కావాలనే దౌర్జన్యం చేశారు: అంబటి | ambati rambabu demand for postpone muppalla mpp president eletion | Sakshi
Sakshi News home page

కావాలనే దౌర్జన్యం చేశారు: అంబటి

Published Sun, Jul 13 2014 9:03 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

కావాలనే దౌర్జన్యం చేశారు: అంబటి - Sakshi

కావాలనే దౌర్జన్యం చేశారు: అంబటి

గంటూరు: ముప్పాళ్ల ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తమపై దాడి చేసి తమ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను టీడీపీ కార్యకర్తలు కిడ్నాప్ చేశారని ఆయన తెలిపారు. కావాలనే తమపై దౌర్జన్యం చేశారని చెప్పారు. రెండు కార్లు ధ్వంసం చేశారని తెలిపారు.

ఎంపీపీ అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యానికి పాల్పడే అవకాశముందని డీజీపీకి విన్నవించుకున్నా రక్షణ కల్పించలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈవిధంగా జరగడం దారుణమన్నారు. అంతకుముందు కావాలనే ఎంపీపీ ఎన్నికను వాయిదా వేశారని ఆరోపించారు. పరిస్థితులు చక్కబడేవరకు ఎంపీపీ అధ్యక్ష ఎన్నిక వాయిదా వేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తమపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement