
సాక్షి, కాకినాడ : గాంధీ పార్కు సమీపంలో శుక్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు తెల్లవారుజామున 4.30 నిమిషాల సమయంలో మూడు సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. పెద్దగా శబ్ధం రావడంతో చుట్టుపక్కల స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో పక్కనున్న ఇళ్లలో కూడా మంటలు వ్యాపించడంతో అందులో ఉన్న సిలిండర్లు కూడా పేలాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు.
అయితే దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకొని ఓ వృద్ధురాలు సజీవ దహనం అయ్యింది.. మృతురాలిని తుమ్మల విజయలక్ష్మీ(65)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరణించిన వృద్ధురాలి సోదరి మాట్లాడుతూ.. ప్రమాదం ఎలా జరిగిందో తెలీయదని, ఒక్కసారిగా మంటలు చేలరేగాయని అన్నారు. ఇళ్లు కాలిపోతున్నాయని తన సోదరే అందరికి చెప్పిందని, కానీ బయటకు వచ్చేందుకు దారి లేక తను మంటల్లో చిక్కుకొని మరణించిందని కన్నీరు పెట్టుకున్నారు. ఈ ప్రమాదంలో నాలుగు కుటుంబాలకు ఆస్తినష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment