gas cylinder blast
-
అనంతపురంలో గ్యాస్ సిలిండర్ పేలుడు
-
సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం
-
నేపాల్ ఎంపీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు
-
సికింద్రాబాద్‌లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఒకరు మృతి, 9 మందికి గాయాలు
సాక్షి, సికింద్రాబాద్: చిలకలగూడ పరిధిలోని దూద్ బావి బస్తీలో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని ఇంటి యజమాని నారాయణరావుగా గుర్తించారు. ఆయన భార్య, పిల్లలు సైతం గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పేలుడు ప్రభావానికి స్థానికంగా ఎనిమిది ఇళ్ల వరకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సంఘటన స్థలంలో క్లూస్ టీం, బాంబ్ స్కాడ్ తనిఖీలు చేపట్టింది. గ్యాస్ లీక్ కారణంగానే సిలిండర్ పేలినట్టుగా అనుమానిస్తున్నారు. చదవండి: Banjara Hills: డీఏవీ స్కూల్ గుర్తింపు రద్దుపై గందరగోళం.. నిర్ణయమెటో? -
సికింద్రాబాద్ చిలకలగూడలో పేలిన గ్యాస్ సిలిండర్
-
Hyderabad: రాంగోపాల్‌పేటలోని అపార్ట్మెంట్లో పేలుడు
-
అమ్మా ఆకలేస్తోంది.. సెకన్లలో పాప మృతి, మరో ఇద్దరు చిన్నారులు..
నిజామాబాద్ అర్బన్ : అమ్మా ఆకలేస్తోంది.. పాలు కావాలంటూ చిన్నారులు మారం చేశారు. పిల్లలకు పాలు తాగించేందుకు తల్లి సిలిండర్ వెలిగించింది.. మంటలు చెలరేగి ఐదేళ్ల పాప మృతి చెందగా మరో ఇద్దరు చిన్నారులు, భార్యభర్తలు గాయాల పాలయ్యారు. వివరాల ప్రకారం.. పాల వ్యాపారం చేసే రాజస్థాన్‌కు చెందిన సునీల్‌యాదవ్, ధన్వంతరిబాయి దంపతులు నిజామాబాద్ జిల్లా కేంద్ర శివారులోని సారంగాపూర్ డెయిరీ ఫారం వద్ద ఓ గదిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు బబ్లూ, జగ్గు, నమ్కిబాయి (5) ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి బబ్లూ, జగ్గు పాలుతాగుతామని తల్లిని అడిగారు. తల్లి మినీ సిలిండర్ పై పాలను వేడి చేస్తోంది. సిలిండర్‌కు చెందిన గ్యాస్ పైపులైన్ స్టౌవ్ వద్ద మంటలు అంటుకొని తెగిపోయింది. దీంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ముగ్గురు పిల్లలకు అంటుకున్నాయి. భార్యాభర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న భార్యభర్తలు పిల్లలను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో నమ్కిబాయి చికిత్స పొందుతూ మరణించింది. మిగితా ఇద్దరు పిల్లలను హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదవశాత్తు ఘటన జరిగిందని 6వ టౌన్ ఎస్సై ఆంజనేయులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
నరసాపురం మండలం పెద్ద మైనవానిలంకలో విషాదం
-
విషాదం: పేలిన గ్యాస్ సిలిండర్.. ఏడుగురి మృతి
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. టీక్రీ అనే గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి రెండు ఇళ్లు శిథిలమయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా..మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న 14 మందిని రక్షించారని పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని కోసం సహాయక చర్యలు జరుగుతున్నట్టు తెలిపారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. బాధితుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. (చదవండి: విషాదం: దొంగను పట్టుకోబోయి రైలు కింద పడ్డ మహిళ) -
ఒక్కసారిగా పేలిన సిలిండర్లు.. బయట పడే దారి లేక!
సాక్షి, కాకినాడ : గాంధీ పార్కు సమీపంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు తెల్లవారుజామున 4.30 నిమిషాల సమయంలో మూడు సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పెద్దగా శబ్ధం రావడంతో చుట్టుపక్కల స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో పక్కనున్న ఇళ్లలో కూడా మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న సిలిండర్లు కూడా పేలాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకొని ఓ వృద్ధురాలు సజీవ దహనం అయ్యింది.. మృతురాలిని తుమ్మల విజయలక్ష్మీ(65)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరణించిన వృద్ధురాలి సోదరి మాట్లాడుతూ.. ప్రమాదం ఎలా జరిగిందో తెలీయదని, ఒక్కసారిగా మంటలు చేలరేగాయని అన్నారు. ఇళ్లు కాలిపోతున్నాయని తన సోదరే అందరికి చెప్పిందని, కానీ బయటకు వచ్చేందుకు దారి లేక తను మంటల్లో చిక్కుకొని మరణించిందని కన్నీరు పెట్టుకున్నారు. ఈ ప్రమాదంలో నాలుగు కుటుంబాలకు ఆస్తినష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. -
కాకినాడ: సిలిండర్ పేలి వృద్ధురాలు సజీవ దహనం
-
పేలిన గ్యాస్ సిలిండర్, ఫ్రిజ్
సాక్షి, సూళ్లూరుపేట: అందరూ గాఢనిద్రలో ఉండగా ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పట్టణంలోని కాపువీధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. కాపువీధిలో నివాసం ఉంటున్న వంకా శ్రీనివాసులు (49), భార్య వంకా మునిసుబ్బమ్మ (40) కుమార్తె జాహ్నవి (10) కుమారుడు చరణ్‌సాయి (4) ఆదివారం రాత్రి భోజనాల అనంతరం అందరూ నిద్రిస్తున్నారు. సిలిండర్ పైపు నుంచి గ్యాస్ లీకై ఇల్లంతా వ్యాపించింది. ఆదివారం రాత్రి 12.30 గంటల సమయంలో గ్యాస్ వాసన వస్తుండడంతో అప్రమత్తమైన శ్రీనివాసులు లేచి లైట్ వేయగానే ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. లీకైన గ్యాస్ ఫ్రిజ్ కిందకు కూడా వ్యాపించడంతో మంటలు అధికమై ఫ్రిజ్ పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. లీకైన గ్యాస్ బెడ్రూంలోకి కూడా వ్యాపించడంతో గాఢ నిద్రలో ఉన్న శ్రీనివాసులు కుమార్తె, కుమారుడు మంచాల కింద నుంచి మంటలు రేగి అగ్ని ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు వెంటనే 108కి ఫోన్ చేస్తే ఓజిలిలో ఉన్నట్లు సమాధానం చెప్పారు. ఆగ్నిమాపక కార్యాలయానికి ఫోన్ చేస్తే ఆ ఫోన్ పనిచేయడం లేదు. రాత్రి గస్తీలో ఉన్న పోలీసులు స్పందించి స్థానికులతో కలిసి క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరు సింహపురి ఆస్పత్రికి తరలించారు. వీరిలో శ్రీనివాసులు, కుమార్తె జాహ్నవి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మునిసుబ్బమ్మ, చరణ్‌సాయి పరిస్థితి మెరుగ్గా ఉందని బాధిత బంధువుల ద్వారా తెలిసింది. ఈ ప్రమాదంపై పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదని చెబుతున్నారు. -
ప్రసాదంపాడులో గ్యాస్ సిలిండర్ పేలుడు
సాక్షి, కృష్ణా జిల్లా: విజయవాడ ప్రసాదంపాడులోని ఓ ఇంట్లో సిలిండర్ పేలిపోవడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పేలుడు సంభవించడంతో ఇల్లు ధ్వంసం అయ్యింది. పేలుడు ధాటికి ఇంటి పై కప్పు ఎగిరి రోడ్డుపై పడింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పేలిన గ్యాస్ సిలిండర్..నలుగురికి గాయాలు
-
గ్యాస్ సిలిండర్ పేలుడు; నలుగురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్ : మలక్‌పేటలోని వెంకటాద్రినగర్‌లో ఒక ఇంట్లో ఆదివారం అర్థరాత్రి సిలిండర్ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. కాగా సిలిండర్ పేలుడు దాటికి ఇళ్లుతో పాటు పలు వాహనాలు దగ్దమయ్యాయి. సిలిండర్ పేలి ఒక్కసారిగా శబ్ధం రావడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని గాయపడిన నలుగురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
రాజస్థాన్‌లోని ఓ ఇంట్లో పెలిన సిలిండర్
-
పచ్చని కుటుంబంలో చిచ్చు
సాక్షి, హైదరాబాద్: పచ్చని కుటుంబంలో ఊహించని ప్రమాదం పెను విషాదం రేపింది. గ్యాస్ సిలిండర్ మృత్యుపాశంగా మారి చిన్నారితో సహా ముగ్గురు కుటుంబ సభ్యులను బలి తీసుకుంది. గ్యాస్ సిలిండర్ లీకై మంటలంటుకున్న ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం జిల్లా, మదిర గ్రామానికి చెందిన షేక్ సుభానీ(32), షేక్ షర్మిళ (25) దంపతులు హైదరాబాద్ నగరానికి వలస వచ్చి సూరారం హనుమాన్ నగర్లో నివాసముంటున్నారు. వీరికి షేక్ హైదర్ ఫిర్దోస్(3) కుమార్తె. ఈ నెల 6న గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగడంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 5న సాయంత్రం ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఖాళీ కావడంతో సుభానీ సిలిండర్ మార్చాడు. 6వ తేదీ ఉదయం అతను సెల్ ఫోన్ చార్జింగ్ పెట్టేందుకు స్విచ్ ఆన్ చేశాడు. అప్పటికే గ్యాస్ లీకై ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సుభానీతో పాటు అతడి భార్య షర్మిళ, కుమార్తె ఫిర్దౌస్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని కూకట్‌పల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఈ నెల 12న సుభాని, షర్మిళ మృతి చెందగా, చిన్నారి ఫిర్దోస్ బుధవారం కన్నుమూసింది. -
గ్యాస్ సిలిండర్ పేలి అన్నాచెల్లెళ్ల మృతి
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని సాగర్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో అన్నాచెల్లెళ్లు మృత్యువాత పడగా.. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. సాగర్ నగర్ హెచ్ఐజీలో ఆర్టీసీ రీటైర్డ్ జేఈ చల్ల ఉమా మహేశ్వరరావు కుటుంబం నివాసం ఉంటోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఉమ మహేశ్వరరావు, కొడుకు, కుమార్తెతో కలిసి ఇంట్లో నిద్ర పోయారు. అర్ధరాత్రి వాళ్లింట్లో గ్యాస్ సిలిండర్ పేలినట్లు స్థానికులు గుర్తించారు. ఆ ఘటనలో కుమారుడు సతీష్ చంద్ర (38), కూతురు లావణ్య (32) మృత్యువాత పడ్డారు. ఉమా మహేశ్వరరావు ప్రాణాపాయ స్థితిలో వున్నారు. అయితే వీరిది ఆత్మహత్యే అంటున్నారు పోలీసులు. ప్రమాదం జరిగిన ఇంట్లో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. కొద్ది కాలం క్రితం ఉమా మహేశ్వరరావు భార్య మరణించింది. అప్పటి నుంచి ఆయన కుమారుడు, కుమార్తెతో కలిసి ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఉమా మహేశ్వరరావు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. మానసిక సమస్యల నేపథ్యంలోనే గ్యాస్ లీక్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్
-
గుంటూరు జిల్లాలో విషాదం
