సాక్షి, హైదరాబాద్ : నగరంలో రేపటి నుంచి 48 గంటల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. డిసెంబర్ 6న బ్లాక్ డే సందర్భంగా నగరంలో నిషేదాజ్ఞలు విధిస్తూ పోలీస్ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ర్యాలీలు, ప్రదర్శనలు, పబ్లిక్ మీటింగ్‌లు, సమావేశాలను రద్దు చేస్తున్నట్టు తెలిపారు. 144 సెక్షన్ అమలులో ఉన్న ప్రాంతాల్లో నలుగురు లేదా అంతకుమించి ఒకేచోట గుమికూడి ఉండటం, సభలు, సమావేశాల్లో ఉద్రేకపూరిత, ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం నిషేధమన్నారు. సభలు, సమావేశాల నిర్వహణకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఈ ఉత్తర్వులకు విరుద్దంగా వ్యవహరించేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదని సీపీ సూచించారు. ఈ నిషేధాజ్ఞలు నెల 5న ఉదయం 6.00 గంటల నుంచి 7వ తేదీ ఉదయం 6.00 అమలులో ఉంటాయని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment