కేంద్ర ప్రభుత్వ దుష్టవైఖరి మరోసారి బహిర్గతమైంది | CPI CPM Leaders AP Special Status Protest In YSR Kadapa | Sakshi
Sakshi News home page

కేంద్ర ప్రభుత్వ దుష్టవైఖరి మరోసారి బహిర్గతమైంది

Published Sat, Jul 7 2018 8:45 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

CPI CPM Leaders AP Special Status Protest In YSR Kadapa - Sakshi

మెడకు ఉరితాడు వేసుకొని నిరసన తెలుపుతున్న  సీపీఐ, సీపీఎం నాయకులు

రాజంపేట రూరల్‌: ఏపీకి ప్రత్యేక హోదా పై అఫిడవిట్‌ దాఖలు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ దుష్టవైఖరి మరొకసారి బహిర్గతమైందని సీపీఐ, సీపీఎం ఏరియా కార్యదర్శులు పి.మహేష్, సి.రవికుమార్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక బైపాస్‌ రహదారిలో ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కేంద్ర వైఖరిని నిరసిస్తూ మెడకు ఉరితాళ్లను వేసుకొని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం ఏపీని మోసం చేస్తూనే ఉందన్నారు.

విభజన హామీలన్ని అమలు చేశామని బూటకపు అఫిడవిట్‌ దాఖలు చేసిందని విమర్శంచారు. రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సీపీఐ నాయకులు ఎంఎస్‌ రాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్, ఏఐఎస్‌ఎఫ్‌ ఏరియా కార్యదర్శి ఈ.సికిందర్, గురుసాయి, ఏఐటీయూసీ నాయకులు ఎస్‌ఎస్‌ షరీఫ్, సుబ్రమణ్యంరాజు, వెంకటేష్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement