చిత్తూరులో గురువారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది.
చిత్తూరు: చిత్తూరులో గురువారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. స్థానిక ధర్మరాజులుగుడి వీధిలో ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
ఇంటిలో నిద్రిస్తున్న బీబీ(52) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన స్థానికులు గాయపడిన మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.