
హైదరాబాద్ లో ఓ ఇంట్లో భారీ చోరీ
హైదరాబాద్: నగరంలో మంగళవారం భారీ చోరి జరిగింది. ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ప్రశాంత్‌నగర్‌లో ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు బంగారం అపహరించారు. స్థానికంగా నివాసముంటున్న లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఇంట్లో 30 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే తమ ఇంటి పనిచేసే వ్యక్తిపై బాధిత యజమాని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.