హైదరాబాద్: నగరంలోని చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. సికింద్రాబాద్ పార్శిగుట్టకు చెందిన తన కుమారుడికి తాయత్తు కట్టించేందుకు నడుచుకుంటూ ఓ మహిళ వెళ్తున్నది. ఆ సమయంలో వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని పది తులాల బంగారు గొలుసు తెంచుకుని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడి కోసం గాలిస్తున్నారు.