస్ జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా... చిత్ర దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘జగన్ గారి అభిమాని అయిన మా హీరో హరి కోరిక మేరకు ఎదురు లేని మనిషి జననేత జగనన్న అనే పాటను చేయడం జరిగింది. ఈ పాట ప్రతీ వైఎస్సార్ అభిమాని, వైఎస్ జగన్‌ను ప్రేమించే ప్రతీ వ్యక్తికి నచ్చే విధంగా రూపొందించడం జరిగింది. ఈ పాట సీడీలను జగన్ గారు ఆవిష్కరించి మా హీరో హరిని చిత్ర యూనిట్ ను అభినందించార’ని తెలిపారు.
హీరో హరి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ గారు విడుదల చేసిన మా సినిమా ఆడియో పెద్ద హిట్ అయ్యింది. ఆయన ఎంతో బిజీగా వున్నా కూడా ఆడియోను విడుదల చేయటం నా జీవితంలో మరచిపోలేని విషయం. జగన్ గారికి ఎంతో రుణపడి ఉన్నాను. ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్న నా అభిమాన నాయకుడికి నా వంతుగా ఏదో ఒకటి చేయాలి అనుకొని ఆ ప్రజా నాయకుడి మీద ఓ పాట రూపొందించే ఆలోచన వచ్చింది. అందుకే ఈ ప్రత్యేక గీతాన్నిరూపొందించాం. త్వరలోనే మా సినిమాతో మీ ముందుకు వస్తున్నాను.. ప్రేక్షకులు నా ప్రయత్నాన్ని మెచ్చి నన్ను దీవిస్తారు అని ఆశిస్తున్నా’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment