పట్టణంలోని బొత్సపేట వద్ద మంగళవారం సాయంత్రం 5 గంట ల సమయంలో ఒక్కసారిగా కలక లం రేగింది. కారులో నుంచి దిగిన నలుగురు వ్యక్తులు..అక్కడే దుకాణంలో ఉన్న వ్యక్తిని తమ వద్దకు రమ్మని పిలిచి, కారులోకి ఎ క్కించేందుకు ప్రయత్నించారు.
.ఈ సమయంలో ఆయన పెద్దగా కేకలు వేసినా.. విడిచిపెట్టకుండా వారు ఆయన్ను కారులో ఎక్కించుకుని పరారయ్యారు. ఈ సంఘటన స్థానికుల్లో ఒక్కసారిగా కలకలంరేపింది. పట్టణంలోని తోటపాలెం బొత్సపేటలో బండారు శ్రీనివాసరావు నివాసం ఉంటున్నారు. ఈయన శ్రీ సాయిగిరిజ కిరాణా, బుక్స్ దుకాణం నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5. 30 గంటల సమమంలో దుకాణం ముందు స్కార్పియో కారు ఆగింది. కారులో ఉన్న వ్యక్తులు శ్రీనివాసరావును కారు వద్దకు రావాలని పిలిచారు. కారు వద్దకు వెళ్లిన శ్రీనివాసరావును కారు ఎక్కాలని బలవంతంగా ఎక్కించే ప్రయత్నం చేశారు.ఈ సమయం లో శ్రీనివాసరావు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న అక్క వెంకటలక్ష్మి వచ్చి శ్రీనివాసరావును లాగే ప్రయత్నం చేసింది. కానీ కారులో ఉన్న వ్య క్తులు వారిని పక్కకు నెట్టి శ్రీనివాసరావును తీసుకుని పరారయ్యారు.
కుటుంబ సభ్యు లు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న సీఆర్‌పీఎఫ్ పోలీ సులు వెంబడించగా కారులో ఉన్న వ్యక్తులు పోలీ సులకు చెందిన ఐడెంటీ కార్డులు చూపించడంతో వదిలివేసినట్టు చెబుతున్నారు. కాగా ఈ సంఘట నపై భిన్న కథనాలు వినిపిస్తున్నారుు. శ్రీనివాసరా వు దొంగల నుంచి బంగారం కొనుగోలు చేసినట్టు గా తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన క్రైం పోలీసులు స్కార్పియోలో వచ్చి శ్రీని వాసరావును తీసుకువెళ్లినట్టు సమాచారం.
కారు లో పోలీసులతో పాటు ఇద్దరు దొంగలు ఉన్నట్టు కొందరు చెబుతున్నారు. వారే శ్రీనివాసరావును చూపించిన ట్టు తెలుస్తోంది. అయితే స్కార్పియో లో ఎనిమిది మంది వ్యక్తులతో పాటు ఓ యువతి కూడా ఉం దని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై ఒక టో పట్టణ సీఐ కె. రామారావును ప్రశ్నించగా ఎం దుకు తీసుకువెళ్లారన్న దానిపై ఆరా తీస్తున్నామన్నారు. సీఆర్‌పీఎప్ పోలీసులు చెప్పిన మేరకు విచారణ కోసం పోలీసులే తీసుకువెళ్లినట్టు తెలుస్తోందన్నారు.