
సాక్షి, కృష్ణా జిల్లా: విజయవాడ ప్రసాదంపాడులోని ఓ ఇంట్లో సిలిండర్ పేలిపోవడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పేలుడు సంభవించడంతో ఇల్లు ధ్వంసం అయ్యింది. పేలుడు ధాటికి ఇంటి పై కప్పు ఎగిరి రోడ్డుపై పడింది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.