పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసరావు రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
బొబ్బిలి(విజయనగరం జిల్లా): పంచాయతీరాజ్ ఏఈ శ్రీనివాసరావు రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన బుధవారం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కేంద్రంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో జరిగింది. వివరాలు.. మండలంలోని చింతలవానిపేట గ్రామ సర్పంచ్ భర్త యామలగోపీ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని ఏఈ శ్రీనివాసరావును సంప్రదించాడు.
కాగా, ఏఈ రూ. 5వేలు లంచం ఇవ్వాలని గోపీని డిమాండ్ చేశాడు. దీంతో ఈ విషయంపై గోపీ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం గోపీ వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా ఏఈ శ్రీనివాసరావును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.