విషాదం: పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. ఏడుగురి మృతి | 7 Succumb And 7 Injured In LPG Cylinder Blast In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

విషాదం: పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. ఏడుగురి మృతి

Published Wed, Jun 2 2021 8:17 AM | Last Updated on Wed, Jun 2 2021 12:54 PM

7 Succumb And 7 Injured In LPG Cylinder Blast In Uttar Pradesh - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం  సంభవించింది. టీక్రీ అనే గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. పేలుడు ధాటికి రెండు ఇళ్లు శిథిలమయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా..మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

పోలీసుల వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న స్థానికులు, సహాయక సిబ్బంది ఘ‌ట‌నాస్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న 14 మందిని రక్షించారని పేర్కొన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని కోసం సహాయక చర్యలు జరుగుతున్నట్టు తెలిపారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. బాధితుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

(చదవండి: విషాదం: దొంగను పట్టుకోబోయి రైలు కింద పడ్డ మహిళ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement