
గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలికి తీవ్ర గాయాలు
విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. వన్ టౌన్‌లోని సొరంగం ప్రాంతంలో ఓ ఇంట్లో సోమవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలడంతో వృద్ధురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి.
చిట్టినగర్: విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. వన్ టౌన్‌లోని సొరంగం ప్రాంతంలో ఓ ఇంట్లో సోమవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలడంతో వృద్ధురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అప్పారావు, సూర్యనారాయణమ్మ(65) దంపతులు స్థానికంగా నివాసం ఉంటున్నారు. ఉదయాన్నే సూర్యనారాయణమ్మ ఇంట్లో టీ పెట్టేందుకు గ్యాస్ స్టవ్ వెలిగించింది. అప్పటికే గ్యాస్ లీకేజీ ఉండడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు అంటుకున్నాయి. స్థానికులు మంటలను ఆర్పివేసి తీవ్రంగా గాయపడిన సూర్యనారాయణమ్మను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ సిలిండర్ పేలుడు దాటికి వారి ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతింది.