హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో దోహా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద రెండు కిలోల బంగారు లభ్యమైంది. పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తాను పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాడినని ఆ ప్రయాణికుడు చెప్పినట్టు సమాచారం.