సాక్షి, గుంటూరు : జిల్లాలోని చిలకలూరిపేట ఎన్టీఆర్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ స్టౌవ్ రిపేర్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన ఆది లక్ష్మీ ఈ రోజే కొత్తగా గ్యాస్ సిలిండర్‌ను కొనుక్కొచ్చారు. గ్యాస్ పొయ్యిని సిలిండెర్‌కు కలెక్షన్ ఇచ్చేందుకు పక్కింటి దివ్యను పిలిచారు. గ్యాస్ స్టౌవ్ రిపేర్ చేస్తుండగా సిలిండర్ పేలింది. ఈ ఘటన రేకుల షెడ్డు పేలి దివ్య, ఆదిలక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందారు.ఇంట్లో ఉన్న మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
చితికిపోయిన చిన్న బతుకులు
విజయనగరం టౌన్: ఒక్కసారిగా మంటలు చెలరేగాయి... ఇంతలో గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఎం జరిగిందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది... కేవలం గంటలోనే ఆ ప్రాంతమంతా బూడిదగా మారింది.. దుకాణాలు కాలిపోవడంతో బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి.. వివరాల్లోకి వెళితే.... పట్టణ నడిబొడ్డున ఉన్న గంటస్తంభం ప్రాంతంలో చిన్న మార్కెట్ నిత్యం కూరగాయల వ్యాపారంతో కిటకిటలాడుతుంటుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట నుంచి రెండు గంటల ప్రాంతంలో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మార్కెట్లో ఉన్న సుమారు 60 కుటుంబాలకు చెందిన 54 కూరగాయల షాపులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో కూరగాయలు, షాపులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంటలు చెలరేగిన కొద్దిసేపటికే పరిసర ప్రాంతంలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో మంటలు ఎక్కువగా వ్యాపించాయి. కేవలం 20 నిమిషాల్లోనే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 25 లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అయితే అగ్నిమాపక శాఖాధికారులు మాత్రం ఏడు లక్షల రూపాయల నష్టమే జరిగిందని అంచనా వేశారు. ప్రమాదం సంభవించిందని తెలియగానే జిల్లా అగ్నిమాపకశాఖాధికారి అవినాష్ జయసింహ, సహాయ అగ్నిమాపకాధికారి మాధవనాయుడు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. లబోదిబోమంటున్న బాధితులు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పది గంటలకు ఇంటికెళ్లే వరకూ షాపుమీదే ఆధారపడి బతుకుతున్నాం. షాపులు కట్టేసి ఇంటికి వెళ్లినప్పుడు అంతా బాగానే ఉందని... సరిగ్గా అర్ధరాత్రి సమయంలో ప్రమాదం జరిగిపోయిందని బాధితులు లబోదిబోమంటున్నారు. కేవలం దుకాణాలమీదనే ఆధారపడి బతుకుతున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. బాధితులకు చేయూతనివ్వాలి అగ్ని ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలని మానవ హక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. అచ్చిరెడ్డి అన్నారు. సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలన్నారు. నష్టం జరిగిన వ్యాపారులకు ఒక్కో దుకాణానికి పర్మినెంట్ షెడ్లు నిర్మించి, వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కొంతమంది ఆకతాయిలు అర్ధరాత్రి సమయంలో మార్కెట్లో మద్యం తాగుతూ హడావిడి చేస్తున్నారని.... ఈ విషయాన్ని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పరామర్శలో ఆయనతో పాటు సంఘ ప్రతినిధులు సింహాద్రి, అమ్మాజమ్మ, తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి... విజయనగరం మున్సిపాలిటీ: అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన చిన్నబజార్ ప్రాంతంలో పర్యటించిన కోలగట్ల ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక వ్యాపారి ఎంకేబీ శ్రీనివాసరావు బాధితుల కోసం రూ. 50 వేల చెక్కును కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం కోలగట్ల మాట్లాడుతూ, బాధితులందరూ చిరు వ్యాపారులేనన్నారు. సుమారు 30 సంవత్సరాల కిందట ఇదే మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగిందని గుర్తు చేశారు. బాధితుల వివరాలు పక్కాగా సేకరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పరామర్శలో ఆయనతో పాటు వైఎస్సార్సీపీ విజయనగరం పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, మండల అధ్యక్షుడు నడిపేన శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్ ఎస్వీవీ రాజేష్, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్ కౌషిక్, యువజన విభాగం అధ్యక్షుడు ఎస్. బంగారునాయుడు, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు అల్లు చాణక్య, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బొద్దాన అప్పారావు, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు మారం బాలబ్రహ్మరెడ్డి, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి బోడసింగి ఈశ్వరరావు, పార్టీ నాయకులు కొబ్బరికాయల నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలి ..ఒకరి సజీవ దహనం
-
మచిలీపట్నంలో యువకుడి సజీవ దహనం
సాక్షి, విజయవాడ : కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మగ్గాలకాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి.. మహ్మద్ బాజీ అనే యువకుడు సజీవ దహనమయ్యాడు. పెద్ద ఎత్తున లేచిన మంటలకు ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. పేలుడు శబ్దానికి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. -
మంటల్లో వంటిల్లు
సాక్షి, సిటీబ్యూరో: వంటింట్లో గ్యాస్ వణికిస్తోంది. వరుస సిలిండర్ పేలుళ్లు నగరవాసులను బెంబేలెత్తిస్తున్నాయి. వంట గ్యాస్ ఉపయోగించడంలో వినియోగదారుల నిర్లక్ష్యం, భద్రత ప్రమాణాలపై అవగాహన లోపం, సిలిండర్ డోర్ డెలివరీ కాగానే తనిఖీ చేయకపోవడం, గ్యాస్ లీకేజీలపై చిన్నపాటి ఏమరుపాటు వంటి కారణాలతో కుటుంబం మొత్తం భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రధాన ఆయిల్ కంపెనీలు కనీస భద్రత ప్రమాణాలను గాలికి వదిలేశాయి. ఏడాదికి ఒకసారి మొక్కుబడిగా అవగాహన సదస్సు నిర్వహించి చేతులు దులుపుకొంటున్నాయి. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద అత్యవసర సేవలకు సంబంధించి టెక్నికల్ సిబ్బంది కొరత వెంటాడుతోంది. దీంతో గ్యాస్ లీకేజీ, ఇతరత్రా వినియోగదారుల కాల్స్ పెండింగ్‌లో పడిపోతున్నాయి. డెలివరీ బాయ్స్ రిపేరు సిబ్బందిగా అవతారమెత్తి ప్రయివేటు టెక్నీషియన్స్ కంటే అదనంగా సర్వీస్ చార్జీలు బాదేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. మొత్తం మీద ఆయిల్ కంపెనీల నిర్లక్ష్యం, మానవ తప్పిదాలు వంటింట్లో విస్ఫోటనాలకుకు దారితీస్తున్నాయి. సిలిండర్ టెస్ట్‌లో నిర్లక్ష్యం ప్రధానంగా ఆయిల్ కంపెనీలు సిలిండర్ టెస్టింగ్‌లో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. సిలిండర్ జీవిత కాలపరిమితి పదేళ్లు. ఆ తర్వాత తిరిగి పరిశీలించి సిలిండర్ ప్రమాణాలను బట్టి మరో ఐదేళ్లు రీఫిల్లింగ్ చేయడమా? లేదా తుప్పు కింద పడేయడం చేయాల్సి ఉంటుంది. గ్యాస్ టెర్మినల్‌లో రీఫిల్లింగ్ జరిగే ముందు ప్రతిసారి సిలిండర్ బాడీ ఇతరత్రా వాటిని టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఆయిల్ కంపెనీలు ఇవేమీ పట్టించుకోకుండా టెర్మినల్‌కు వచ్చిన సిలిండర్‌ను మొక్కుబడి పరిశీలనతో రీఫిల్లింగ్ చేసి సరఫరా చేస్తున్నాయి. దీనివల్లే వంటింటి విస్ఫోటనాలు చోటుచేసుకుంటున్నాయి. సిలిండర్ ప్రమాణాలకు సంబంధించిన టెస్ట్ డ్యూ డేట్ ఐదు, పదేళ్లకు ఒకసారి ఉండటం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ప్రతి ఒక్క సిలిండర్ గ్యాస్ టెర్మినల్ నుంచి డిస్ట్రిబ్యూటర్ గోదాముకు, అక్కడి నుంచి వినియోగదారుడి ఇంటికి, ఖాళీ అనంతరం తిరిగి గోదాముకు అక్కడి నుంచి గ్యాస్ టెర్మినల్‌కు వెళ్తుంది. ఇలా ఏడాదిలోనే కనీసం 72 ప్రాంతాలు సిలిండర్ తిరగాల్సింటుంది. దీంతో రవాణా, ఇతరత్రా కారణాలతో సిలిండర్ నాణ్యత ప్రమాణాలు దెబ్బతినడం సర్వ సాధారణం. అయితే ఆయిల్ కంపెనీలు సిలిండర్ ప్రమాణాలపై మాత్రం పదేళ్లు, ఐదేళ్లకు ఒకసారి పరిశీలన జరిపి డ్యూ డేట్‌ను వేయడం ఆందోళన కలిగిస్తోంది. సిలిండర్ కాలపరిమితి ఇలా.. వంట గ్యాస్ సిలిండర్ భద్రత ప్రమాణాలను కాలపరిమితి (డ్యూ డేట్) బట్టి గుర్తించవచ్చు. డ్యూ డేట్లు సిలిండర్‌పై త్రైమాసాకానికి ఒక కేటగిరిగా అక్షరాలు ఉంటాయి. అక్షరంతో పాటు అంకె అంటే కాలపరిమితి గడువు సంవత్సరం కూడా ఉంటుంది. ఉదాహరణకు సిలిండర్ పైన ఏ–19 బీ–19, సీ–19, డీ–19 అనే అక్షరాలు ఉంటాయి. ఏ–అంటే జనవరి నుంచి మార్చి వరకు, బీ అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు, సీ అంటే జూలై నుంచి సెప్టెంబర్ వరకు. డీ అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పరిగణించాలి. పక్కన ఉన్న అంకెను సంవత్సరంగా గుర్తించాలి. అయితే ఖాళీ అయిన సిలిండర్ నాణ్యత ప్రమాణాలు పూర్తి స్థాయిలో పరిశీలించకుండానే రీఫిల్లింగ్ పాయింట్లో కాలపరిమితి ఆధారంగా రీఫిల్లింగ్ చేసి వినియోగదారులకు పంపిణీ చేయడం పరిపాటిగా మారింది. టెక్నీషియన్ల కొరత వంట గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద టెక్నీషియన్ల కొరత అధికంగా ఉంది. ఒక్కో డిస్ట్రిబ్యూటర్ పరిధిలో సుమారు వేలాది కనెక్షన్లు ఉన్నా..సిబ్బంది మాత్రం ఇద్దరు, ముగ్గురుకి మించి ఉండరు. దీంతో వినియోగదారులు అత్యవసర నంబర్‌కు ఫోన్‌చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఒక్కోసారి డెలివరీ బాయ్స్‌నే టెక్నీషియన్స్ అంటూ పంపించి సర్వీస్ చార్జీలు వసూలు చేస్తున్నారు. అప్రమత్తత లేక... గ్యాస్ విస్ఫోటనాలకు మానవ తప్పిదాలు కూడా ప్రధానంగా కారణమవుతున్నాయి. గ్యాస్ సిలిండర్ల లీకేజీలు, సిలిండర్, రెగ్యులేటర్, రబ్బర్ ట్యూబ్‌ల నాణ్యత, వాటి తనిఖీల్లో నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తున్నాయి. కొత్త సిలిండర్ అమర్చే సమయంలో రెగ్యులేటర్, వాచర్ రెండూ సరిగ్గా ఇమడక గ్యాస్ బయటకు వస్తోంది. గ్యాస్ లీక్ గమనించకపోవడం, రబ్బర్ ట్యూబ్ వినియోగించడం, వంట చేసే సమయంలో గ్యాస్‌ను సిమ్‌లో ఉంచి మరిచి పోవడం, బర్నర్ మూసుకుపోవడం తదితరాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. జాగ్రత్తలు ♦ వంట గ్యాస్ స్టవ్ వినియోగించని సమయంలో రెగ్యులేటర్‌ను ఆఫ్ చేయాలి. రాత్రి పూట తప్పనిసరిగా రెగ్యులేటర్ ఆఫ్‌లో ఉండే విధంగా చూసుకోవాలి. వంట గది తలుపుల కింద కనీసం ఒక అంగుళం ఖాళీగా ఉండే విధంగా ఉండాలి ♦ గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు తప్పనిసరిగా వాసన వస్తుంది. అలాంటి సమయంలో ఎలాంటి ఏమరుపాటు పనికి రాదు. విద్యుత్ స్విచ్‌లు ముట్టుకోవడం, అగ్గిపుల్ల వెలిగించడం చేయకూడదు. విద్యుత్ స్విచ్‌లు ఆన్ చేయడం, ఆఫ్ చేయడం చేయవద్దు. స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే వచ్చే చిన్నపాటి స్పార్క్(మెరుపు) ప్రమాదానికి దారితీస్తోంది. ♦ గ్యాస్ వాసన పసిగట్టగానే తక్షణం వంటింటి తలుపులు, కిటికీలు బార్లా తెరిచి గ్యాస్‌ను బయటకు పంపే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తిస్తే సిలిండర్‌ను బయటికి తీసుకెళ్లి బహిరంగ ప్రదేశంలో సేఫ్టీ పిన్ బిగించి ఉంచాలి. ♦ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద కాకుండా బహిరంగ మార్కెట్లో, గ్యాస్ రీఫిల్లింగ్ వ్యాపారుల వద్ద సిలిండర్ కొనుగోలు చేయడం ప్రమాదకరం. ♦ సిలిండర్ కంటే ఎత్తులో స్టవ్ ఉండాలి. సిలిండర్‌ను నిలువుగానే పెట్టాలి. ♦ వంట గదిలో ఫ్రిజ్ పెట్టవద్దు. అందులో ఉండే థర్మోస్టాట్ వల్ల ఆటో కటాఫ్ అవుతోంది. గ్యాస్ లీకైన సమయంలో ప్రమాదానికి దారితీస్తోంది. ♦ వంటింట్లో గ్యాస్ లీకేజీ గుర్తించగానే గ్యాస్ కంపెనీ అత్యవసర (టోల్ ఫ్రీ) నెంబర్ 1906 గానీ, డిస్ట్రిబ్యూటర్ అత్యవసర నెంబర్‌కు గానీ ఫోన్ చేయవచ్చు. అవగాహన అవసరం వంట గ్యాస్ వినియోగదారులు పూర్తిగా డోర్ డెలివరీ కాగానే సీల్ కరెక్టుగా ఉందా లేదా చూసుకోవాలి. సిలిండర్ కాలపరిమితి పరిశీలించాలి. సీల్ తీయగానే ఓపెన్ రింగ్ కట్ అయినా...గ్యాస్ వాసన వచ్చినా తిరిగి సిలిండర్ వెనక్కి పంపాలి. రెగ్యులేటర్, బర్నర్‌ను ఎప్పటి కప్పుడు తనిఖీ చేసుకోవాలి. రెండేళ్లకు ఒకసారి స్టవ్‌ను మార్చు కోవాలి. – అశోక్, అధ్యక్షుడు, వంట గ్యాస్ డీలర్ల సంఘం గ్రేటర్, హైదరాబాద్ మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు వంటింట్లో మానవ తప్పిదాలతోనే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. టెర్మినల్‌లో భద్రత ప్రమాణాల ఆధారంగా సిలిండర్‌లో రీఫిల్లింగ్ చేసి పంపిణీ చేస్తారు. గ్యాస్ వినియోగం తోపాటు గ్యాస్ లీకేజీ, రెగ్యులేటర్, బర్నర్ తదితర వాటిపై వినియోగదారులకు అవగాహన అవసరం. వంట గ్యాస్ వినియోగంపై ఆయిల్ కంపెనీల వారిగా అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. – రోహిత్గార్గే, ఆయిల్ కంపెనీ ప్రతినిధి -
మళ్లీ బ్లాస్ట్
హస్తినాపురం: ఇటీవల కాప్రాలో జరిగిన ఘోర ప్రమాదాన్ని మరవకముందే మరో సిలిండర్ పేలుడు చోటుచేసుకుంది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలు మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వనస్థలిపురం ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు – మిగతా 6లోu చెందిన శ్రుతికీర్తి(80) వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్‌లోని సోమనాథ క్షేత్రానికి వచ్చింది. మంగళవారం మధ్యాహ్న సమయంలో ఆలయం వంట గదిలోని స్టవ్ వెలిగించగా, ఆకస్మాత్తుగా సిలిండర్ పేలింది. పేలుడు ధాటికి శ్రుతికీర్తికి తీవ్ర గాయాలయ్యాయి. పక్క గదిలో ఉన్న లలితకు కిటీకి అద్దాలు పగిలి శరీరానికి గుచ్చుకున్నాయి. వెంటనే అక్కడున్న భక్తులు వచ్చి వీరిద్దరినీ ఎల్బీనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రుతికీర్తి రాత్రి 9గంటల సమయంలో మృతి చెందింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపారు.