బాబు పాలన విమాన ప్రయాణాలతోనే సరి | Even with the regime chandra Babu air travel | Sakshi
Sakshi News home page

బాబు పాలన విమాన ప్రయాణాలతోనే సరి

Published Mon, Nov 2 2015 12:28 AM | Last Updated on Sat, Jul 28 2018 3:30 PM

Even with the regime chandra Babu air travel

సొంతింటి కార్యక్రమంలా రాజధాని శంకుస్థాపన
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల ధ్వజం

 
మంగళగిరి రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన  మొత్తం ఇతర దేశాలకు విమానాల్లో తిరగడానికే సరిపోతోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం తెనాలి డివిజన్ శాఖ  కార్యదర్శుల శిక్షణ  తరగతుల్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని సొంత ఇంటి కార్యక్రమంగా మార్చారని ఆరోపించారు.

రాజధాని అమరావతి అయిదుకోట్ల ఆంధ్రుల సొత్తు అని చెప్పారు.  కానీ రాజధానిని  ముఖ్యమంత్రి తన సొంత సొత్తులా మార్చారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తే గుప్పెడు మట్టి, మురికి నీళ్లు తెచ్చారని, చంద్రబాబు అదేదో మహా ప్రసాదంలా స్వీకరించడం హాస్యాస్పదంగా వుందన్నారు.  సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్,  నాయకులు   జెల్లి భాగ్య శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement