
నినాదాలు చేస్తున్న సీపీఎం, సీపీఐ, జనసేన నాయకులు
అనంతపురం అర్బన్: ప్రత్యేక హోదా, రాష్ట్ర విభజన హామీలు, రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ సాధించే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని సీపీఎం, సీపీఐ, జనసేన నాయకులు అన్నారు. విభజన హామీలు అమలు చేయలని డిమాండ్ ఆ పార్టీల అధ్వర్యంలో శనివారం స్థానిక టవర్‌క్లాక్ వద్ద నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్, జనసేన నాయకుడు బాబురావు మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలను అమలు చేయకపోగా ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదం టూ సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడివిటీ దాఖలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విభజన చట్టంలోని హామీల్లో ఒకటి రెండు మినహా అన్ని అమలు చేశామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రకటించడం సిగ్గుచేట్టన్నారు.
ధైర్యం ఉంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. హామీలు అమలు చేసి ఉంటే రాయలసీమకు బుం దేల్ ఖండ్ తరహా ప్యాకేజీ కింద రూ.40 వేల కోట్లు డబ్బులు వచ్చేవన్నారు. కేవలం రూ.100 కోట్లు జిల్లాకు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. బెల్, నాసన్, ఎనర్జీ విండ్ యూనివర్సిటీ, ఐటీ కారిడార్, ఇలా ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. కేంద్ర మంత్రులు స్వయంగా వచ్చి భూ మి పూజ చేసి వెళ్లారే తప్ప వాటిని పూర్తి చేయలేదన్నారు. నాలుగేళ్లపాటు కేంద్ర ప్రభుత్వానికి మిత్రపోంగా ఉండి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తే, బీజేపీ ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment