farmers padayatra
-
టీడీపీ స్పాన్సర్డ్.. ఫేక్ యాత్ర అసలు ‘లోగుట్టు’ ఇదే..
అమరావతి రాజధాని రైతుల పాదయాత్ర పేరుతో ఇంతకాలం సాగిన డ్రామాలో అసలు విషయాలు బయటకు వచ్చాయి. ఆ నాటకం బహిర్గతం కావడంతో పాదయాత్రకు బ్రేక్ వేసుకోక తప్పలేదు. అది తాత్కాలికం అవుతుందా? లేక శాశ్వతం అవుతుందా అన్నది చెప్పలేకపోయినా, ఏ మాత్రం ఆలోచనపరులైనా ఈ ప్రహసనానికి పుల్ స్టాప్ పెట్టాలి. ఈ పాదయాత్ర అంతా తెలుగుదేశం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని, దానికి జనసేన మరికొన్ని పార్టీలు సహకరిస్తున్నాయని వెల్లడైంది. అసలు రైతులు ఎందరు? నకిలీ రైతులు ఎందరు అన్న విషయంపై కూడా క్లారిటీ వచ్చినట్లు అనిపిస్తుంది. చదవండి: అంతా పక్కా స్క్రిప్ట్.. అసలు కారణం ఇదన్న మాట.. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సరిగా అమలు చేయకపోతే ఏకిపారేసే ఈనాడు, తదితర టీడీపీ మీడియా సంస్థలు, హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తే మాత్రం ఆంక్షలు పెడతారా అంటూ గగ్గోలు పెట్టాయి. నిజానికి ఇలాంటి అంశాలపై పాదయాత్రలకు గౌరవ న్యాయ స్థానం అనుమతి ఇవ్వకుండా ఉంటే బాగుండేది. ఒకవేళ ఏ ఆలయానికి అయినా వెళ్లాలని అనుకుంటే ఏ బస్‌లోనే వెళ్లి రండని చెబితే సబబుగా ఉండేది. అలాకాకుండా ఈ పాదయాత్రకు అనుమతి ఇవ్వడంతో ఏపీ సమాజంలో ఒక రకమైన అశాంతి ఏర్పడడానికి ఆస్కారం ఏర్పడింది. అనవసరమైన శాంతిభద్రతల సమస్యకు అవకాశం ఇచ్చినట్లయిందనిపిస్తుంది. అయిన ఏపీ ప్రభుత్వం కాని, పోలీసులు కాని తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరించడంతో అలాంటి వివాదాలు ఏవీ పెద్దగా రాలేదు. ఇదే సమయంలో గౌరవ హైకోర్టు అమరావతి పాద యాత్రికులకు కొన్ని షరతులు విధించింది. అవి లేకుంటే మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడేది. 600 మించి రైతులకు అనుమతి ఇవ్వవద్దని, వారికి గుర్తింపు కార్డులు ఉండాలని, రాజకీయ నేతలకు అవకాశం ఇవ్వవద్దని, నాలుగు వాహనాలు మించి ఉండరాదని, ప్రభుత్వాన్ని విమర్శించరాదని, సంఘీభావం చెప్పాలనుకున్నవారు రోడ్డు పక్కనే నిలబడాలని.. ఇలా కండిషన్లు పెట్టింది. కాని వీటిలో ఏ ఒక్కటి కూడా ఈ పాదయాత్ర చేసేవారు పాటించలేదు. అయినా పోలీసులు ఈ నలభై రోజులూ చూసిచూడనట్లు వ్యవహరించారు. దానిని అలుసుగా తీసుకున్న పాద యాత్రికులు ఆయా చోట్ల రెచ్చి పోయి వ్యవహరించారు. ఇదే సమయంలో పాదయాత్రకు నిరసనలు చెప్పడం ఆరంభం అయింది. వీరు అమరావతిలోనే సమస్తం పెట్టాలని డిమాండ్ చేస్తూ యాత్ర చేస్తుంటే, దీనిని వ్యతిరేకిస్తూ ఆయా చోట్ల నిరసన ర్యాలీలు, ప్లెక్సీల ఏర్పాటు , వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా గర్జనలు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లు వంటివి జరిగాయి. కొన్ని చోట్ల వైసీపీ నేతలు కూడా నిరసనలలో పాల్గొన్నారు. ఆ క్రమంలో ఇరుపక్షాల మధ్య కొంత ఉద్రిక్తత ఏర్పడిన మాట నిజమే. తణుకు, రాజమండ్రి వంటి చోట్ల పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. కాగా కోనసీమ అంబేద్కర్ జిల్లా రామచంద్రాపురం వద్దకు యాత్ర వెళ్లేసరికి మొత్తం లోగుట్టు బయటకు వచ్చింది. అమరావతి జేఏసీ వారు కోర్టుకు వెళ్లి పోలీసులు తమను అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేయగా, హైకోర్టు వారు అన్నిటిని పరిశీలించి, తాము పెట్టిన షరతులు కచ్చితంగా పాటించాలని, పోలీసులు ఆ మేరకు చర్య తీసుకోవాలని స్పష్టం చేయడంతో ఈ జేఏసీ, పాద యాత్రికుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇన్ని రోజులు తమకు తోచిన విధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ నేతలు, లేదా వారు కిరాయికి తెచ్చుకున్నవారు ఈ యాత్రలో పాల్గొంటూ, అక్కడక్కడ తొడలు చరుచుకుంటూ, చెప్పులు చూపుతూ వైసీపీ వారిని రెచ్చగొడుతూ సాగించారు. హైకోర్టు తాజా ఉత్తర్వులతో రామచంద్రపురం వద్ద పోలీసులు పకడ్బందిగా వ్యవహరించారు. వారిని ఒకరకంగా అభినందించాలి. రైతుల గుర్తింపు కార్డులను చూపాల్సిందేనని పట్టుబట్టారు. ఎలాగొలా అలజడి సృష్టించి దీనిని డైవర్ట్ చేయాలని పాదయాత్రికులు కొందరు ప్రయత్నించారు. కాని పోలీసులు ససేమిరా అనడంతో గుర్తింపు కార్డులు లేనివారు జారుకున్నారు. దాంతో ఈ పాదయాత్రలో అసలు రైతులు కన్నా నకిలీ రైతులే ఎక్కువగా ఉన్నారన్న అంశం ప్రజలకు తెలిసిపోయింది. 600 మంది రైతులకు అవకాశం ఉంటే, కేవలం 75 మంది మాత్రమే గుర్తింపుకార్డు కలిగి ఉన్నారట. కొందరు వేరేవారి కార్డులు తెచ్చారట. అమరావతిలోని 29 గ్రామాలకు చెందిన రైతులు సుమారు 24 వేల మంది రాజధాని కోసం భూములు ఇచ్చారు. కాని వారిలో ఒక్క శాతం కూడా ఈ పాదయాత్రలో పాల్గొనలేదు. కేవలం ఈనాడు, తదితర టీడీపీ మీడియాలలో మాత్రమే వందల మంది నడుస్తున్నట్లు, వారికి వేల మంది స్వాగతం పలుకుతున్నట్లు దొంగ ప్రచారం చేశారని తేటతెల్లమైంది. ఎక్కడికక్కడ టీడీపీ, జనసేనకు చెందినవారు వీరితో కలిసిపోయి హడావుడి చేసే యత్నం చేశారు. పోలీసులు హైకోర్టు నిర్ణయాలను పాటిస్తే దానిని తప్పు పడుతూ ఈనాడు మీడియా ఆంక్షల అడ్డంకులు అని హెడింగ్ పెట్టింది. అంతే తప్ప హైకోర్టు ఉత్తర్వులు అమలు చేశారని చెప్పలేదు. పైగా ఈ పాదయాత్ర చేసేవారిని పోలీసులు హింసించారని, నేలకేసి కొట్టారని, ఇలా తప్పుడు ప్రచారం చేయడానికి టీడీపీ మీడియా నానా తంటాలు పడింది. రైతులు నిర్ణీత సంఖ్యలో పాల్గొనడం లేదని వెల్లడికాగానే తెలుగుదేశం వారు కొత్త అబద్దం సృష్టించారు. రైతుల గుర్తింపు కార్డులను పోలీసులు చించివేశారని ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులు ఆరోపించారు. దానిని వారి మీడియా ప్రముఖంగా ఇచ్చింది. నిజంగానే అలా జరిగి ఉంటే ఈపాటికి ఎంత రచ్చే చేసేవారు. ఎందుకంటే నిరంతరం ఈ మీడియా తన కెమెరాలను పాద యాత్రికుల వెంట తిప్పుతోంది. అలాంటప్పుడు వీరి కన్నుకప్పి పోలీసులు గుర్తింపు కార్డులను చించుతారా? కేవలం ఆ కార్డుల కోసం పోలీసులు పట్టుబడితే, అవి లేనివారు వెనకగుండానో, మరో మార్గంలోనో జారుకున్నారు. నిజంగానే ఈ రైతులకు చిత్తశుద్ది ఉంటే గుర్తింపు కార్డులు ఉన్న డెబ్బై ఐదు మంది అయినా పాదయాత్ర కొనసాగించి ఉండవచ్చు కదా?. మరి అలా ఎందుకు చేయలేదు. అతి తక్కువ మంది రైతులే ఈ యాత్రలో ఉన్నారన్న సంగతి మరింతగా ప్రచారం జరిగే అవకాశం ఉండడం, దీనివల్ల తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా మరింతగా నష్టపోతుందన్న ఆందోళన, ఉత్తరాంధ్రకు వెళ్లే కొద్దీ వీరికి నిరసన సెగ పెరుగుతుందన్న ఆందోళన, రోజూ లక్షల రూపాయల వ్యయం, వీటిని భరించే టీడీపీ స్థానిక నేతలు కొందరు చేతులు ఎత్తివేయడం వంటి కారణాల వల్లే చివరికి పాదయాత్రను వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించి వారి వాహనాలలో తిరుగు ముఖం పట్టారు. కాకపోతే భేషజానికి మాత్రం తాము తాత్కాలికంగానే వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు. బహుశా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ వీరిని ఉసికొల్పి యాత్ర కొనసాగించేలా చూస్తే తప్ప, ఇది ఆగిపోవచ్చు. ఇంతకాలం ఈ రైతులు ఐదుగురో పది మందో వంద మందో అమరావతి గ్రామాలలో శిబిరంలో కూర్చుని తమకు మద్దతు ఇచ్చే టివీల ముందు ప్రభుత్వాన్ని విమర్శించి తమ ఇళ్లకు వెళ్లిపోతుండేవారు. కాని న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తిరుపతి పాదయాత్ర ప్లాన్ చేశారు. దాని విషయంలో ప్రభుత్వం ఒక రకంగా సహకరించిందని చెప్పాలి. ఆ యాత్ర సజావుగా తిరుపతి చేరుకుంది. దాంతో చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తరాంధ్రలోని అరసవల్లికి పాదయాత్రకు పురికొల్పారు. పోనీ అది అయినా నేరుగా వెళ్లారా అంటే అలాకాకుండా, టీడీపీకి కాస్త పట్టు ఉన్న గ్రామాలు, పట్టణ ప్రాంతాల గుండా , అడ్డదిడ్డమైన రూట్లలో యాత్ర సాగించారు. ఇదంతా చూసేవారికి నీ ముక్కు ఏది అంటే మొహం చుట్టూ తిప్పి చూపినట్లుగానే వీరు ప్రవర్తిస్తున్నట్లు అర్ధం అయింది. గుడివాడ వంటి చోట్ల టీడీపీ మహిళా కార్యకర్త ఒకరు తొడలు కొట్టడం, మాజీ ఎంపీ మాగంటి బాబు చెప్పు చూపడం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఆ రకంగా సాగుతూ వచ్చిన ఈ యాత్రకు ఇప్పుడు బ్రేక్ పడింది. అసలు మూడు రాజధానుల చట్టాన్నే ఉపసంహరించుకున్నామని ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం అమరావతి జేఏసీ పేరుతో ఈ పాదయాత్ర నిర్వహించడం, అందులో అసలు రైతులు కన్నా, నకిలీ రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికంగా ఉండడంతో మొత్తం యాత్ర అప్రతిష్టపాలైంది. విశాఖ రాజధానికి వ్యతిరేకంగా వీరు పాదయాత్ర చేయడం వైసీపీకి కలిసివచ్చినట్లయింది. ఆ పార్టీ యాక్టివ్ అయి, ప్రజలలో దీనిపై చైతన్యం తెచ్చింది. దాంతో టీడీపీ అనుకున్నది ఒకటి అయిందొకటి అని చెప్పాలి. ఏతావాతా పాదయాత్ర ప్లాన్ ఎందుకు వేశామా అని టీడీపీ నేతలే తలపట్టుకునే పరిస్థితి ఏర్పడడం కొసమెరుపు గా భావించవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
‘డ్రామాలు చేసున్న వారంతా పట్టుబడ్డారు’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: రైతుల పేరుతో బినామీ యాత్ర చేస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వెరిఫికేషన్‌లో 70 మంది మాత్రమే అసలు రైతులని తేలిందని, డ్రామాలు చేస్తున్న వారంతా పట్టుబడ్డారన్నారు. చదవండి: అంతా పక్కా స్క్రిప్ట్.. అసలు కారణం ఇదన్న మాట.. ‘‘అమరావతి ఉద్యమం కలుషితమైన ఉద్యమం. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ కచ్చితంగా జరిగింది. విశాఖ ప్రపంచ నగరం. అమరావతిలా గ్రాఫిక్స్ కాదు. వెనుకబాటుతనాన్ని పారద్రోలడం కోసమే ఉత్తరాంధ్రకు రాజధాని. విశాఖ రాజధాని ఏర్పాటుకు తోడ్పడాలని, న్యాయస్థానాలు, న్యాయమూర్తులను కోరుతున్నా’’ అని తమ్మినేని అన్నారు. రాజకీయ నేతకు ఉండాల్సిన లక్షణాలు పవన్ కల్యాణ్‌కు లేవు. ఓ నాయకుడు చెప్పు పట్టుకుని స్టేజ్ మీద చూపడమేంటి?’’ అని స్పీకర్ ప్రశ్నించారు. -
అమరావతి పాదయాత్రకు బ్రేక్
-
రియల్ ఎస్టేట్ రాజధాని వద్దే వద్దు
రాజమహేంద్రవరం రూరల్ : అమరావతి రైతు పాదయాత్రకు తూర్పుగోదావరిజిల్లా కాతేరులో నిరసన సెగ తగిలింది. సోమవారం సాయంత్రం కాతేరు వెంకటాద్రిగార్డెన్స్ నుంచి ప్రారంభమైన పాదయాత్రకు మల్లయ్యపేట గాంధీ బొమ్మ సమీపంలో స్థానికులు ప్లకార్డులు, నల్లబెలూన్లు చేబూని నిరసన వ్యక్తం చేశారు. వారికి వైఎస్సార్సీపీ శ్రేణులు తోడయ్యాయి. రియల్ ఎస్టేట్ రాజధాని వద్దే వద్దు.. మూడు రాజధానులే ముద్దు.. అంటూ నినాదాలు చేస్తూ గాల్లోకి బెలూన్లు ఎగురవేశారు. నిరసనకారులను పాదయాత్రికులు కవ్వించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అమరావతి పాదయాత్రికులు తారాజువ్వలు వదులుతూ నిరసనకారులను రెచ్చగొట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలనూ నియంత్రించారు. -
రియల్ ఎస్టేట్ రాజధాని వద్దు..
చాగల్లు: అమరావతి రైతుల పాదయాత్రకు తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో స్థానికుల నుంచి నిరసన ఎదురైంది. శనివారం ఉదయం చాగల్లు మండలంలో ఎస్ ముప్పవరం నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఊనగట్ల మీదుగా చాగల్లుకు చేరింది. చాగల్లు మండల వైఎస్సార్సీపీ నేతలతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు ఉదయం తొమ్మిది గంటలకే చాగల్లు ప్రధాన కూడలి వద్దకు చేరుకున్నారు. నల్ల చొక్కాలు, నల్ల కండువాలు ధరించారు. వీరంతా ప్లకార్డులు పట్టుకుని మూడు రాజధానులకు మద్దతు పలుకుతూ అమరావతి యాత్రపై నిరసన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు, వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి.. అంటూ నినాదాలు చేశారు. నల్ల బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. అమరావతి పాదయాత్రలో కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రెండు వర్గాల వారూ పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి.. అవాంఛనీయ ఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పోసిన శ్రీలేఖ, ఏఎంసీ చైర్మన్ వల్లభశెట్టి శ్రీనివాసరావు, ఎంపీపీలు మట్టా వీరాస్వామి, జొన్నకూటి పోసిబాబు, కొవ్వూరు మునిసిపల్ చైర్మన్ భావన రత్నకుమారి, చాగల్లు మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు చెల్లింకుల దుర్గామల్లేశ్వరరావు, సొసైటీ అధ్యక్షుడు ఆత్కూరి దొరయ్య, మాజీ సర్పంచ్ గండ్రోతు సురేంద్రకుమార్, స్థానికులు పాల్గొన్నారు. -
రియల్ ఎస్టేట్ రాజధాని వద్దే వద్దు..
ఉండ్రాజవరం: అమరావతి రైతు పాదయాత్రకు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో నిరసన సెగ తగిలింది. గురువారం ఉండ్రాజవరం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు స్థానిక జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు, స్థానికులు ప్లకార్డులతో, నల్ల బెలూన్లతో నిరసన వ్యక్తం చేశారు. వారు బయటకు రాకుండా గేట్లు వేశారు. రియల్ ఎస్టేట్ రాజధాని వద్దు.. మూడు రాజధానులే ముద్దు.. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.. అంటూ నినాదాలు చేస్తూ నల్ల బెలూన్లను గాల్లోకి వదిలారు. పాదయాత్రలో ఒక మహిళ జై అమరావతి.. అంటూ రెచ్చగొట్టేలా నినాదాలు చేయడంతో వైఎస్సార్సీపీ నాయకులు, స్థానికులు ఒక్కసారిగా రోడ్డుపైకొచ్చారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను, స్థానికులను సుబ్బారావు నివాసంలోకి పంపేశారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ బూరుగుపల్లి సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ పాదయాత్రలో రైతుల ముసుగులో టీడీపీ నాయకులు, కార్యకర్తలే ఉన్నారని విమర్శించారు. -
పాదయాత్రను ఉత్తరాంధ్ర పొలిమేరల్లోనే అడ్డుకుంటాం
టెక్కలి: రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉన్నతాశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని, అమరావతి యాత్ర పేరుతో పెయిడ్ ఆర్టిస్టులు వస్తే.. ఉత్తరాంధ్ర పొలిమేరల్లోనే అడ్డుకుని వారిని తరిమికొడతామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. ఆయన శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గురువారం మీడియాతో మాట్లాడారు. 75 ఏళ్లుగా ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంతో ఉందని, ఇప్పటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనవల్ల పరిపాలన రాజధాని రాబోతోందన్నారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు పన్ని అడ్డుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలి.. అందులో అమరావతి ఉండాలి అనేది తమ నినాదమని.. కానీ, చంద్రబాబు మాత్రం కేవలం తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం.. తన వాళ్ల ప్రయోజనం కోసం కేవలం అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలనే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల భిక్షతో దశాబ్దాలుగా రాజకీయంగా లబ్ధిపొందిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు ఈరోజు అమరావతి ప్రాంతంలో వారి రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం.. పుట్టిన గడ్డకు తీరని ద్రోహం చేస్తున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. అమరావతిలో రాజధాని నినాదంతో ఉప ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ఇప్పటికే అచ్చెన్నాయుడుకు 24 గంటలు సమయం ఇచ్చానని దువ్వాడ గుర్తుచేశారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదంతో టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడుపై పోటీకి తానింకా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అమరావతే రాజధాని కావాలంటే ఆ ఒక్క ప్రాంతానికే మద్దతిస్తే.. ఉత్తరాంధ్ర ద్రోహి అచ్చెన్నాయుడు అంటూ ప్రతి గ్రామంలో బ్యానర్లు కట్టి ప్రచారం చేస్తామని హెచ్చరించారు. అధికార వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఈ నెల 15వ తేదీన విశాఖలో జరగనున్న ర్యాలీకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతున్నారని, ఉత్తరాంధ్ర సత్తాను దేశం మొత్తం చాటుతామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. -
జగనన్న ప్రగతి రథసారథి.. చంద్రబాబు రియల్టర్ల వారధి
సాక్షి, తణుకు: ప.గో.జిల్లా తణుకు నియోజకవర్గంలోకి ప్రవేశించిన అమరావతి రైతుల పాదయాత్రకు నిరసన సెగ తగిలింది. తణుకు నియోజకవర్గ వైసీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గో బ్యాక్ గో బ్యాక్ ఫేక్ యాత్రికులారా అంటూ వివిధ నినాదాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అమరావతి పేరుతో టీడీపీ, చంద్రబాబు అండ్ కో చేస్తున్న కుతంత్రాలపై ఫ్లెక్సీలతో నిరసన వ్యక్తం చేశారు. తణుకు నియోజకవర్గంలోని పోస్టర్లలో నినాదాలు ఇలా ఉన్నాయి.. ► రియల్ ఎస్టేట్ వద్దు.. ఆంధ్రాస్టేట్ ముద్దు ► జగన్ ది స్టేట్ గురించి ఆలోచన.. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ గురించి ఆలోచన ► జగన్ కోరుకొనేది అందరి అభివృద్ధి.. చంద్రబాబు కోరుకునేది అస్మదీయుల అభివృద్ధి ► జగన్ ది సమైక్యవాదం.. చంద్రబాబుది భ్రమరావతి నినాదం ► జగన్ ది అభివృద్ధి మంత్రం.. చంద్రబాబు ది రాజకీయ కుతంత్రం ► రాష్ట్రం కోసం జగన్ ఆరాటం.. 29 గ్రామాల కోసం బాబు నకిలీ పోరాటం ► మూడు రాజధానులకు ప్రజా ఆమోదం.. చంద్రబాబు అండ్ కో రియల్టర్లకు ఖేదం ► జగనన్న ప్రగతి రథసారథి.. చంద్రబాబు రియల్టర్ల వారధి ► చంద్రబాబు పార్టీ షేక్ పాదయాత్ర ఫేక్ ► అన్ని ప్రాంతాల అభివృద్ధి జగనన్న ఆకాంక్ష.. అయిన వారు బాగు కోసమే వికేంద్రీకరణకు బాబు వివక్ష ► వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మధ్య వివక్ష వద్దు ► హైదరాబాద్ ప్రయోగం అన్యుల పాలు.. అమరావతి ప్రయోగం చంద్రబాబు అండ్ కోకే మేలు -
అమరావతి రైతుల పాదయాత్రపై వైఎస్ఆర్ సీపీ నేతలు ఫైర్
-
రైతుల ముసుగులో టీడీపీ దౌర్జన్యం
ద్వారకాతిరుమల: వన్‌వే రహదారిలో పాదయాత్ర చేసేందుకు అనుమతిలేదని అన్నందుకు పోలీసులతో అమరావతి రైతుల ముసుగులో ఉన్న కొందరు టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. అంతటితో ఆగకుండా దౌర్జన్యంగా పోలీసులను నెట్టుకుంటూ ముందుకెళ్లారు. ద్వారకా తిరుమలలోని అంబేడ్కర్ సెంటర్లో ఆదివారం ఉదయం ఏం జరిగిందంటే.. అమరావతి రైతుల పాదయాత్ర సెప్టెంబర్ 30న ద్వారకాతిరుమలకు చేరుకుంది. తిరిగి స్థానిక వైష్ణవి ఫంక్షన్ హాలు వద్ద ఆదివారం ఉదయం యాత్ర ప్రారంభమైంది. అయితే, రూట్ మ్యాప్ ప్రకారం వారు అంబేడ్కర్ సెంటర్ నుంచి ఉగాది మండపం, యాదవ కల్యాణ మండపం మీదుగా రాళ్లకుంట గ్రామానికి వెళ్లాల్సి ఉంది. అయితే, స్థానిక టీడీపీ నేతలు కొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి, అంబేడ్కర్ సెంటర్ నుంచి వన్‌వే రహదారి (బైపాస్) మీదుగా, గుడిసెంటర్ వైపునకు పాదయాత్ర వెళ్లాలని పట్టుబట్టారు. అయితే, ఆదివారం కావడంతో క్షేత్ర రహదారులు అప్పటికే భక్తుల వాహనాలతో నిండిపోయాయి. దీంతో వన్‌వే మార్గం గుండా పాదయాత్రకు అనుమతిలేదని భీమడోలు సీఐ వి.వెంకటేశ్వరరావు, స్థానిక ఎస్సై టి.సుధీర్ వారికి సూచించారు. అయినా టీడీపీ శ్రేణులు వినకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో కొందరు టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి హైడ్రామాను సృష్టించారు. ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తింది. ఎంతచెప్పినా వినకుండా పోలీసులను తోసుకుంటూ వారు ముందుకు సాగారు. టీడీపీ శ్రేణుల తీరుపై అసహనం టీడీపీ నేతల తీరుతో అక్కడున్న భక్తులు, స్థానికులు తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేశారు. అమరావతి రైతుల పేరుతో చేస్తున్న పాదయాత్ర లగ్జరీ యాత్రగా ఉందని అభివర్ణించారు. యాత్ర వెంట వెళ్తున్న లగ్జరీ బస్సు, మొబైల్ టాయిలెట్లు, మంచాలు, పరుపులు వంటి వాటిని చూసి ఇది పాదయాత్రా? అని అంతా ముక్కున వేలేసుకున్నారు. మరోవైపు.. ఈ పాదయాత్ర కోసం మండల టీడీపీ నేతలు దాదాపు రూ.16 లక్షలకు పైగా ఖర్చుచేసినట్లు సమాచారం. -
బరిగీసిన పెత్తందార్లు
ఇప్పుడు బరిగీసింది పెత్తందార్లే. వారు యుద్ధ సన్నాహాల దశను దాటి దండయాత్రల దశకు చేరుకున్నారు. ‘అమరావతి రైతుల అరసవిల్లి యాత్ర’ అనే ముద్దు పేరు పెట్టుకున్నారు. దండయాత్రలకెప్పుడూ ముద్దుపేర్లే ఉంటాయి. సారంలో మాత్రం అదొక ఆర్థిక – సాంస్కృతిక సామ్రాజ్యవాదం. ధనస్వాముల స్వార్థ ప్రాయోజితం. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతమివ్వడం కోసం విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దానితోపాటు రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద నగరం కావడం, కొద్దిగా ప్రోత్సహిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చోదకశక్తిగా మారగల అవకాశాలు విశాఖకు ఉండటం కూడా ప్రభుత్వం ఆలోచనకు కారణం. అమరావతి వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ ఆలోచన ఆటంబాంబులా తోస్తున్నది. ‘నీకు రాజధాని అర్హత లేదు సుమా! తోక ముడుచుకో విశాఖా! కాదంటే ఖబడ్దార్!!’ అని హెచ్చరించడానికే ఈ దండయాత్రను నడుపుతున్నారు. విశాఖపట్నం గుండెల మీదుగా దండు నడపాలని సంకల్పించారు. ఇది కచ్చితంగా కవ్వింపు చర్యేనని మెదడున్న మానవకోటి అనుమానించడం అత్యంత సహజం. ఎందుకీ కవ్వింపు?. మనుషుల్ని విడదీయడం కోసం, మెదళ్లలో విషబీజాలు నాటడం కోసం, కల్లోలిత వాతావరణాన్ని కల్పించడం కోసం, అంతిమంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం! ఆయన్నెందుకు గద్దె దించాలి? కారణాలు చరిత్ర నిండా కనిపిస్తాయి. పేద ప్రజలూ, కష్టజీవుల మోముల్లో చైతన్యపు ఛాయలు కదలాడిన ప్రతి సందర్భంలోనూ ధనవంతులు దండధారులౌతారు. దండ యాత్ర చేస్తారు. ఇది నియమం. సంకెళ్లు తెంచుకోవాలనే తలంపు బానిసలకు పదేపదే కలుగుతూనే ఉంటుంది. స్పార్టకస్ వంటి యోధుని స్ఫూర్తిమంతమైన నాయకత్వం లభించి నప్పుడు వారు చెలరేగిపోతారు. రోమ్ మహాసామ్రాజ్య సింహాసనాన్నే ధిక్కరిస్తారు. అప్పుడు ఆ మహాసామ్రాజ్యంలోనే అందరికంటే శ్రీమంతుడైన మార్కస్ క్రాసిస్ అనేవాడు లక్షమంది రోమ్ సైనికుల్ని వెంటేసుకొని వేటకు బయల్దేరు తాడు. బానిస నేతల్ని శిలువేస్తాడు. తన వర్గ ప్రయోజనాలను కాపాడుకుంటాడు. శ్రమదోపిడీ నుంచి విముక్తి పొందాలని కార్మికుడూ, కర్షకుడూ కోరుకోవడం సహజం. తన కాయాన్ని పిండగా కారిన స్వేదానికి గిట్టుబాటు ధర కోసం ఆరాటపడతాడు. అవసరమైతే పోరాటానికి సిద్ధపడతాడు. ప్యారిస్ కమ్యూన్లను సృష్టించు కుంటాడు. అప్పుడు ఫ్రెంచ్ భూస్వాములు, ధనస్వాముల తరఫున ఒక ఫ్రెంచి ‘జాతీయ’ సైన్యం వేటకు బయల్దేరుతుంది. పొత్తిళ్లలో ఉన్న కమ్యూన్ శిశువును పీక నులిమి చంపేస్తుంది. ఇప్పుడు అమృతోత్సవ చారిత్రక సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్న తెలంగాణ సాయుధ పోరాటం కూడా ఇదే కథను చెబుతుంది. దొరలు, దేశ్‌ముఖ్‌లు, జాగీర్దార్ల పాలనలో నైజాం గ్రామసీమలు శుష్కించిపోతాయి. కూలీనాలీ బక్కజనం వెట్టి చాకిరీ, దౌర్జన్యాల కింద నలిగిపోతారు. పేద రైతులు పండించిన పంటనంతా లెవీ కింద లెక్కచెప్పి పస్తుల్ని ఆశ్రయిస్తుంటారు. వారి గుండె మంటలకు కమ్యూనిస్టుల ఆజ్యం తోడవుతుంది. బడుగులే పిడుగులవుతారు. బందూకులందుకొని తిరగబడ తారు. దొరలు, పెత్తందార్లు పారిపోతారు. మూడువేల గ్రామాల్లో పేదల ‘స్వరాజ్యం’ ఏర్పడుతుంది. పది లక్షల ఎకరాల భూమిని పంచుకుంటారు. ఉమ్మడి వ్యవసాయానికి సన్నాహాలు చేసుకుంటారు. అదే సమయంలో హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడానికి యూనియన్ సైన్యం బయల్దేరుతుంది. నవాబు సహకారంతో నాలుగు రోజుల్లోనే విలీన కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత నాలుగేళ్లపాటు యూనియన్ సైన్యాలు తెలంగాణ పల్లెల్లోనే తిష్ఠవేస్తాయి. పారి పోయిన దొరల్ని పునఃప్రతిష్ఠాపన చేస్తాయి. ఆక్రమించుకున్న భూముల్ని దొరలకు అప్పగిస్తాయి. అన్యాయానికి గురవుతున్న వారు చైతన్యవంతులవుతున్న ప్రతి సందర్భంలో ఆధిపత్య పెత్తందార్లు దాడులకు దిగారు. యుద్ధాలు జరిగాయి. యుద్ధం జరిగిన ప్రతిసారీ ఓడినా, గెలిచినా సరే బలహీనవర్గాలు బలం పుంజుకుంటూ వస్తున్నాయి. ఒక్కొక్కటిగా కనీస ప్రజాస్వామిక హక్కుల్ని సాధించుకుంటూ వచ్చాయి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ధనస్వామ్యం రూపు మార్చుకున్నదంతే! స్వభావాన్ని మార్చుకోలేదు. రాజధాని యాత్ర పేరుతో ప్రారంభమైన దండయాత్ర ఉద్యమాన్ని పెత్తందార్ల ఉద్యమంగా స్వయంగా ఏపీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్ అభివర్ణించారు. మొన్న శాసనసభ సమావేశాల్లోనే ఆయన ఈ మాటన్నారు. రాజధానుల దగ్గర్నుంచి గ్రామస్థాయి వరకూ పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎంత ఎక్కువ వికేంద్రీకరణ జరిగితే పేదవర్గాలకు అంత ఎక్కువ మంచి జరుగుతుందని ఉదాహరణలతో ఉటంకించారు. తరతరాలుగా అన్యాయానికి, వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, అగ్రవర్ణ పేదలకు న్యాయం చేయడం కోసం వికేంద్రీకరణను ఒక మార్గంగా ఎంచుకున్నట్లు చెప్పారు. ఆయన తన ప్రభుత్వ విధాన సహేతుకతను ఎంతో సుబోధకంగా వివరించారని ఆరోజు వచ్చిన ఫీడ్‌బ్యాక్ నిరూపించింది. టీవీలో ముఖ్యమంత్రి ప్రసంగం విన్న మిత్రుడొకరు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. ఆయన ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసి నప్పుడు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో చేసిన కొన్ని బెస్ట్ ప్రసంగాలను ఎంపిక చేసి, అంతే సంఖ్యలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా చేసిన ప్రసంగాలను కూడా తీసుకోవాలట! అలాగే ప్రతిపక్ష నాయకుల హోదాలో చేసిన ప్రసంగాలను కూడా! వీటిపై నిపుణుల చేత కంటెంట్ ఎనాలసిస్ చేయిస్తే సరిపోతుంది. విజనరీ ఎవరో తేలిపోతుంది. దూరదృష్టి గల నేత ఎవరో తేలిపోతుందంటాడు ఆ ప్రొఫెసర్! చంద్రబాబు ప్రసంగాల్లో ఊకదంపుడు, శుష్కప్రియాలు తప్ప ఏమీ ఉండవనీ, ప్రసంగ పాఠాల్లో నిజాయితీతో కూడిన ప్రమాణాలను పాటించడం కానీ, చెప్పే విషయానికి సరైన ఆధారాలను జోడించడం కానీ చాలా అరుదనీ ఆయన అభిప్రాయం. వైఎస్ జగన్ ప్రసంగాలు ఇందుకు భిన్నంగా విశ్వసనీయత ప్రస్ఫుటమయ్యే విధంగా ఉంటాయని చెప్పు కొచ్చారు. తాను ఖర్చు పెట్టే ప్రతి పైసా సూటిగా లక్ష్యాన్ని చేరుకునే విధంగా పారదర్శకత, వికేంద్రీకరణలతో ఏర్పాటు చేసుకున్న పాలనా వ్యవస్థ ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. ‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతా’ లంటాడు తిలక్. తరతరాలుగా కష్టాలతో, నష్టాలతో, బరువు లతో, బాధ్యతలతో కునారిల్లిపోతున్న జనావళి కన్నీళ్లను దూరం చేయడానికి తన ప్రభుత్వ కార్యక్రమాలు ఎట్లా ఉపయోగ పడుతున్నాయో జగన్ వివరించారు. కన్నీటితో కడిగిన ప్రతి అక్షరం పునీతమవుతుంది. అందుకే జగన్ ప్రసంగాలకు జనంలో అంత విశ్వసనీయత, విలువ! తాను మూడు రాజధా నులు కావాలని ఎందుకు ప్రతిపాదిస్తున్నాడో ఆయన చెప్పారు. అమరావతి ప్రాంతానికి తాను వ్యతిరేకం కానే కాదని, ఇక్కడి అభివృద్ధిని కూడా ప్రాణప్రదంగా కాంక్షిస్తున్నానని చెప్పారు. విజయవాడ – గుంటూరు నగరాల అభివృద్ధిని కూడా చంద్రబాబు ఎంత నిర్లక్ష్యం చేశారనేది ఎత్తిచూపారు. తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల శ్రేయస్సు కోసం, సాధికారత కోసం తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై బురదజల్లడానికి ‘దుష్టచతుష్టయం’ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందనీ, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతున్నదనీ ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ ఎంత రాద్ధాంతం సృష్టించాయో ప్రజలకు తెలిసిన విషయమే. జీఎస్డీపీ వృద్ధిరేటులో రాష్ట్రం అగ్రస్థానానికి ఎగబాకిందనీ, దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 4.4 శాతం నుంచి 5 శాతానికి పెరిగిందనీ ఆర్బీఐ గణాంకాలను ఉటంకిస్తూ ఆయన సభకు వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉందనే విషయాన్ని రికార్డుల ఆధారంతో నిరూపించారు. ఈ నిరూపణకు సదరు ‘దుష్టచతుష్టయం’ జవాబు చెబుతుందని ఆశించడం దండగ. విపక్ష కూటమి రాజధాని ఆందోళన వెనుక పెత్తందార్ల ప్రయోజనాలున్నాయని సభలో ముఖ్యమంత్రి చెప్పడమే కాదు, రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. రాజధాని ప్రాంతంలో వారి రియల్ ఎస్టేట్ వ్యాపార భయాలు తక్షణ కారణమైతే అవచ్చు గానీ, పేద ప్రజల సాధికారతా కార్యక్రమాలు మొత్తం కూడా ఎల్లో కూటమి పెత్తందార్ల ఉద్యమానికి కారణాలే. ఈ వ్యతిరేకతను అడుగ డుగునా వారు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం బోధన దగ్గర్నుంచి మహిళలకు ఇళ్ల పట్టాల వరకు అనేక కార్యక్రమాలకు అడ్డంకులు కల్పించారు. కనీవినీ ఎరుగని గోబెల్స్ దుష్ప్రచారానికి తెర తీశారు. పేద పిల్లలందరూ ఉన్నత చదువులు, నాణ్యమైన చదువులు చదివితే పెత్తందార్లకు నౌకర్లు, చాకర్లు దొరకరని భయం. డ్రైవర్లు, బంట్రోతులు దొరకరని భయం. వ్యవసాయం లాభసాటిగా మారితే పంట భూముల్ని చౌకగా కొట్టేయలేమని భయం. రైతులు రోడ్డున పడకపోతే చీప్ లేబర్ దొరకదనే భయం. మహిళలకూ, బలహీనవర్గాలకూ పదవులో,్ల పనుల్లో భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్తులో తమ గుత్తాధి పత్యం దెబ్బతింటుందన్న భయం. అసెంబ్లీలో ముఖ్యమంత్రే స్వయంగా చెప్పినట్టు ఈ ఎల్లో పెత్తందార్లు, వారి బినామీలు ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేసిన భూముల దగ్గరే రాజధాని రావాలి. ఈ పెత్తందార్లు నడిపే పత్రికల్నే ప్రజలంతా చదవాలి. వాళ్లు నడిపే చిట్‌ఫండ్ కంపెనీల్లోనే జనం చిట్టీలు కట్టాలి. వాళ్ల పాల డెయిరీలే ఉండాలి. వాళ్లే సినిమాలు తీయాలి. వాళ్లే పరిశ్రమలు పెట్టాలి. మార్కెట్లో ఇంకొకడు పోటీ ఉండొద్దు. ఇంకొకడు బాగా బతకొద్దు. ఈ దురహంకార పోకడకూ, ఈ స్వార్థ చింతనకూ జగన్ పరిపాలనలో ముకుతాడు పడుతుందనే ఆందోళనతో పెత్తందార్లు అల్లాడుతున్నారు. మూడేళ్లుగా దుర్మార్గమైన విష ప్రచారాన్ని కురిపించినా జగన్ ప్రభుత్వం చెక్కుచెదరలేదు. పైపెచ్చు తల ఎత్తుకొని నిలబడింది. రాష్ట్ర పురోగతిని తల ఎత్తుకునేలా నిలబెట్టగలిగింది. ఆదాయంలో సింహభాగాన్ని సమకూర్చగల మహానగరం లేకపోయినా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రెండు లక్షలు దాటిందని తాజా అంచనా. ప్రచారాలతో పని జరగడం లేదని ఇప్పుడు మారీచుడు మాయలేడి వేషం ధరించాడు. ఒక మాయా ఉద్యమాన్ని ప్రారంభించాడు. స్వీయ రియల్ ఎస్టేట్ ప్రయోజ నాన్ని రైతాంగ ప్రయోజనంగా చిత్రిస్తున్నారు. రకరకాల వ్యక్తుల నుంచి, శక్తుల నుంచి, వ్యవస్థల నుంచి, సంస్థల నుంచి మద్దతును చదివించుకొంటున్నారు. దివాళా తీసిన రెండు మూడు పార్టీలను పెద్ద ముత్తయిదువులుగా పేరంటానికి పిలిచి పోరాటం బొట్లు పెట్టారు. ఈ పోరాటం వెనకున్న ఆరాటంపై ప్రజల్లో సంపూర్ణ అవగాహన ఉన్నది. రాజధాని యాత్ర పేరుతో ప్రారంభమైన దండయాత్ర ఉద్యమాన్ని పెత్తందార్ల ఉద్యమంగా స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివర్ణించారు. మొన్న శాసనసభ సమావేశాల్లోనే ఆయన ఈ మాటన్నారు. రాజధానుల దగ్గర్నుంచి గ్రామస్థాయి వరకూ పరిపాలన వికేంద్రీకరణే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎంత ఎక్కువ వికేంద్రీకరణ జరిగితే పేద వర్గాలకు అంత ఎక్కువ మంచి జరుగుతుందని ఉదాహరణలతో ఉటంకించారు. తరతరాలుగా అన్యా యానికి, వివక్షకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, అగ్రవర్ణ పేదలకు న్యాయం చేయడం కోసం వికేంద్రీకరణను ఒక మార్గంగా ఎంచుకున్నట్లు చెప్పారు. ఆయన తన ప్రభుత్వ విధాన సహేతుకతను ఎంతో సుబోధకంగా వివరించారని ఆరోజు వచ్చిన ఫీడ్‌బ్యాక్ నిరూపించింది. టీవీలో ముఖ్యమంత్రి ప్రసంగం విన్న మిత్రుడొకరు ఒక ఆసక్తికరమైన సూచన చేశారు. ఆయన ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసినప్పుడు ఆయన అసెంబ్లీ సమావేశాల్లో చేసిన కొన్ని బెస్ట్ ప్రసంగాలను ఎంపిక చేసి, అంతే సంఖ్యలో వైఎస్ జగన్ ముఖ్య మంత్రిగా చేసిన ప్రసంగాలను కూడా తీసుకోవాలట! అలాగే ప్రతిపక్ష నాయకుల హోదాలో చేసిన ప్రసంగాలను కూడా! వీటిపై నిపుణుల చేత కంటెంట్ ఎనాలసిస్ చేయిస్తే సరిపోతుంది. విజనరీ ఎవరో తేలిపోతుంది. దూరదృష్టి గల నేత ఎవరో తేలి పోతుందంటాడు ఆ ప్రొఫెసర్! ప్రజల శ్రేయస్సు కోసం, సాధికారత కోసం తన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై బురదజల్లడానికి ‘దుష్ట చతుష్టయం’ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందనీ, ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాబోతున్నదనీ ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ ఎంత రాద్ధాంతం సృష్టించాయో ప్రజలకు తెలిసిన విషయమే. జీఎస్డీపీ వృద్ధిరేటులో రాష్ట్రం అగ్రస్థానానికి ఎగబాకిందనీ, దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 4.4 శాతం నుంచి 5.2 శాతానికి పెరిగిందనీ ఆర్బీఐ గణాంకాలను ఉటంకిస్తూ ఆయన సభకు వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉందనే విషయాన్ని రికార్డుల ఆధారంతో నిరూపించారు. ఈ నిరూపణకు సదరు ‘దుష్ట చతుష్టయం’ జవాబు చెబుతుందని ఆశించడం దండగ. విపక్ష కూటమి రాజధాని ఆందోళన వెనుక పెత్తందార్ల ప్రయోజనాలున్నాయని సభలో ముఖ్యమంత్రి చెప్పడమే కాదు, రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. రాజధాని ప్రాంతంలో వారి రియల్ ఎస్టేట్ వ్యాపార భయాలు తక్షణ కారణమైతే అవచ్చు గానీ, పేద ప్రజల సాధికారతా కార్యక్రమాలు మొత్తం కూడా ఎల్లో కూటమి పెత్తందార్ల ఉద్యమానికి కారణాలే. ఈ వ్యతిరేకతను అడుగ డుగునా వారు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం బోధన దగ్గర్నుంచి మహిళలకు ఇళ్ల పట్టాల వరకు అనేక కార్యక్రమాలకు అడ్డంకులు కల్పించారు. కనీవినీ ఎరుగని గోబెల్స్ దుష్ప్రచారానికి తెర తీశారు. పేద పిల్లలందరూ ఉన్నత చదువులు, నాణ్యమైన చదువులు చదివితే పెత్తందార్లకు నౌకర్లు, చాకర్లు దొరకరని భయం. డ్రైవర్లు, బంట్రోతులు దొరకరని భయం. వ్యవసాయం లాభసాటిగా మారితే పంట భూముల్ని చౌకగా కొట్టేయలేమని భయం. రైతులు రోడ్డున పడకపోతే చీప్ లేబర్ దొరకదనే భయం. మహిళలకూ, బలహీన వర్గాలకూ పదవులో,్ల పనుల్లో భాగస్వామ్యం పెరుగుతూ పోతే భవిష్యత్తులో తమ గుత్తాధిపత్యం దెబ్బతింటుందన్న భయం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పాదయాత్ర పేరుతో వంకర రాజకీయం
కోటనందూరు: అమరావతి రైతుల పాదయాత్ర పేరుతో మాజీ సీఎం చంద్రబాబు వంకర రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బిళ్లనందూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేయడానికే రాజధానిగా అమరావతి ఉండాలంటూ రైతులతో చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల ముసుగులో పాదయాత్ర చేయించే బదులు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ యాత్ర చేయొచ్చు కదా..? అని ప్రశ్నించారు. తండ్రీకొడుకులు పాదయాత్ర చేస్తే ప్రజలు చెప్పులతో కొట్టే పరిస్థితి ఉంది కాబ ట్టి దొడ్డిదారిలో ప్రయత్నాలు మొదలు పెట్టారన్నారు. చంద్రబాబు పాదయాత్రగా విశాఖ వచ్చి అక్కడ పరిపాలన రాజధాని వద్దని చెప్పగలరా? అని ప్రశ్నించారు. అమరావతి రాజధాని అనేది ఒక పెద్ద స్కామ్ అని మంత్రి ఆరోపించారు. చంద్రబాబుకు ప్రజల్లో తిరిగే ధైర్యం లేదు కాబట్టే రైతులను రెచ్చగొట్టి పాదయాత్ర చేయిస్తున్నారన్నారు. చంద్రబాబు చేయించే యాత్ర అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కాదని, అది కేవలం ఒక కులం అభివృద్ధి కోసం చేసే పాదయాత్ర మాత్రమేనని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాజధానులు ఉంటే అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందుతాయన్నారు. -
ధనస్వామ్యం దండయాత్ర!
