సాక్షి, హైదరాబాద్: ‘కార్ల రేసింగ్ ట్రయల్స్ పేరుతో ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారా... నగరం నడిబొడ్డున ‘ఇండియన్ రేసింగ్ లీగ్’నిర్వహించాల్సినఅవసరం ఏమొచ్చింది’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ‘ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో హైదరాబాద్ నడిబొడ్డున కార్ల రేస్ ట్రయల్స్‌ను నిర్వహిస్తూ ప్రజలకు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించడాన్ని ఖండిస్తున్నాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరువల్ల నగర ప్రజలు ట్రాఫిక్ రద్దీతో సతమతమవుతున్నారు.
అత్యవసర అంబులెన్స్ సర్వీసులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి’అని ఒక ప్రకటనలో విమర్శించారు. ‘కార్ల రేస్ కోసం నగరం నడిబొడ్డున సెక్రటేరియట్, ఐమాక్స్, నెక్లెస్‌రోడ్డు పరిసరాలను పోలీసులు దిగ్బంధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇండియన్ రేసింగ్ లీగ్ పేరుతో ప్రజా ధనాన్ని అడ్డగోలుగా ఖర్చు పెట్టడాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం.
కార్ల రేసింగ్ నిర్వహణకు బీజేపీ వ్యతిరేకం కాదు... అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కార్ల రేసింగ్ నిర్వహించాలన్నదే బీజేపీ ఉద్దేశం. అయితే ట్రాఫిక్‌కు ఇబ్బంది లేని రీతిలో శాశ్వత ప్రాతిపదికన కార్ల రేసింగ్ నిర్వహించాలి. బీజేపీ అధికారంలోకొస్తే ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా మెరుగ్గా కార్ల రేసింగ్ నిర్వహిస్తాం. కార్ల రేసింగ్‌కు పెట్టే ప్రతిపైసా, వసూళ్ల వివరాలను పారదర్శకంగా వెల్లడిస్తాం’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment