Muppalla
-
ఆటలో వివాదం.. బాలుడి హత్య
ముప్పాళ్ల: వాలీబాల్ ఆటలో జరిగిన వివాదం బాలుడి హత్యకు దారితీసింది. గుంటూరు జిలా ముప్పాళ్లకు చెందిన షేక్ ఆఫ్రీది(16), ఖాజిల్ వాలీబాల్ ఆడుకుంటూ గొడవపడ్డారు. ఈ విషయాన్ని ఖాజిల్ తన పెదనాన్న షేక్ పెదబాజీకి తెలిపాడు. దీంతో పెదబాజీ కత్తితో ఆఫ్రీది ఇంటిపైకి వెళ్లాడు. అక్కడ బయట ఉన్న ఆఫ్రీదిపై దాడిచేశాడు. స్థానికులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో పెదబాజీని స్థానికులు పోలీసులకు అప్పగించారు. అయూబ్‌ఖాన్, సైదాబీల రెండో కుమారుడైన ఆఫ్రీది ఈ ఏడాది పదో తరగతి చదవాల్సి ఉంది. ఆఫ్రీది హత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
కత్తి మహేష్ ఎన్నికల ప్రచారం
ముప్పాళ్ళ(సత్తెనపల్లి): టీడీపీ ప్రభుత్వంతో ఏ వర్గాలకూ న్యాయం జరగలేదని సినీ విమర్శకుడు కత్తి మహేష్ అన్నారు. ఎస్సీలను టీడీపీ కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, మనమంతా వైఎస్సార్ సీపీకి అండగా ఉండాలన్నారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలంలోని గోళ్ళపాడు, ముప్పాళ్ళ గ్రామాల్లోని ఎస్సీ కాలనీల్లో సోమవారం వైఎస్సార్ సీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కాలనీవాసులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎస్సీలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతు తెలపాలన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు. -
సిలిండర్ పేలి మహిళకు తీవ్రగాయాలు
ముప్పాళ్ల (గుంటూరు జిల్లా) : ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో మారూరి ముత్యమ్మ(50) అనే మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
బాబు పాలన విమాన ప్రయాణాలతోనే సరి
సొంతింటి కార్యక్రమంలా రాజధాని శంకుస్థాపన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల ధ్వజం మంగళగిరి రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన మొత్తం ఇతర దేశాలకు విమానాల్లో తిరగడానికే సరిపోతోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం తెనాలి డివిజన్ శాఖ కార్యదర్శుల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని సొంత ఇంటి కార్యక్రమంగా మార్చారని ఆరోపించారు. రాజధాని అమరావతి అయిదుకోట్ల ఆంధ్రుల సొత్తు అని చెప్పారు. కానీ రాజధానిని ముఖ్యమంత్రి తన సొంత సొత్తులా మార్చారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తే గుప్పెడు మట్టి, మురికి నీళ్లు తెచ్చారని, చంద్రబాబు అదేదో మహా ప్రసాదంలా స్వీకరించడం హాస్యాస్పదంగా వుందన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, నాయకులు జెల్లి భాగ్య శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని మహిళ మృతి
ముప్పాళ్ల : గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం ముప్పాళ్ల గ్రామం సమీపంలో లారీ ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని నాదెండ్ల మండలం చిరుమామిళ్లకు చెందిన అంజలి (45)గా గుర్తించారు. బావ శివారెడ్డితో కలిసి అంజలి సత్తెనపల్లిలో ఓ వేడుకకు హాజరై తిరిగి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. కిందపడిపోవడంతో లారీ ఆమెపై నుంచి ముందుకు వెళ్లింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. -
'రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది'
హైదరాబాద్: మేడికొండూరు ఘటనపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ జె.వి.రాముడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. టీడీపీ కార్యకర్తలు తమపై దాడి చేసిన విధానాన్ని డీజీపీకి వివరించారు. ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతల దౌర్జన్యాన్ని డీజీపీకి వివరించినట్టు వైఎస్ఆర్ సీపీ నేతలు తెలిపారు. ఇప్పటిదాకా స్థానిక పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆరోపించారు. పోలీసులపై అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నట్టు అనుమానించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. ఈ నెల 13న మేడికొండూరు వద్ద వైఎస్ఆర్ సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నికకు వెళ్తున్న ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. -
'ఎమ్మెల్యేపై దాడి సీఎం కార్యాలయమే ప్రోత్సహిస్తోంది'
గుంటూరు నగర తూర్పు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముస్తాఫాపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేపై దాడి వ్యవహరంలో జోక్యం చేసుకోవాలని ధర్మాన ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం శ్రీకాకుళంలో ధర్మాన మాట్లాడుతూ... స్థానిక ఎన్నికల్లో అక్రమాలు, దౌర్జన్యాలు వ్యూహత్మక నేరమని ఆయన ఆభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సీఎం కార్యాలయం ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నాయకుడు అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా ఎంపీటీసీ సభ్యులతో కలసి వాహనాలలో బయలుదేరారు. ఆ వాహనాలు మేడికొండూరు సమీపంలోనికి రాగానే వారిపై దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడికి చేశారు. అనంతరం వైఎస్ఆర్ సీపీ నాయకుల వాహనాలలో ఉన్న ముగ్గురు ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో వైఎస్ఆర్ సీపీ నాయకుల వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే ముస్తాఫాకు స్వల్పంగా గాయపడ్డారు. -
మేడికొండూరు ఘటనపై వైఎస్ జగన్ ఆరా
హైదరాబాద్: మేడికొండూరు ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. పార్టీ నాయకుడు అంబటి రాంబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫాకు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసాయిచ్చారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ఏడుగురు ఎంపీటీసీ సభ్యులతో వెళుతున్న వైఎస్ఆర్ సీపీ నాయకుల వాహనాలపై దాడి చేశారు. నలుగురు ఎంపీసీలను కిడ్నాప్ చేశారు. దీనిపై వైఎస్ఆర్ సీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాడికి గురైన నాయకులు సంఘటనా స్థలంలోనే ధర్నా చేపట్టారు. కిడ్నాప్ చేసిన నలుగురు ఎంపీటీసీలను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. -
'ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక వాయిదా వేయండి'
-
'ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక వాయిదా వేయండి'
హైదరాబాద్: మార్కాపురం జడ్పీటీసీ జవ్వాది రంగారెడ్డి అక్రమ అరెస్ట్ వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ నవీన్‌మిట్టల్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక అధికారాలు ఉపయోగించి జవ్వాది రంగారెడ్డిని జడ్పీ ఎన్నికల్లో పాల్గొనేలా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఆయనను హాజరుపర్చే వరకు ప్రకాశం జడ్పీ ఎన్నికను వాయిదా వేయాలని కోరారు. ముప్పాళ్ల ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో నలుగురు వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీలను టీడీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేసిన వ్యవహారాన్ని కూడా నవీన్‌మిట్టల్ దృష్టికి తీసుకెళ్లారు. ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్ష ఎన్నికను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. నవీన్‌మిట్టల్ ను కలిసిన వారిలో ఎంవీ మైసూరారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, పీఎన్వీ ప్రసాద్ ఉన్నారు. -
కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే
-
అంబటి రాంబాబు కారుపై దాడి దృశ్యాలు
-
కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే
గుంటూరు: ఇలాంటి దారుణం తానెప్పుడూ చూడలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా కన్నీళ్లు పెట్టుకున్నారు. మేడికొండూరు వద్ద టీడీపీ కార్యకర్తలు తమపై దాడి చేసి నలుగురు మహిళా ఎంపీటీసీలను కిడ్నాప్ చేసిన ఘటనపై ఆయన చలించిపోయారు. ఎమ్మెల్యే అయిన తనపైనే దాడి చేశారంటే సామాన్యుడి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు తనను విచక్షణారహితంగా కొట్టారని వాపోయారు. మహిళా ఎంపీటీసీలను దౌర్జన్యంగా లాక్కెళ్లారని తెలిపారు. కన్నీళ్లు పెట్టుకున్నా, ఫ్యామిలీ ఉందని చెప్పినా వినిపించుకోలేదన్నారు. చిన్నపిల్లలు ఉన్నారు వదలమని చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు. ఇలా చేయడం చాలా తప్పు, చాలా దారుణమని పేర్కొన్నారు. సినిమాల్లో తప్ప బయట ఇలాంటి దౌర్జన్యాలు చూడలేదంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. దాడిపై తాము సమాచారం అందించినా పోలీసులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
రోడ్డుపై బైఠాయించిన వైఎస్ఆర్ సీపీ నేతలు
గుంటూరు: టీడీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేసిన నలుగురు ఎంపీటీసీ సభ్యులను విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. ముప్పాళ్ల ఎపీపీ అధ్యక్ష ఎన్నిక నేపథ్యంలో మేడికొండూరు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై వాహనాలపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. నలుగురు మహిళా ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు. దీంతో సంఘటనా స్థలంలో రోడ్డుపై వైఎస్ఆర్ సీపీ నాయకులు బైఠాయించారు. టీడీపీ దమనకాండకు నిరసనగా అంబటి రాంబాబు, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే ముస్తాఫా ధర్నా చేపట్టారు. వీరికి మద్దతుగా వందలాదిమంది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఇక్కడకు చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తల దౌర్జన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
'టీడీపీ మూల్యం చెల్లించక తప్పదు'
-
అంబటి రాంబాబు కారుపై దాడి
-
'టీడీపీ మూల్యం చెల్లించక తప్పదు'
హైదరాబాద్: ప్రజాస్వామ్య విలువలకు టీడీపీ తిలోదకాలిచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. గంటూరు జిల్లాలో అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య విలువలను పెడచెవిన పెడుతూ లెక్కలేనట్టుగా టీడీపీ వ్యవహరిస్తొందని ఆమె ధ్వజమెత్తారు. ఈ రకమైన ధోరణి సరికాదని, దీన్ని అందరూ ఖండించాలన్నారు. అసలు ప్రతిపక్షం ఉండకూడదన్న ఉద్దేశంతో అధికార టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. ఏవిధమైన విలువలను ఖతారు చేయకుండా దాడుల సంస్కృతి కొనసాగిస్తోందన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించకతప్పదని ఆమె హెచ్చరించారు. స్థానిక సంస్థలను ఎన్నికలను కూడా స్వేచ్ఛాయుతంగా జరిపించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ దాడులను చంద్రబాబు ఎందుకు ఖండించలేకపోతున్నారని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రపతి పాలన తప్ప శరణ్యం లేదనే పరిస్థితిని కల్పించారన్నారు. అంబటిపై దాడి దుర్మార్గ చర్య అని, ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని ఖండించాలని వాసిరెడ్డి పద్మ కోరారు. -
కావాలనే దౌర్జన్యం చేశారు: అంబటి
గంటూరు: ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తమపై దాడి చేసి తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను టీడీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేశారని ఆయన తెలిపారు. కావాలనే తమపై దౌర్జన్యం చేశారని చెప్పారు. రెండు కార్లు ధ్వంసం చేశారని తెలిపారు. ఎంపీపీ అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యానికి పాల్పడే అవకాశముందని డీజీపీకి విన్నవించుకున్నా రక్షణ కల్పించలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈవిధంగా జరగడం దారుణమన్నారు. అంతకుముందు కావాలనే ఎంపీపీ ఎన్నికను వాయిదా వేశారని ఆరోపించారు. పరిస్థితులు చక్కబడేవరకు ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక వాయిదా వేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తమపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలన్నారు. -
అంబటి రాంబాబు కారుపై దాడి
గుంటూరు: అధికార టీడీపీ కార్యకర్తలు గుంటూరు జిల్లాలో రెచ్చిపోయారు. ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నిక నేపథ్యంలో స్వైర విహారం చేశారు. ఎంపీటీసీ సభ్యులతో వెళుతున్న వైఎస్ఆర్ సీపీ నాయకుడు అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా వాహనాలను మేడికొండూరు వద్ద అడ్డుకుని దాడులకు పాల్పడ్డారు. ఈ ఉదయం నుంచి కాపుకాసిన దాదాపు 200 మంది టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ముగ్గురు ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేశారు. టీడీపీ కార్యకర్తల దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మల్యే ముస్తాఫాకు స్వల్ప గాయాలయ్యాయి. -
జిల్లాలో వేర్వేరు చోట్ల ఎనిమిది మంది మృతి
రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాల్లో విధి విషాదాన్ని నింపింది. పిడుగుల రూపంలో విరుచుకుపడిన మృత్యువు ఎనిమిది మందిని బలిగొంది. వరినాట్లు వేస్తుండగా ఒకరు, పశువుల పొట్ట నింపేందుకు గడ్డి కోస్తుండగా మరొకరు, చేలో మందుచల్లుతూ ఒకరు, మిరప మొక్కలు నాటుతుండగా మరొకరు..పొట్టకూటి కోసం వలస వచ్చి పొలం పనులు చేస్తున్న మహిళలపై ప్రకృతి తన ప్రతాపాన్ని చూపింది. నిట్ట నిలువునా పొట్టన పెట్టుకుంది. ఉన్నపళంగా ఉసురు తీసింది. పలువురిని గాయపర్చింది. ఆయా కుటుంబాల్లో తీరని వ్యథను మిగిల్చింది. ముప్పాళ్ళ/అచ్చంపేట/నాదెండ్ల/రొంపిచర్ల/పెదకూరపాడు, న్యూస్‌లైన్ : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా విశ్రమించలేదు ఆ రైతు కూలీలు.. నిలువెల్లా తడుస్తూనే పొలం పనుల్లో మునిగిపోయారు.. చలికి వణుకుతూనే శ్రమిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడి వానకు కన్నుకుట్టింది. పిడుగు రూపంలో కూలీలను బలిగొంది. పని చేస్తూనే కూలీలు ప్రాణాలు విడిచారు. జిల్లాలోని ముప్పాళ్ల, అచ్చంపేట, నాదెండ్ల, రొంపిచర్ల, పెదకూరపాడు మండలాల్లో గురువారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలేనికి చెందిన తేలుకుట్ల వెంకటేశ్వర్లు అలియాస్ లింగమయ్య స్వామి(50) కుటుంబసభ్యులు, కొందరు కూలీలతో కలిసి వరినాటు వేసేందుకు గురువారం ఉదయం పొలానికి వెళ్లాడు. నాటు వేస్తుండగా నెత్తిన పిడుగు పడటంతో వెంకటేశ్వర్లు అక్కడికి అక్కడే మృతిచెందాడు. భార్య సుబ్బులు, కుమారుడు ఏడుకొండలు, మరో మహిళ వెంకట రంగమ్మలు పిడుగుపాటుకు షాక్‌కు గురయ్యారు. కాళ్లు, చేతులు కదపలేని స్థితిలో అచేతనంగా ఉన్న వీరిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నార్నెపాడులో గ్రామంలో గడ్డి కోస్తున్న యార్లగడ్డ మంగాయమ్మ(45), బొల్లవరం గ్రామంలో వరిచేలో మందు చల్లుతున్న రైతు కళ్ళం అర్జునారెడ్డి (45) పిడుగుపాటుకు మరణించారు. అర్జునారెడ్గి వెంట ఉన్న మరో ముగ్గురు స్వల్పంగా గాయపడగా వారిని నరసరావుపేట ఆస్పత్రికితరలించారు. పొట్టకూటి కోసం వలస వచ్చి తురకపాలెం గ్రామంలో కూలి పనులు చేస్తున్న భూపతి సుధ (22) గురువారం మధ్యాహ్నం పిడుగుపాటుకు అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో గాయపడిన ఆమె భర్త రవి, మరో మహిళ కోనాల రాగేలు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బతుకుతెరువు కోసం కృష్ణా జిల్లా కలదిండి మండలం, కోరుకొల్లు గ్రామం నుంచి వచ్చిన కూలీల్లో సుధ ఒకరు. ఉపాధి కోసం ఇంత దూరం వస్తే తన భార్యను ఆ దేవుడు దూరం చేశాడంటూ రవి విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. దమ్మాలపాడు గ్రామంలో పిడుగుపాటుకు ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో గ్రామానికి చెందిన సూరంశెట్టి రమణమ్మతోపాటు, పశ్చిమగోదావరి జిల్లా ఆలంపూడి వాటసులు పోట్రోలు వెంకమ్మ, దోనాది దుర్గ ఉన్నారు. వీరిని నరసరావుపేటకు చికిత్స నిమిత్తం తరలించారు. స్థానిక ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పిడుగుపాటుకు చనిపోయిన వారి మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. గాయపడిన వారిని పరామర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత అంబటి రాంబాబు చాగంటివారిపాలెం గ్రామంలో తేలుకుట్ల వెంకటేశ్వర్లు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మిరప మొక్కలు నాటేందుకు వె ళ్లి.. అచ్చంపేట మండలం నిండుజర్లలో పిడుగుపాటుకు మహిళ మృతి చెందగా మరో 16 మందికి తీవ్రంగా గాయపడ్డారు. మృతురాలి భర్త సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తోకల గంగయ్య పొలంలో మిరప నారు వేసేందుకు 25 మందిగల ముఠా వెళ్లారు. మొక్కలు నాటుతుండగా మధ్యాహ్నం 2గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ప్రారంభమైంది. కూలీలు సమీపంలోని వేపచెట్టు కిందకు వెళ్లారు. కొద్దిసేపటికి చెట్టుపై పిడుగు పడటంతో యడవల్లి సాంబ్రాజ్యం (52) అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందింది. షాక్‌తో సృహతప్పిన వారిని, గాయపడిన వారిని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో తోకల పద్మ, కుందరు శివపార్వతిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జమ్మిచెట్టు కిందకు వెళ్లి.. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన రైతు వీరగంధం శ్రీనివాసరావు (43), బండారుపల్లి ధనలక్ష్మిలు గురువారం ఉదయాన్నే కనపర్తి డొంకరోడ్డు వద్ద గల తమ పొలంలో వరినాట్లు వేసుకునేందుకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో భారీవర్షం ప్రారంభమైంది. ఇద్దరూ సమీపంలోని జమ్మిచెట్టు కిందకు చేరారు. చెట్టుపై పిడుగు పడటంతో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందగా, ధనలక్ష్మికి గాయాలయ్యాయి. గమనించిన తోటి రైతులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ సాంబశివరావు కేసు నమోదు చేశారు. శ్రీనివాసరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదేవిధంగా రొంపిచర్ల మండలంలోని విప్పర్ల గ్రామానికి చెందిన షేక్ పమిడిమర్రి దరియాసాహేబ్(40) పొలంలోని నారుమడి వద్ద ఉన్నాడు. ఈసమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం వచ్చి పిడుగుపడటంతో మృతి చెందాడు. పెదకూరపాడుకు చెందిన పాగల్లు సాగర్‌బాబు(23) గురువారం ఉదయం తమ పొలాల్లోని మిర్చినారు మడిలో కలుప తిసేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో పిడుగుపాటుకు గురై అక్కడక్కడే మృతి చెందాడు. రాత్రి 9 గంటలు దాటినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లి స్థానికులకు చెప్పగా.. కొందరు యువకులు నారుమడి వద్దకు వెళ్లారు. అక్కడ సాగర్‌బాబు మృతదే హాన్ని గుర్తించారు.