![Woman Racer Injured In Indian Racing League Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/20/Woman-Racer.jpg.webp?itok=ps6nh6oa)
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై టర్బో రైడర్స్ మహిళారేసర్‌కు గాయాలయ్యాయి. క్వాలి ఫైయింగ్ రేసులో గోవా ఏసెస్ రేసింగ్ కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
వరుస ప్రమాదాలతో కార్ రేసింగ్ ఆలస్యంగా జరిగింది. రేసింగ్ ఇలాంటివి సహజమేనని నిర్వాహకులు అంటున్నారు. ఇదిలా ఉండగా, లైటింగ్ తగ్గడంతో రేసింగ్ లీగ్ నిలిచిపోయింది. ఫార్మూలా-4 రేస్‌తోనే నిర్వాహకులు సరిపెట్టారు.
కాగా, శనివారం మధ్యాహ్నం ట్రయల్ నిర్వహిస్తున్న క్రమంలో ఐమాక్స్ వద్ద ఒక చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో అటు వైపు నుంచి వేగంగా దూసుకొస్తున్న కారు ముందు భాగంలో కొమ్మ పడింది.
కారును ఆపి మెకానిక్ షెడ్‌కు తరలించారు. చిన్న మరమ్మతుల అనంతరం తిరిగి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా– ఈ పోటీలకు ట్రయల్ రన్‌గా భావిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌కు నెక్లెస్ రోడ్డు వేదికైంది. 2.3 కిలోమీటర్ల ట్రాక్‌లో కార్లు భారీ వేగంతో పరుగులు తీస్తున్నాయి.
చదవండి: టీపీసీసీ సీరియస్.. మీటింగ్‌కు ఎందుకు రాలేదు?
Comments
Please login to add a commentAdd a comment