వైఎస్సార్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
ఖాజీపేట: వైఎస్సార్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఖాజీపేట మండలం వాసవీభవన్ దగ్గర శుక్రవారం తెల్లవారుజామున ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ సిలిండర్ పేలి భార్యభర్తలకు తీవ్రగాయాలయ్యాయి.
ఈ ఘటనలో భర్త అనిల్‌కు స్వల్పగాయాలు కాగా భార్య సుజాతకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రి నుంచి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.