ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
Published Thu, Jan 19 2017 2:26 PM | Last Updated on Thu, Aug 2 2018 4:35 PM
శంషాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ వ్యక్తి నుంచి 467 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడు మస్కట్ నుంచి ఒమర్ ఎయిర్‌లైన్స్ డబ్ల్యువై-235 విమానంలో హైదరాబాద్ వచ్చాడు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో చేపట్టగా బంగారం పట్టుబడింది. పట్టుకున్న బంగారం విలువ రూ.13.64 లక్షలు అని అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement