చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం | Major fire accident in chennai Raja annamalai puram | Sakshi

చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం

Jan 16 2014 2:43 PM | Updated on Apr 3 2019 3:52 PM

చెన్నైలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

చెన్నై : చెన్నైలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. తెలుగువారు అధికంగా నివసించే చెన్నై రాజా అన్నామలైపురం పక్స్‌రోడ్డులో భారీ ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోడౌన్‌లో నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలు రాజుకున్నాయి. మంటలు అత్యంత వేగంగా వ్యాపించటంతో అప్పటికే కొన్ని ఇళ్లు కాలిపోయాయి.

వెంటనే అగ్ని మాపక దళ సిబ్బందికి సమాచారమివ్వడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అయిదు ఫైరింజన్లతో నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా సుమారు నాలుగుకోట్ల ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement