ముప్పాళ్ల : గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం ముప్పాళ్ల గ్రామం సమీపంలో లారీ ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని నాదెండ్ల మండలం చిరుమామిళ్లకు చెందిన అంజలి (45)గా గుర్తించారు. బావ శివారెడ్డితో కలిసి అంజలి సత్తెనపల్లిలో ఓ వేడుకకు హాజరై తిరిగి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. కిందపడిపోవడంతో లారీ ఆమెపై నుంచి ముందుకు వెళ్లింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.