
సీబీఐ వలలో ఐటీ అధికారి
విశాఖపట్నం: ఆదాయపు పన్ను శాఖాధికారి ఒకరు సీబీఐ వలకు చిక్కారు. ఓ వ్యక్తి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఐటీ అధికారి శ్రీనివాసరావును సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.2.03 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ అధికారులు శ్రీనివాసరావును గురువారం కోర్టులో హాజరుపరచనున్నారు.