Indian Racing
-
హైదరాబాద్ వేదికగా మరోసారి ఇండియా రేసింగ్ లీగ్
-
కార్ల రేసింగ్‌తో తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు.. స్పందించిన బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ‘కార్ల రేసింగ్ ట్రయల్స్ పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారా... నగరం నడిబొడ్డున ‘ఇండియన్ రేసింగ్ లీగ్’నిర్వహించాల్సినఅవసరం ఏమొచ్చింది’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ‘ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో హైదరాబాద్ నడిబొడ్డున కార్ల రేస్ ట్రయల్స్‌ను నిర్వహిస్తూ ప్రజలకు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించడాన్ని ఖండిస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరువల్ల నగర ప్రజలు ట్రాఫిక్ రద్దీతో సతమతమవుతున్నారు. అత్యవసర అంబులెన్స్ సర్వీసులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి’అని ఒక ప్రకటనలో విమర్శించారు. ‘కార్ల రేస్ కోసం నగరం నడిబొడ్డున సెక్రటేరియట్, ఐమాక్స్, నెక్లెస్‌రోడ్డు పరిసరాలను పోలీసులు దిగ్బంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో ప్రజా ధనాన్ని అడ్డగోలుగా ఖర్చు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. కార్ల రేసింగ్ నిర్వహణకు బీజేపీ వ్యతిరేకం కాదు... అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కార్ల రేసింగ్ నిర్వహించాలన్నదే బీజేపీ ఉద్దేశం. అయితే ట్రాఫిక్‌కు ఇబ్బంది లేని రీతిలో శాశ్వత ప్రాతిపదికన కార్ల రేసింగ్ నిర్వహించాలి. బీజేపీ అధికారంలోకొస్తే ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా మెరుగ్గా కార్ల రేసింగ్ నిర్వహిస్తాం. కార్ల రేసింగ్‌కు పెట్టే ప్రతిపైసా, వసూళ్ల వివరాలను పారదర్శకంగా వెల్లడిస్తాం’అని పేర్కొన్నారు. -
రేస్ లేకుండానే ముగిసిన లీగ్.. ‘డ్రైవర్ల భద్రతే అన్నింటికంటే ముఖ్యం’
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్... గత కొద్ది రోజులుగా భాగ్యనగరంలో చర్చగా మారిన స్పోర్ట్స్ ఈవెంట్! శనివారమే లీగ్‌లో భాగంగా క్వాలిఫయింగ్‌తోపాటు ఒక ప్రధాన రేసు జరగాల్సి ఉన్నా... వేర్వేరు కారణాలతో అన్నింటినీ ఆదివారానికి వాయిదా వేశారు. వీకెండ్లో ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో అభిమానులు హుస్సేన్ సాగర్ తీరానికి తరలి వచ్చి ‘స్ట్రీట్ సర్క్యూట్’లో రేసింగ్ పోటీలను తిలకించేందుకు సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా జరిగిన ఒక ఘటన తొలి అంచెలో మూడు రేసులను ముగించింది. అప్పటికి ఇంకా క్వాలిఫయింగ్ రేస్‌లు ప్రారంభమే కాలేదు. ప్రాక్టీస్ మాత్రమే సాగుతోంది. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో చెన్నై జట్టుకు చెందిన డ్రైవర్ విష్ణు ప్రసాద్ కారు ప్రమాదానికి గురైంది. దాంతో అతడిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బ్రేక్‌ల సమస్యే ఇందుకు కారణమని తేలింది. ఎల్జీబీ ఫార్ములా 4లో పోటీపడుతున్న కార్లు ప్రాక్టీస్ సమయంలో వుల్ఫ్ జీబీ08 థండర్స్ కారు బ్రేక్‌లు ఆశించిన రీతిలో సరిగా పని చేయడం లేదని అప్పటికే డ్రైవర్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాక్‌లో మలుపుల వద్ద హెవీ బ్రేకింగ్ జోన్లో అవి ప్రభావం చూపలేకపోయాయి. ప్రమాదం జరిగాక ఆ కారును సర్క్యూట్ నుంచి తప్పించిన నిర్వాహకులు తర్జనభర్జనల అనంతరం ప్రధాన రేస్‌లను ప్రారంభించరాదని నిర్ణయించారు.‘డ్రైవర్ల భద్రతే అన్నింటికంటే ముఖ్యం. ఎఫ్ఎంఎస్సీఐ సూచనల మేరకు ముందు జాగ్రత్తగా రేస్‌లను రద్దు చేశాం. ఘటనపై విచారణ జరిపిస్తాం’అని ఇండియన్ రేసింగ్ లీగ్ అధికారులు వెల్లడించారు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లీగ్‌లో భాగంగా తర్వాతి రెండు అంచెలు చెన్నైలో, ఆపై చివరి అంచె డిసెంబర్ 10, 11లో మళ్లీ హైదరాబాద్‌లోనే జరగాల్సి ఉంది. అయితే తాజా ఘటన అనంతరం వాయిదా పడిన తొలి అంచెలోని మూడు రేస్‌లను ఎప్పుడు నిర్వహిస్తారో? మరోవైపు ఇండియన్ రేసింగ్ లీగ్ అర్ధాంతరంగా ముగిసినా వీక్షకులకు మరో రూపంలో కాస్త ఊరట లభించింది. అదే ట్రాక్‌పై ఆదివారం సమాంతరంగా జరగాల్సిన జేకే టైర్ నేషనల్ రేసింగ్ చాంపియన్‌షిప్ (ఎల్జీబీ ఫార్ములా 4)ను మాత్రం విజయవంతంగా నిర్వహించారు. ఈ చాంపియన్‌షిప్‌లో భాగంగా ‘ఓపెన్ వీల్‘కార్లతో సాగిన మూడు రేస్‌లు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. -
Hyderabad: నిలిచిపోయిన కార్ రేసింగ్ లీగ్.. కారణం ఇదే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై టర్బో రైడర్స్ మహిళారేసర్కు గాయాలయ్యాయి. క్వాలి ఫైయింగ్ రేసులో గోవా ఏసెస్ రేసింగ్ కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. వరుస ప్రమాదాలతో కార్ రేసింగ్ ఆలస్యంగా జరిగింది. రేసింగ్ ఇలాంటివి సహజమేనని నిర్వాహకులు అంటున్నారు. ఇదిలా ఉండగా, లైటింగ్ తగ్గడంతో రేసింగ్ లీగ్ నిలిచిపోయింది. ఫార్మూలా-4 రేస్‌తోనే నిర్వాహకులు సరిపెట్టారు. కాగా, శనివారం మధ్యాహ్నం ట్రయల్ నిర్వహిస్తున్న క్రమంలో ఐమాక్స్ వద్ద ఒక చెట్టు కొమ్మ విరిగిపడింది. దీంతో అటు వైపు నుంచి వేగంగా దూసుకొస్తున్న కారు ముందు భాగంలో కొమ్మ పడింది. కారును ఆపి మెకానిక్ షెడ్‌కు తరలించారు. చిన్న మరమ్మతుల అనంతరం తిరిగి దూసుకెళ్లింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఫిబ్రవరి 11న జరగనున్న ఫార్ములా– ఈ పోటీలకు ట్రయల్ రన్‌గా భావిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌కు నెక్లెస్ రోడ్డు వేదికైంది. 2.3 కిలోమీటర్ల ట్రాక్‌లో కార్లు భారీ వేగంతో పరుగులు తీస్తున్నాయి. చదవండి: టీపీసీసీ సీరియస్.. మీటింగ్‌కు ఎందుకు రాలేదు? -
Hyderabad: ఇండియన్ రేసింగ్ లీగ్ కోసం ఉత్కంఠగా..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా ఇండియన్ రేసింగ్ లీగ్ శనివారం ప్రారంభం కానుంది. నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన 2.7 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్‌లో ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఆదివారం కూడా ఈ పోటీలు కొనసాగనున్నాయి. ఇందుకోసం హెచ్ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోటీలో 12 కార్లు 24 మంది డ్రైవర్లు తమ సత్తా చాటనున్నారు. ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ పోటీలను వీక్షించేందుకు ప్రేక్షకుల కోసం ట్రాక్ మార్గంలో 7 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సుమారు 7,500 మంది ఈ ఈవెంట్‌ను వీక్షించనున్నారు. ఇప్పుడు జరిగేవి ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు మాత్రమేనని, ఫిబ్రవరి 11న ఫార్ములా–ఈ కార్ రేసింగ్ జరుగుతుందని హెచ్‌జీసీఎల్ ఎండీ సంతోష్ చెప్పారు. ట్రాక్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కూడా ఈ పోటీలు దోహదం చేస్తాయన్నారు. ఈ సందర్భంగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 10, 11 తేదీల్లో మరోసారి ఈ పోటీలను నిర్వహించనున్నట్లు చెప్పారు. -
అర్మాన్‌కు ప్రొ ఆమ్ టైటిల్
ఆర్మాన్ ఇబ్రహీం ,సూపర్ ట్రొఫియో సిరీస్ , భారత రేసింగ్ వాలెన్సియా (స్పెయిన్): భారత రేసింగ్ సెన్సేషన్ ఆర్మాన్ ఇబ్రహీం లంబోర్గిని సూపర్ ట్రొఫియో సిరీస్‌లోని ప్రొ ఆమ్ చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో తన సహచరుడు దిలంతా మలగమువా (శ్రీలంక)తో కలిసి ఈ ఫీట్ సాధించాడు. అలాగే ఈ ఏడాదంతా నిలకడైన ఆటతీరును ప్రదర్శించిన ఈ జంట ప్రొ విభాగంలో మూడో స్థానం సాధించింది. ఉదయం జరిగిన ఆరు రౌండ్లలో అర్మాన్, దిలంతా మూడో స్థానంలో రాగా మధ్యాహ్నం జరిగిన రేసు లో నాలుగో స్థానంలో నిలిచింది. దీంతో టైటిల్ సా ధించేందుకు కావలిసిన పాయింట్లు దక్కించుకుంది.