
అమరావతి యాత్రకు తూర్పు గోదావరి జిల్లా కాతేరు వద్ద నల్ల బెలూన్లతో ప్రజల నిరసన
రాజమహేంద్రవరం రూరల్ : అమరావతి రైతు పాదయాత్రకు తూర్పుగోదావరిజిల్లా కాతేరులో నిరసన సెగ తగిలింది. సోమవారం సాయంత్రం కాతేరు వెంకటాద్రిగార్డెన్స్ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు మల్లయ్యపేట గాంధీ బొమ్మ సమీపంలో స్థానికులు ప్లకార్డులు, నల్లబెలూన్లు చేబూని నిరసన వ్యక్తం చేశారు. వారికి వైఎస్సార్‌సీపీ శ్రేణులు తోడయ్యాయి.
రియల్ ఎస్టేట్ రాజధాని వద్దే వద్దు.. మూడు రాజధానులే ముద్దు.. అంటూ నినాదాలు చేస్తూ గాల్లోకి బెలూన్లు ఎగురవేశారు. నిరసనకారులను పాదయాత్రికులు కవ్వించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అమరావతి పాదయాత్రికులు తారాజువ్వలు వదులుతూ నిరసనకారులను రెచ్చగొట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలనూ నియంత్రించారు.
Comments
Please login to add a commentAdd a comment