మన స్వరాజ్యానికి మొన్ననే అమృతోత్సవం జరుపుకొన్నాం. స్వరాజ్యం సురాజ్యం కావాలంటే ప్రజలే ప్రభువులు కావాలని మన రాజ్యాంగం చాటి చెప్పింది. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రిపబ్లిక్ డే కూడా మరో రెండేళ్లలో అమృతోత్సవం తలుపు తట్టబోతున్నది. ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పడే ప్రజా ప్రభుత్వ పాలనే ప్రజాస్వామ్యమని అబ్రహాం లింకన్ చెప్పారు. అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగంలోని అన్ని అధికరణాల్లో అణువణువునా ఇదే స్ఫూర్తి ప్రవహించింది. ప్రజలందరి చేత ఎన్నికైన ప్రజా ప్రభుత్వం ప్రజలందరి కోసం పని చేయాలి. భారత రాజ్యాంగానికి హృదయంగా భావించే పీఠిక ఇదే విషయాన్ని మూడు ముక్కల్లో చెప్పింది. కొన్ని చారిత్రక కారణాల వలన సమాజంలోని విశాల జనబాహుళ్యానికి వెనకబాటు తనం వారసత్వంగా లభించింది. వారందరినీ ముందు వరసలో ఉన్నవారి సరసన నిలబెట్టడానికి ప్రభుత్వం పూనుకోవాలని రాజ్యాంగం ఆదేశిస్తున్నది. అప్పుడే సమాజంలోని ప్రజలందరి మధ్యన ఆరోగ్యకరమైన పోటీ నెలకొంటుంది. రాజ్యాంగ ఆదేశాలు అటకెక్కిన ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. డబ్బున్నవాడే ప్రజా ప్రతినిధిగా ఎన్నిక కాగలిగే దుస్థితికి ప్రజాస్వామ్యం దిగజారుతున్నది. విద్య అంగడి సరుకైన ఫలితంగా నాణ్యమైన విద్య కలవారి బిడ్డలకే రిజర్వయి పోయింది. పేద పిల్లలకు నాసిరకం చదువు తప్ప గత్యంతరం లేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా పరిపాలన చేయడానికి గతంలో ప్రయత్నాలు జరగకపోలేదు. ఈ సందర్భంగా కాలగమనంలోని ఒక కీలక ఘట్టాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. పి.వి. నరసింహారావు ఈ దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆర్థిక వ్యవస్థను సరళీకరించవలసిన అనివార్య పరిస్థితులు ఏర్ప డ్డాయి. ఈ కర్తవ్యాన్ని ఆయన వ్యక్తిగత శ్రద్ధతో నిర్వహించారు. క్రమంగా గ్లోబల్ ఎకానమీతో భారత ఆర్థిక వ్యవస్థ అనుసంధానం మొదలైంది. బహుళజాతి కంపెనీలు, వాటి గురుపీఠమైన ప్రపంచ బ్యాంకు రంగప్రవేశం చేశాయి. వారికి దేశంలో కమీషన్లు పుచ్చుకొని పనులు చేసిపెట్టగల రాజకీయ దళారుల అవసరం ఏర్పడింది. ప్రైవేటీకరణ జోరు పెరగడంతో గనులు, వనులు, సహజ వనరులపై పెత్తనానికి పెట్టుబడి దారులు పోటీపడ్డారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉండేవారితో వారికి అవసరాలు పెరిగిపోయాయి. తమ ప్రయో జనాలకు అనుకూలంగా మెలిగే నాయకుల కోసం వారు అన్వేషించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ఆయనది సంక్షేమ ఎజెండా. పేదల అనుకూల ఫిలాసఫీ. స్వదేశీ విదేశీ పెట్టుబడి దారులకు పనికివచ్చే నాయకుడు కాదు. అదే సమయంలో హఠాత్తుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లందరికీ ఎన్టీ రామారావు పట్ల విరక్తి కలిగింది. ఆయన లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం వారికి నచ్చలేదు. రాత్రికి రాత్రే తిరుగుబాటు చేశారు. కథ ఈ రకంగా ప్రచారంలోకి వచ్చింది. వాస్తవానికి ఎన్నికల కంటే రెండేళ్ల ముందుగానే ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. తిరుపతిలో లక్షమంది సమక్షంలో లక్ష్మీపార్వతిని భార్యగా ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభల్లో ఎన్టీఆర్‌తోపాటు లక్ష్మీపార్వతి కూడా పాల్గొని ప్రసంగించారు. అప్పుడు లేని ఆగ్రహం గెలిచిన తర్వాత ఏడాదిలోపే పార్టీ ఎమ్మెల్యేలకు కలగడం విడ్డూరమే. కానీ ఈ విడ్డూరమే చరిత్రగా నమోదైంది. అసలు జరిగింది వేరు. సరళీకరణతో అందివస్తున్న అవకాశాలను వేగంగా ఆక్రమించుకోవాలనుకునే స్వార్థపూరిత శక్తులకు చంద్రబాబులో ఒక నమ్మకమైన సేవకుడు కనిపించాడు. ప్రపంచ బ్యాంకు ఆకాంక్షల మేరకు లక్షలాది మంది రైతుల్ని వ్యవసాయ రంగం నుంచి తరిమేసేవాడు, విద్య – వైద్య రంగాలను కూడా ప్రైవేట్ రంగానికి అప్పగించగలిగేవాడు, ప్రభుత్వ ఉద్యోగుల్ని కోతకోసేవాడు చంద్రబాబులో కనిపించాడు. మీడియాతో సహా సమస్త వ్యవస్థలూ చంద్రబాబుకు సహకరించాయి. నిశ్శబ్దంగా ఎన్టీఆర్ పదవీచ్యుతుడయ్యారు. నిస్సహాయంగా ఆయన మరణించారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు ముఖ్య మంత్రిగా పనిచేసిన కాలం గుర్తున్నవారికి నాటి సామాజిక సంక్షోభం కూడా గుర్తుండే ఉంటుంది. పంట పొలాలు మరు భూములుగా మారడం గుర్తుండే ఉంటుంది. ఫ్యాక్టరీల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేయడానికి చీప్ లేబర్ దొరకాలంటే వ్యవసాయ రంగం నుంచి లక్షలాది మందిని బయటకు పంపాలి. అందువల్లనే ‘వ్యవసాయం దండగ’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించి కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించాడు. ప్రభుత్వ విద్యారంగాన్నీ, వైద్యరంగాన్నీ నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ వ్యాపారుల్ని ప్రోత్సహించాడు. ఫలితంగా పేదలు, రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. తాను అమలుచేస్తున్న విధానాలకు మద్దతుగా తన భావజాలాన్నీ, ఆలోచనల్నీ వివరిస్తూ ‘మనసులో మాట’ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఆర్థిక రంగాన్ని మార్కెట్ శక్తులకు వదిలేయాలనేది ఆయన సిద్ధాంతం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వేగంగా పరిస్థితుల్ని చక్కదిద్ది, పెను సామాజిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించారు. మానవీయ అభివృద్ధి కోణాన్ని ఆవిష్కరించారు. అత్యున్నత స్థాయిలో సమాజాన్ని ప్రజాస్వామ్యీకరించడం కోసం, ప్రజాశక్తులను సాధికారం చేయడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆంధప్రదేశ్‌లో కొన్ని బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. ప్రజా సంక్షేమం, మానవీయ అభివృద్ధి విషయాల్లో ఆయన ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డిలను అధిగమించారు. ‘అధికారం అందరికీ – అభివృద్ధి అందరిదీ’ అనే దిశగా తన ప్రభుత్వ ప్రాథమ్యాలను ఆయన నిర్ధారించుకున్నారు. అధికార పీఠాలకు ఆమడదూరంలో ఉంటున్న అనేక సామాజిక వర్గాలను గుర్తించి వారి నుంచి ఎంపిక చేసిన వారికి వివిధ స్థాయుల్లో పదవులు కల్పించారు. ఆ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల దగ్గర్నుంచి రాష్ట్ర కేబినెట్ వరకు సింహభాగం పదవులను బలహీన వర్గాలకు కేటాయించారు. నామినేషన్ ద్వారా ఇచ్చే కాంట్రాక్టు పనుల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ ఈ వర్గాలకే పెద్దపీట వేశారు. అన్ని విభాగాల్లో అన్ని స్థాయిల్లోనూ మహిళలకు అర్ధభాగం పదవులను కేటా యించారు. రాజకీయ సాధికారత దిశగా బలహీనవర్గాల ప్రజలు, మహిళలు వేసిన తొలి అడుగులివి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు దేశవిదేశాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తు న్నది. ఈ మూడేళ్లలో రెండేళ్ల కాలాన్ని కోవిడ్ కాటువేసినప్పటికీ సగటున ఒక్కో విద్యార్థి మీద వైఎస్ జగన్ ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున ఖర్చు చేసింది. ఇప్పుడు అదనంగా ఏటా 24 వేల రూపాయల విలువైన ‘బైజూస్’ కంటెంట్‌ను ఉచితంగా అందివ్వబోతున్నది. అన్ని వర్గాల నుంచి వచ్చే పిల్లలకు వారి ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అత్యంత నాణ్యమైన విద్యను ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నది. ప్రపం చంతో పోటీ పడగల మెరుగైన మానవ వనరులను తీర్చి దిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రజారోగ్య వ్యవస్థ కొత్త పుంతలు తొక్కబోతున్నది. ప్రతి ఇంటినీ గడువు ప్రకారం ఒక ఫ్యామిలీ డాక్టర్ సందర్శించే దిశగా, ప్రతి వ్యక్తి ఆరోగ్య ప్రొఫైల్ కంప్యూటర్లో నిక్షిప్తమయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఒక హెల్త్ సెంటర్ ఏర్పాటైంది. వ్యవసాయా భివృద్ధిలో రైతుకు అండగా నిలబడేందుకు ఏర్పాటుచేసిన ఆర్బీకే సెంటర్ల ప్రయోగాన్ని కళ్లారా చూసేందుకు నిత్యం ఇతర రాష్ట్రాల నుంచి ప్రతినిధి బృందాలు ఏపీకి వస్తున్నాయి. ప్రజల సాధికారత, ప్రభుత్వ వ్యవహారాల పారదర్శకత, అధికార వికేంద్రీకరణ అనే మూడు అంశాలు సమాజ ప్రజా స్వామ్యీకరణ స్థాయిని నిర్ధారిస్తాయి. అత్యున్నత స్థాయి ప్రజా స్వామ్యీకరణ మన రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యం. ఉన్నత స్థాయి ప్రజాస్వామ్యీకరణ ఉన్నత స్థాయి ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుందని ఇప్పుడు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన జీఎస్డీపి గ్రోత్ రేట్ జాబితాలో అగ్రస్థానంలో నిలబడిన ఆంధ్రప్రదేశ్ ఇదే విషయాన్ని నిర్ధా రించింది. ప్రభుత్వ పథకాల అమలులో ఒక్క పైసా వృథా కాని విధంగా పారదర్శక పంపిణీ విధానాన్ని రూపొందించింది. అధికార వికేంద్రీకరణను గ్రామస్థాయికి తీసుకొనిపోయింది. గ్రామ సచివాలయాల ఏర్పాటు వికేంద్రీకరణలో చిట్టచివరి మెట్టు. ఈ వికేంద్రీకరణలో భాగంగానే రాష్ట్ర రాజధానిని కూడా విభిన్నమైన అభివృద్ధి దశల్లో ఉన్న మూడు భౌగోళిక ప్రాంతాల మధ్య విభజిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ చర్య ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి నిద్ర పట్టనీయడం లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కావడానికి చంద్రబాబుకు వివిధ కారణాలు దోహదపడ్డాయి. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడం తన నైజమని అనేక సందర్భాల్లో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితిలో ఆయనకు సంక్షోభం కనిపించింది. దాన్ని సొంత అవకాశంగా మలుచుకునే ప్రయత్నంలోనే ఐదేళ్ల పదవీకాలం గడిచిపోయింది. తనమీద నమ్మకంతో 34 వేల ఎకరాల భూమిని స్వయంగా రైతులు ల్యాండ్ పూలింగ్‌కు అప్పగించారని ఆయన చెప్పుకుంటారు. ఈ భూమిలో చాలా భాగాన్ని బాబు అనుయాయులు ముందుగానే కొనుగోలు చేసి రైతుల పేరుతోనే పూలింగ్‌కు అప్పగించారని, మిగిలిన రైతులను తప్పనిసరిగా ఇచ్చి తీరవలసిన పరిస్థితికి నెట్టివేశారని స్థానికులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికంటే ముందుగానే పూలింగ్ ప్రాంతానికి వెలుపల వేలాది ఎకరాల భూమిని తన అనుయాయుల చేత, తన వర్గీయుల చేత కొనిపించారనీ, ఇది అక్షరాల ఇన్సైడర్ ట్రేడింగేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రాజధాని పేరుతో ప్రపంచంలోనే పెద్దదైన ఒక రియల్ ఎస్టేట్ వెంచర్‌ను ఆయన ప్లాన్ చేశారు. ఈ వెంచర్‌పై కళ్లు చెదిరే లాభాలు ఆర్జించడం కోసం తన వారి చేత వేల కోట్లు పెట్టుబడులుగా పెట్టించినట్టు సమాచారం. ‘మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్’ అనే పేరు ఇప్పటికే ఈ వెంచర్‌కు స్థిరపడిపోయింది. మహిళా సాధికారతలో భాగంగా పేద వర్గాల మహిళల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలిచ్చింది. ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని తలకెత్తుకున్నది. అందులో భాగంగా రాజధాని ప్రాంతంలో కూడా ఒక 50 వేల మంది పేద వర్గాల మహిళలకు పట్టాలివ్వాలని నిర్ణయం తీసుకున్నది. దీంతో గగ్గోలు పుట్టిన తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లెక్కింది. పేద వర్గాలకు పట్టాలివ్వడం వల్ల సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని వాదించింది. ఇది పక్కా రియల్ ఎస్టేట్ వెంచరే అన్న అంశాన్ని ఈ చర్య నిర్ద్వంద్వంగా నిరూ పించింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా పేదలకు పట్టాలివ్వాల్సిందేననీ, అందుకు అవసరమైన చట్ట సవరణలు చేయాలనీ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ మీడియా ఉలిక్కిపడ్డాయి. ఇప్పుడు రాజధాని రైతుల పేరుతో అమరావతి నుంచి ఉత్తరాంధ్రలోని అరసవిల్లి దాకా ఒక పాదయాత్రను ప్రకటించారు. ‘ఇది పాదయాత్ర కాదు, విశాఖకు పాలనా రాజధానిని దూరం చేయడానికి సాగిస్తున్న దండయాత్ర’గా అక్కడి రాజకీయ నాయకులు, ప్రజలు పరిగణిస్తున్నారు. ‘జనాభాలో ఎనభై శాతంగా ఉన్న పేద వర్గాలకు చోటులేని ప్రాంతాన్ని రాజధానిగా మేం ఎలా అంగీకరిస్తామ’ని ఆ వర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ పాదయాత్ర పేరుతో పేదవర్గాల ప్రయోజనాల మీద ధనస్వామ్యం దండయాత్ర చేస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ విజన్‌కు చంద్రబాబు ఆలోచనా విధానం పూర్తిగా వ్యతిరేకమైనది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆవిష్కృతుడైన క్రమం, ఆయనే వెల్లడించుకున్న ఆయన ఫిలాసఫీ, అమలు చేసిన కార్యక్రమాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు ఆయన వెన్నంటి ఉన్న మీడియా, ఇతర వ్యవస్థలతో బాబు స్నేహ సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి. ఎన్టీ రామారావును గద్దె దించేంతవరకు మాయోపాయాలకు, మంత్ర విద్యలకే పరిమితమైన బాబు కోటరీ మీడియా ఆ తర్వాత యెల్లో మీడియాగా అవతరించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేసరికి గోబెల్స్ క్షుద్ర విద్యను ఆవాహన చేసి జనం మెదళ్లను కలుషితం చేయడాన్ని అలవాటు చేసుకున్నది. వైఎస్ జగన్ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచీ యెల్లో మీడియా సంస్థలు విషసర్పాల అవతారం దాల్చాయి. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన దగ్గర్నుంచి ఈ మూడేళ్లలో విషం చిమ్మని రోజు లేదు. సకల జన సాధికారత కోసం జగన్మోహన్రెడ్డి చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగా జనంలో ఆయనకు పెరుగుతున్న ఆదరణను సహించలేకపోతున్నది. ఆయన మీదా, ఆయన కుటుంబ సభ్యుల మీదా నిందా ప్రచారాలకు దిగజారుతున్నది. వారి సొంత ప్రయోజనాల కోసం పెట్టుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రైతాంగ పోరాటం అనే ముద్ర వేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ కుయుక్తులు ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమవుతున్నాయి. చంద్రబాబు, ఆయన పార్టీ, యెల్లో మీడియా ఆగడాల మీద, దుష్ప్రచారాల మీద బలహీన వర్గాల ప్రజలు అతి త్వరలో ప్రజాకోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేయబోతున్నారు. తమ బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం బోధనను వ్యతిరేకించినందుకూ, ‘అమ్మ ఒడి’పై దుష్ప్రచారం చేసినందుకూ అమ్మల సంఘం ఛార్జిషీటు సిద్ధ మవుతున్నది. బలహీన వర్గాల ఇళ్ల పట్టాలను కోర్టు ద్వారా అడ్డు కునే ప్రయత్నం చేసి నందుకు ఆ మహిళలంతా నేరారోపణ పత్రాన్ని రచిస్తున్నారు. రాజధాని ప్రాంతం నుంచి బలహీన వర్గాలను వెలివేస్తున్నందుకు ఆ వర్గాలు యెల్లో కూటమిపై అట్రాసిటీ అభియోగం చేయ బోతున్నాయి. ప్రజా కోర్టులో ఇక సందడే సందడి. ధనస్వామ్యం దండయాత్రలను పేదవర్గాలు చీల్చి చెండాడే సందడి. ‘ఇప్పుడు రాజధాని రైతుల పేరుతో అమరావతి నుంచి ఉత్తరాంధ్రలోని అరసవిల్లి దాకా ఒక పాదయాత్రను ప్రక టించారు. ‘ఇది పాదయాత్ర కాదు విశాఖకు పాలనా రాజధానిని దూరం చేయడానికి సాగిస్తున్న దండ యాత్ర’గా అక్కడి రాజకీయ నాయకులు, ప్రజలు పరిగ ణిస్తున్నారు. ‘జనాభాలో ఎనభై శాతంగా ఉన్న పేద వర్గాలకు చోటులేని ప్రాంతాన్ని రాజధానిగా మేం ఎలా అంగీకరిస్తామ’ని ఆ వర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ పాదయాత్ర పేరుతో పేదవర్గాల ప్రయోజనాల మీద ధనస్వామ్యం దండయాత్ర చేస్తున్నదని వారు ఆరోపి స్తున్నారు. జగన్ విజన్‌కు బాబు ఆలోచనా విధానం పూర్తిగా వ్యతిరేకమైనది. సీఎంగా చంద్రబాబు ఆవిష్కృ తుడైన క్రమం, ఆయనే వెల్లడించుకున్న ఆయన ఫిలా సఫీ, అమలుచేసిన కార్యక్రమాలు ఈ విషయాన్ని వెల్లడి స్తున్నాయి. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు ఆయన వెన్నంటి ఉన్న మీడియా, ఇతర వ్యవస్థలతో బాబు స్నేహ సంబంధాలు అలాగే కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్‌ను గద్దె దించేంతవరకు మాయోపాయా లకు, మంత్ర విద్యలకే పరిమితమైన బాబు కోటరీ మీడియా ఆ తర్వాత యెల్లోమీడియాగా అవతరించింది. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యేసరికి గోబెల్స్ క్షుద్ర విద్యను ఆవాహన చేసి జనం మెదళ్లను కలుషితం చేయడాన్ని అలవాటు చేసుకున్నది. జగన్ నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఏర్పడినప్పటి నుంచీ యెల్లో మీడియా సంస్థలు విష సర్పాల అవతారం దాల్చాయి. ఆయన సీఎంగా బాధ్యత లను స్వీకరించిన దగ్గర్నుంచి ఈ మూడేళ్లలో విషం చిమ్మని రోజు లేదు. సకల జన సాధికారతకోసం జగన్ చేపడుతున్న కార్యక్రమాల ఫలితంగా జనంలో ఆయ నకు పెరుగుతున్న ఆదరణను సహించ లేకపోతున్నది.’ ‘చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం గుర్తున్నవారికి నాటి సామాజిక సంక్షోభం కూడా గుర్తుండే ఉంటుంది. పంట పొలాలు మరు భూములుగా మారడం గుర్తుండే ఉంటుంది. ఫ్యాక్టరీల్లో, నిర్మాణ రంగాల్లో పనిచేయడా నికి చీప్ లేబర్ దొరకాలంటే వ్యవసాయ రంగం నుంచి లక్షలాది మందిని బయటకు పంపాలి. అందు వల్లనే ‘వ్యవసాయం దండగ’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపా దించి కృత్రిమ సంక్షోభాన్ని సృష్టించాడు. ప్రభుత్వ విద్యారంగాన్నీ, వైద్యరంగాన్నీ నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ వ్యాపారుల్ని ప్రోత్సహించాడు. ఫలితంగా పేదలు, రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. తాను అమలుచేస్తున్న విధానాలకు మద్దతుగా తన భావ జాలాన్నీ, ఆలోచనల్నీ వివరిస్తూ ‘మనసులో మాట’ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఆర్థిక రంగాన్ని మార్కెట్ శక్తులకు వదిలేయాలనేది ఆయన సిద్ధాంతం. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన డాక్టర్ వైఎస్ రాజ శేఖరరెడ్డి వేగంగా పరిస్థితుల్ని చక్కదిద్ది, పెను సామా జిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించారు. మాన వీయ అభివృద్ధి కోణాన్ని ఆవిష్కరించారు. అత్యున్నత స్థాయిలో సమాజాన్ని ప్రజాస్వామ్యీక రించడం కోసం, ప్రజాశక్తులను సాధికారం చేయడం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌లో కొన్ని బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. ప్రజా సంక్షేమం, మానవీయ అభివృద్ధి విషయాల్లో ఆయన ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర రెడ్డిలను అధిగమించారు. ‘అధికారం అందరికీ – అభివృద్ధి అందరిదీ’ అనే దిశగా తన ప్రభుత్వ ప్రాథమ్యాలను ఆయన నిర్ధారించుకున్నారు.’ వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
పాదయాత్రలో పేట్రేగిన రౌడీమూకలు
సాక్షి, తిరుపతి/తిరుపతి తుడా/తిరుపతి రూరల్ : అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని కోరుతూ సాగిన అమరావతి రైతుల పాదయాత్ర చివరి రోజైన మంగళవారం రైతుల ముసుగులో అల్లరి మూకలు రెచ్చిపోయాయి. ‘మీకు స్వాగతం అంటూ’ తిరుపతి ప్రజలు మూడు రాజధానులకు మద్దతుగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ ధ్వంసం చేశాయి. ఆందోళనకారులు పోలీసులపై ఇష్టారాజ్యంగా దూషణలకు దిగారు. స్థానికులను రెచ్చగొట్టారు. దమ్ముంటే రండిరా అంటూ.. టీడీపీ, జనసేనకు చెందిన కార్యకర్తలు సవాళ్లు చేశారు. పాదయాత్ర దారి పొడవునా నానా యాగీ చేశారు. అల్లర్లు సృష్టించేందుకు కొంతమంది యత్నించారు. కానీ, విషప్రచారం కోసం రైతుల ముసుగులో వీరు చేస్తున్న కవ్వింపు చర్యలపై రాయలసీమ మేధావుల ఫోరం, ఆప్స్, విద్యార్థులు, యువకులు, స్థానికులు సంయమనం పాటించారు. స్వాగతం పలికినా అలజడే అంతకుముందు.. ‘మీతో మాకు గొడవలు వద్దు.. మీకు మా స్వాగతం, మాకు మూడు రాజధానులే కావాలి’.. అంటూ రాయలసీమ మేధావుల ఫోరం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి (ఆప్స్), విద్యార్థులు తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని సున్నితంగా ప్లెక్సీలతో ప్రదర్శించి పాదయాత్రికులకు స్వాగతం పలికారు. కానీ, మద్యం మత్తులో తూలుతున్న కొంతమంది టీడీపీ, జనసేన కార్యకర్తలు అలజడి సృష్టించారు. ప్లెక్సీలను కాళ్లతో తన్నుతూ చించివేయడంతో కలకలం రేగింది. కొంతసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు.. మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ మేధావుల ఫోరం, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు నగరంలో ర్యాలీలు నిర్వహించారు. అయితే.. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని గుర్తించిన పోలీసులు వాటిని అడ్డుకున్నారు. అలాగే, తమ ప్రాంత ప్రయోజనాలను అడ్డుకోవద్దంటూ అనంతపురం నుంచి వచ్చిన యువకులకు పోలీసులు నచ్చచెప్పారు. దీంతో వారు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తిరుపతిలో ముగిసిన పాదయాత్ర అమరావతి రైతులు తమ పాదయాత్రను తిరుపతి మండలంలోని రామానాయడు కల్యాణమండపం నుంచి మొదలుపెట్టి నగరంలో కొనసాగించారు. అల్లర్లకు పాల్పడాలనే తమ కవ్వింపు చర్యలకు స్థానికుల నుంచి ప్రతిస్పందన లేకపోవడంతో కుట్రదారులు నిరాశగా వెనుతిరగడం కనిపించింది. 44రోజులపాటు సాగిన వీరి పాదయాత్ర మంగళవారం సాయంత్రం తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద ముగిసింది. అల్లరి మూకలపై కేసు నమోదు ఫ్లెక్సీలు చింపినందుకు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించటం.. స్థానికులను రెచ్చగొట్టేలా వ్యవహరించటంపై పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఇందుకు కారకులైన వారిపై కేసు నమోదు చేశారు. ప్లెక్సీలు చింపిన వారిలో టీడీపీ నాయకుడు కంకణాల రజనీకాంత్, నాయకులు నరసింహ యాదవ్, బీఎల్ సంజయ్, కార్యకర్త వెంకటేశ్‌తో పాటు జనసేనకు చెందిన బోత్ హరిప్రసాద్, కిరణ్‌రాయల్, రాజారెడ్డి, సుభాషిణి, రాజేష్యాదవ్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. యాత్ర వెనకున్నది చంద్రబాబే యూనివర్సిటీ క్యాంపస్: అమరావతి రైతుల పాదయాత్ర వెనకున్నది మాజీ సీఎం చంద్రబాబేనని.. ఈ విషయం అందరికీ తెలుసని డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి విమర్శించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన పార్టీ గురించి మాట్లాడటం దండగన్నారు. శాసనసభ ఎస్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. -
టీడీపీ నేతల అత్యుత్సాహం
నాగులుప్పలపాడు: అమరావతి రైతుల పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారు. రైతుల పేరుతో యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడంతోపాటు హైకోర్టు ఆదేశాలను తుంగలోతొక్కి పాదయాత్రను రసాభాస చేస్తున్నారు. 157 మందితో మాత్రమే పాదయాత్ర కొనసాగించాలన్న కోర్టు ఆదేశాలు పాటించకపోగా పాదయాత్రకు రక్షణ కల్పిస్తున్న పోలీసులపై దాడికి పాల్పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో నాలుగోరోజు గురువారం నాగులుప్పలపాడులో ప్రారంభమైన ఈ పాదయాత్రలో రైతుల ముసుగులో టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారు. మండలంలోని చదలవాడ గ్రామ ఎంపీటీసీ స్థానానికి ఈ నెల 16వ తేదీ ఎన్నిక జరగనున్నందున మండల వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందని పోలీసులు, అధికారులు పాదయాత్ర బృందానికి నోటీసులు ఇచ్చారు. అయినా.. పాదయాత్ర బృందం చదలవాడ సమీపంలోకి వెళ్లేసరికి తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజాతో పాటు అమ్మనబ్రోలు, చీర్వానుప్పలపాడు గ్రామాల టీడీపీ నేతలు, అనుచరులు పోలీసుల ఆంక్షలను పట్టించుకోకుండా పాదయాత్ర బృందంలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఎన్నికల కోడ్ ఉందని ఎంత చెప్పినా వారు ఆగకపోవడంతో పోలీసులు రోప్‌తో ఆపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు పోలీసులపై దాడికి దిగారు. ఒంగోలు రూరల్ సీఐ రాంబాబు చేతిలో ఉన్న లాఠీని లాక్కునేందుకు ప్రయత్నించారు. టీడీపీ నాయకుల దాడిని అదుపుచేసే క్రమంలో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చే«శారు. -
కెఎస్ఆర్ లైవ్ షో 05 November 2021
-
‘సీఎం వద్దే తేల్చుకుంటాం’
బీర్కూర్: కామారెడ్డి జిల్లా బీర్కూరు ప్రాంతంలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం, వడగళ్ల వానకు జరిగిన పంట నష్టంపై ఇక సీఎం వద్దే తేల్చుకుంటామంటూ బీర్కూరు అన్నదాతలు పట్టుబడుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌కు పాదయాత్ర చేపట్టారు. నష్ట పరిహారంపై జాయింట్ కలెక్టర్ సత్తయ్య, ఆర్డీవో రాజేశ్వర్‌ల హామీతో వారు సంతృప్తి చెందలేదు. వెంటనే పరిహారం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సీఎం కేసీఆర్ వద్దే తేల్చుకుంటామంటూ సుమారు 300 మంది రైతులు కిష్టాపూర్ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర ప్రారంభించారు. ఇందుకు బీర్కూరు ఎస్సై, ఎమార్వోల నుంచి అనుమతి కూడా పొందారు. కాగా, హైదరాబాద్ వెళ్లొద్దంటూ టీఆర్ఎస్ నాయకులు రైతులను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.