
సాక్షి, అమరావతి: ఉద్యమాల్లో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌లు రద్దు చేస్తున్నారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని, అవి కేవలం పుకార్లు మాత్రమే అని విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి డీఎస్‌ఎస్ శ్రీనివాసరావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాజధాని అమరావతిని తరలిస్తున్నారంటూ ఉద్యమం చేస్తున్న వారి పాస్‌పోర్ట్‌లు రద్దు చేస్తున్నారంటూ రెండ్రోజులుగా ఎవరో పుకార్లు పుట్టించారని తెలిపారు. ఒక్కసారి పాస్‌పోర్టు జారీ చేస్తే దాన్ని రద్దు చేసే అధికారం తమకుగానీ, పోలీసులకు గానీ ఉండదని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పుడు, రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేసి.. స్వయానా కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పుడే పాస్‌పోర్ట్ రద్దు సాధ్యమవుతుందన్నారు. ఇలాంటి పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment