
'లాబీయింగ్ చేయండి, ఒత్తిడి తీసుకురండి'
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం కోసమే వైఎస్ జగన్ దీక్ష చేస్తున్నారని సీపీఎం జాతీయ నేత శ్రీనివాసరావు అన్నారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం కోసమే వైఎస్ జగన్ దీక్ష చేస్తున్నారని సీపీఎం జాతీయ నేత శ్రీనివాసరావు అన్నారు. వామపక్షాలు కూడా ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాయని చెప్పారు.
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అధికార టీడీపీ, బీజేపీ నేతలు విమర్శలు ఆపి ప్రత్యేక హోదాకు సహకరించాలని కోరారు. ప్రత్యేక హోదాకు అడ్డంకులుంటే లాబీయింగ్ చేయాలని, కేంద్రంపై ఒత్తడి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల్లో సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఊదరగొట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు మాట తప్పడం చేతగానితనం అవుతుందని విమర్శించారు.