వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో సిట్ సహాయ నిరాకరణపై ఎన్‌ఐఎ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు సిట్ సహకరించడం లేదని ఎన్‌ఐఎ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. సిట్ వద్ద ఉన్న వివరాలు, ఆధారాలను ఎన్‌ఐఎకు అప్పగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సిట్ ఏసీసీ నాగేశ్వరరావుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు ఈ నెల 25 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే ఎన్‌ఐఏ దాఖలు చేసిన మెమోపై వాదనలు ఈనెల 23న వింటామని పేర్కొంది.