సాక్షి, గుంటూరు : జిల్లాలోని చిలకలూరిపేట ఎన్టీఆర్ నగర్ కాలనీలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్యాస్ స్టౌవ్ రిపేర్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన ఆది లక్ష్మీ ఈ రోజే కొత్తగా గ్యాస్ సిలిండర్‌ను కొనుక్కొచ్చారు. గ్యాస్ పొయ్యిని సిలిండెర్‌కు కలెక్షన్ ఇచ్చేందుకు పక్కింటి దివ్యను పిలిచారు. గ్యాస్ స్టౌవ్ రిపేర్ చేస్తుండగా సిలిండర్ పేలింది. ఈ ఘటన రేకుల షెడ్డు పేలి దివ్య, ఆదిలక్ష్మీ అక్కడికక్కడే మృతి చెందారు.ఇంట్లో ఉన్న మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment