
ముంబైలో సిలిండర్ పేలి 8మంది దుర్మరణం
ముంబయిలో గ్యాస్ సిలిండర్ పేలి ఎనిమిది మంది మృతి చెందారు. కుర్లా వెస్ట్ ఏరియాలోని హోటల్ సిటీ కిన్నెరలో శుక్రవారం మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్ హఠాత్తుగా పేలింది.
ముంబయి: ముంబయిలో గ్యాస్ సిలిండర్ పేలి ఎనిమిది మంది మృతి చెందారు. కుర్లా వెస్ట్ ఏరియాలోని హోటల్ సిటీ కినరలో శుక్రవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో 8మంది మృతి చెందగా, పలువురు గాయపడినట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతుల్లో ఎక్కువమంది హోటల్ సిబ్బంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.