Gas Cylinder Explosion In Secunderabad, One Died - Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. ఒకరు మృతి, 9 మందికి గాయాలు

Published Wed, Oct 26 2022 12:43 PM | Last Updated on Wed, Oct 26 2022 1:48 PM

Gas Cylinder Explosion In Secunderabad One Died - Sakshi

సాక్షి, సికింద్రాబాద్: చిలకలగూడ పరిధిలోని దూద్ బావి బస్తీలో బుధవారం గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని ఇంటి యజమాని నారాయణరావుగా గుర్తించారు. ఆయన భార్య, పిల్లలు సైతం గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. పేలుడు ప్రభావానికి స్థానికంగా ఎనిమిది ఇళ్ల వరకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సంఘటన స్థలంలో క్లూస్‌ టీం, బాంబ్‌ స్కాడ్‌ తనిఖీలు చేపట్టింది. గ్యాస్ లీక్ కారణంగానే సిలిండర్ పేలినట్టుగా అనుమానిస్తున్నారు. 
చదవండి: Banjara Hills: డీఏవీ స్కూల్‌ గుర్తింపు రద్దుపై గందరగోళం.. నిర్ణయమెటో? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement