ముంబయిలో గ్యాస్ సిలిండర్ పేలి ఎనిమిది మంది మృతి చెందారు. కుర్లా వెస్ట్ ఏరియాలోని హోటల్ సిటీ కినరలో శుక్రవారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనలో 8మంది మృతి చెందగా, పలువురు గాయపడినట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.