మేడిపల్లిలో దొంగల హల్‌చల్
Published Mon, Aug 8 2016 10:57 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
హైదరాబాద్: సైబరాబాద్ మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి దొంగలు తెగబడ్డారు. బోడుప్పల్ టెలిఫోన్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్కెట్ చేసిన దొంగలు.. రెండిళ్లలో ప్రవేశించి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకు పోయారు. అలాగే, పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోని ఓ దుకాణం షట్టర్లు తొలగించి, రూ.5 లక్షల విలువైన సామగ్రిని దోచుకున్నారు. సోమవారం ఉదయం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement