
ఆఫ్రీది (ఫైల్)
ముప్పాళ్ల: వాలీబాల్ ఆటలో జరిగిన వివాదం బాలుడి హత్యకు దారితీసింది. గుంటూరు జిలా ముప్పాళ్లకు చెందిన షేక్ ఆఫ్రీది(16), ఖాజిల్ వాలీబాల్ ఆడుకుంటూ గొడవపడ్డారు. ఈ విషయాన్ని ఖాజిల్ తన పెదనాన్న షేక్ పెదబాజీకి తెలిపాడు. దీంతో పెదబాజీ కత్తితో ఆఫ్రీది ఇంటిపైకి వెళ్లాడు. అక్కడ బయట ఉన్న ఆఫ్రీదిపై దాడిచేశాడు.
స్థానికులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో పెదబాజీని స్థానికులు పోలీసులకు అప్పగించారు. అయూబ్‌ఖాన్, సైదాబీల రెండో కుమారుడైన ఆఫ్రీది ఈ ఏడాది పదో తరగతి చదవాల్సి ఉంది. ఆఫ్రీది హత్యతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment