
కరీంనగర్, సాక్షి: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మానకొండూరు మండలం కెల్లడ గ్రామానికి చెందిన దివ్యశ్రీ అనే మహిళ లారీ కింద ఇరుక్కుపోయింది. కేకలు వేయడంతో హుజూరాబాద్ సమీపంలోని సింగాపూర్ శివారులో కొద్దిదూరం వెళ్లాక డ్రైవర్ లారీని ఆపాడు.ఈ క్రమంలో ములుగు వెళుతూ ఘటనా స్థలం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగారు.

లారీ కింద చిక్కుకుని రక్తమోడుతున్న దివ్యశ్రీని బండి సంజయ్ కాపాడారు. అటువైపు వెళుతున్న లారీలను ఆపి జాకీలు, కత్తెర తెప్పించారు. కేంద్ర మంత్రి సూచనతో జుట్టు కత్తిరించి ఆమె మహిళ ప్రాణాలను స్థానికులు కాపాడారు. అనంతరం ఆ మహిళను చూసిన ఆమె పిల్లలు భోరున విలపించారు. గాయాలపాలైన మహిళను కరీంనగర్‌లోని లైఫ్ లైన్ ప్రైవేట్ ఆసుపత్రికి బండి సంజయ్ పంపించారు. దివ్యశ్రీ చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని ఆసుపత్రి వైద్యులకు మంత్రి సంజయ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment