ముప్పాళ్ల (గుంటూరు జిల్లా) : ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో మారూరి ముత్యమ్మ(50) అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.