shamsabad airport
-
మిక్సీలో బంగారం దాచి అడ్డంగా దొరికిపోయాడు..!
సాక్షి, శంషాబాద్: మిక్సీలో 1,725 గ్రాముల బంగారాన్ని దాచి దుబాయ్ నుంచి తీసుకొచ్చిన ప్రయాణికుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఓ ప్రయాణికుడు మిక్సీని తెచ్చాడు. అనుమానం వచ్చిన అధికారులు మిక్సీ విడి భాగాలను వేరుచేసి పరిశీలించగా 1,725 గ్రాములు బంగారం బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
స్వీట్ బాక్సుల్లో రూ.1.48 కోట్లు
సాక్షి, హైదరాబాద్ : అక్రమంగా రవాణా చేస్తున్న దుబాయ్ కరెన్సీని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నా రు. కరెన్సీని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. విదేశీ కరెన్సీ అక్రమ రవాణాపై విశ్వసనీయ సమాచారం అందడంతో డీఆర్ఐ అధికారులు సోమవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి లగేజీలో ఉన్న మిఠాయి బాక్సుల్లో 3,50,000 సౌదీ రియాల్స్ లభించాయి. అలాగే ఎయిరిండియా విమానం నుంచి దిగిన మరో ప్రయాణికుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతడి లగేజీలో ఉన్న ఉస్మానియా బిస్కెట్‌బాక్సుల్లో 3,50,000 సౌదీ రియాల్స్ లభించాయి. భారత కరెన్సీలో వీటి విలువ రూ.1,48,75,000 గా ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీరు ఈ మొత్తాన్ని దుబాయ్‌కు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ఫెమా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీని తరలిస్తున్నందుకు వీరిని అరెస్ట్ చేశామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఒకేరోజు ఇద్దరు స్మగ్లర్లు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు బుధవారం ఒక్క రోజే ఇద్దరు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరిలో ఒకరు రెక్టమ్ కన్సీల్మెంట్ రూపంలో, మరొకరు పౌడర్‌గా మార్చి బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరిద్దరి నుంచి 4 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు సూత్రధారుల కోసం లోతుగా విచారిస్తున్నారు. ప్రత్యేక శస్త్రచికిత్సలు.. ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న వారి వద్ద పనిచేస్తూ లేదా కమీషన్ తీసుకుంటూ పసిడిని దేశంలోకి తీసుకువచ్చే వారిని క్యారియర్లు అంటారు. ఈ కీలక వ్యక్తులు సుదీర్ఘకాలం తమ వద్ద పనిచేసే క్యారియర్లకు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా రెండు కేజీల వరకు బంగారాన్ని చిన్న బిస్కెట్ల రూపంలో పెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుంటున్న క్యారియర్లు అక్రమ రవాణాలకు పాల్పడుతున్నారు. బుధవారం చిక్కిన ఇద్దరిలో ఒకరు ఈ రూపంలోనే పసిడిని తీసుకువచ్చారు. హెన్నాలో బంగారం పొడి.. ఇతడు పట్టుబడిన కాసేపటికే మరో క్యారియర్ సైతం పట్టుబడ్డాడు. ఇతగాడు బంగారాన్ని పొడి చేసి.. హెన్నాతో (మెహెందీ పొడి) కలిపి.. పేస్ట్‌లా మార్చి ఎవరికీ అనుమానం రాకుండా అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇలా పసిడిని పొడి రూపంలో తీసుకువచ్చి చిక్కిన కేసులూ అనేక ఉంటున్నాయి. ఆ పొడి కూడా బంగారం రంగులోనే ఉండటంతో పట్టుబడే అవకాశాలు ఎక్కువ. దీంతో మరో అడుగు ముందుకు వేసిన స్మగ్లర్లు బంగారం పొడిని గోధుమ రంగులో ఉన్న హెన్నాలో కలిపేస్తున్నారు. ఇలా తన రంగును కోల్పోయి, పౌడర్ రూపంలోకి మారిన బంగారం, హెన్నా మిక్స్‌ను పేస్ట్‌గా మార్చడానికి చాక్లెట్ తయారీకి వినియోగించే లిక్విడ్స్ వాడుతున్నారు. ఇతర కెమికల్స్ వాడితే విమానంలో తరలించడం కష్టమనే భావంతో ఈ లిక్విడ్స్ వినియోగించి ఆ మిక్స్‌ను పేస్ట్‌గా మారుస్తున్నారు. ఇలా తయారైన గోధుమ రంగు పేస్ట్‌ను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసిన స్మగ్లర్లు దాన్ని బ్రౌన్ కవర్లలో ఉంచి పైన ప్లాస్టర్లు వేస్తున్నారు. ఇలా తీసుకువచ్చిన వ్యక్తినీ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. -
గోల్డ్ స్మగ్లింగ్‌లో ఐదో స్థానం
సాక్షి, హైదరాబాద్: బంగారం అక్రమ రవాణాలో హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే ఐదో స్థానంలో నిలిచిందని కస్టమ్స్ విభాగం కమిషనర్ ఎంఆర్ఆర్ రెడ్డి వెల్లడించారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 40 కేజీల పసిడి స్వాధీనం చేసుకోగా.. గత నెల 1 నుంచి మంగళవారం వరకు 10 కేజీలు చిక్కినట్లు తెలిపారు. నిరుపేదల్ని పావులుగా మార్చుకుని యథేచ్ఛగా ఈ వ్యవహారం సాగిస్తున్నారని, మరికొందరు కమీషన్ కోసం క్యారియర్లుగా మారుతున్నారని అన్నారు. అదనపు కమిషనర్ మంజుల హోస్మానీ, డిప్యూటీ కమిషనర్ కల్యాణ్ రేవెళ్లతో కలసి శంషాబాద్‌లోని కస్టమ్స్ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఎంఆర్ఆర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కొందరు స్మగ్లర్లు వ్యవస్థీకృతంగా వ్యవహరిస్తూ భారీ స్థాయిలో బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. హైదరాబాద్–దుబాయ్‌ల్లో బంగారం ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసం నేపథ్యంలో ఈ దందాకు దిగుతున్నారు. నేరుగా దిగుమతి చేసుకుంటే 38.5 శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉండటంతో స్మగ్లింగ్‌కు తెగబడుతున్నారు. అయితే ఎక్కడా వీళ్లు నేరుగా సీన్లోకి రావట్లేదు. ఆయా దేశాల నుంచి వస్తున్న కొందరు యువతను కమీషన్ పేరుతో ఆకర్షిస్తున్న స్మగ్లర్లు తమ తరఫున పనిచేసేలా చేసుకుంటున్నారు. అలాగే దుబాయ్ తదితర దేశాల్లో స్థిరపడిన వారితోనూ ఒప్పందాలు చేసుకుని వారినీ ఈ రొంపిలోకి దింపుతున్నారు. దుబాయ్‌లో ఉంటున్న స్మగ్లింగ్ గ్యాంగ్‌ల సభ్యులు అక్కడి ట్రావెల్ ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. వారి ద్వారా హైదరాబాద్‌కు వెళ్తున్న పేద, మధ్య తరగతి వారిని గుర్తిస్తున్నారు. ఆయా ప్రయాణికుల్ని సంప్రదిస్తున్న ముఠా సభ్యులు తాము అప్పగించిన వస్తువులు తీసుకువెళ్లేలా వారిని ఒప్పిస్తున్నారు. దీనికోసం కొందరికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు కమీషన్ ఇస్తుండగా.. మరికొందరికి టికెట్ కొనిస్తున్నారు. సాంకేతిక పరిభాషలో క్యారియర్లుగా పిలిచే వీరిలో అత్యధికులకు తాము పసిడి తీసుకువస్తున్నామని తెలియట్లేదు. అలా ఉండేందుకు బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చేసి వీరికి అప్పగిస్తున్నారు. ఇక్కడికి వచ్చాక వీరిని రిసీవ్ చేసుకునేది ఎవరో, వారి కాంటాక్ట్ నంబర్లు ఏమిటో చెప్పరు. అలా చేస్తే కస్టమ్స్ తనిఖీల్లో వీరు చిక్కితే ముఠా గుట్టురట్టవుతుందని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరి ఫొటోలను మాత్రం వాట్సాప్ ద్వారా ఇక్కడ ఉంటున్న రిసీవర్లకు పంపుతున్నారు’ అని అన్నారు. ఇవీ గణాంకాలు: 2018–19 ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్ అధికారులు 86 స్మగ్లింగ్ కేసుల్ని గుట్టురట్టు చేశారు. వీరి నుంచి రూ.12 కోట్లకు పైగా విలువైన 40 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అరె స్టు అయిన వారిలో 20 మంది భారతీయులు, ఒక విదేశీయుడు ఉన్నారు. గత నెల 1 నుంచి మంగళవారం వరకు 14 కేసులు నమోదయ్యాయి. ఐదుగురిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు వీరి నుంచి రూ.3 కోట్ల విలువైన 10 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పురుషులు 20, మహిళలు 40 గ్రాములు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బంగారం విషయంలో తప్పక రూల్స్ పాటించాలని ఎంఆర్ఆర్ రెడ్డి తెలిపారు. విదేశాల నుంచి వచ్చే పురుషులు 20 గ్రాములు, మహిళలు 40 గ్రాముల బంగారాన్ని తమ వెంట తీసుకురావచ్చని అన్నారు. ఎక్కువ మోతాదులో బంగారం తెస్తుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ విభాగానికి చెందిన రెడ్ చానల్లో డిక్లేర్ చేసి పన్ను చెల్లించాలని చెప్పారు. రూ.20 లక్షలకు మించి విలువైన బంగారంతో పట్టుబడితే అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు. -
హాయిగా.. ట్రాఫిక్‌లో జాలీగా..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఐటీ కారిడార్ వరకూ సాఫీ ప్రయాణం.. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సులువుగా గమ్యస్థానం చేర్చడం.. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం.. ఇందుకోసం పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, రహదారుల విస్తరణ చేపట్టనుంది జీహెచ్ఎంసీ. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్, హఫీజ్‌పేట, నాలెడ్జ్సిటీ తదితర ప్రాంతాలకు సులభంగా చేరేలా మూడు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మించనుంది. మరో రహదారిని విస్తరించనుంది. ఈ నిర్మాణాలు పూర్తయితే శంషాబాద్ నుంచి ఐటీ కారిడార్‌కు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు ట్రాఫిక్ జంజాటాల్లేని సాఫీ ప్రయాణం సాధ్యమవుతుంది. మొత్తం రూ.505 కోట్లు ఖర్చు కానున్న ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ నిధులతో వీటిని నిర్మించేందుకు పరిపాలనాపరమైన అనుమతులిస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ రెండు జీవోలు జారీ చేసింది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. తప్పనున్న ట్రాఫిక్ చిక్కులు.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెహిదీపట్నం వరకు సులభంగానే వస్తున్నప్పటికీ, ఆ తర్వాత ఐటీ కారిడార్ చేరుకునేందుకు ట్రాఫిక్ చిక్కులు ఎదురవుతున్నాయి. అలాగే విమానాశ్రయం నుంచి గచ్చి బౌలి చేరుకునేందుకు దాదాపు 20 నిమిషాలు పడితే గచ్చిబౌలి జంక్షన్ దాటేందుకే 15 నిమిషాలు పడుతోంది. ఇక నానల్‌నగర్ నుంచి మెహిదీపట్నం వరకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలు పూర్తయితే కొండాపూర్, హఫీజ్‌పేట, టోలిచౌకి తదితర ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి.. అలాగే విమానాశ్రయం నుంచి ఈ ప్రాంతాలకు ప్రయాణం సాఫీగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు. రోజురోజుకూ రద్దీ పెరుగుతున్న నాలెడ్జ్సిటీ తదితర ఐటీ కారిడార్లలో భవిష్యత్ ట్రాఫిక్ చిక్కులకు ఇవి పరిష్కారం కానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇవీ పనులు.. నానల్‌నగర్, రేతిబౌలి జంక్షన్ల వద్ద రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మించనున్నారు. టోలిచౌకి మార్గంలోని ఫోర్ సీజన్స్ రెస్టారెంట్ దగ్గర మొదలయ్యే రెండు లేన్ల ఫ్లైఓవర్.. ఒక లెవెల్లో నానల్‌నగర్ చౌరస్తా వద్ద కుడివైపు(లంగర్‌హౌస్)వైపు తిరిగి కేకే ఫంక్షన్‌హాల్ వరకు వెళ్తుంది. అదే ఫ్లైఓవర్ మెహిదీపట్నం వైపు కొనసాగుతూ రేతిబౌలి జంక్షన్ దగ్గర రెండో లెవెల్లో పీవీ ఎక్స్‌ప్రెస్ వేను క్రాస్ చేస్తూ అత్తాపూర్ రింగ్ రోడ్డు మీద దిగుతుంది. అత్తాపూర్ నుంచి మెహిదీపట్నం వచ్చే వారికి మరో ఫ్లైఓవర్ నిర్మిస్తారు. నానల్‌నగర్ దగ్గర మెహిదీపట్నం నుంచి టోలిచౌకి వైపు నేరుగా వెళ్లేందుకు ఒక అండర్‌పాస్ నిర్మించనున్నారు. వీటి ద్వారా వాహనాల వేగం గంటకు కనీసం 40 కి.మీ. నుంచి 50 కి.మీ.గా ఉండగలదని అంచనా వేశారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద.. మైండ్‌స్పేస్ నుంచి ఓఆర్ఆర్కు వెళ్లే వారు బయోడైవర్సిటీకి రాకుండా నేరుగా వెళ్లేందుకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. దీంతో పాటు శిల్పా లేఔట్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు(వయా గ్యాస్ కంపెనీ) 120 అడుగులతో రహదారిని విస్తరించనున్నారు. ఈ పనులు పూర్తయితే శంషాబాద్ నుంచి కొండాపూర్ వైపు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లేవారికి సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. ఈ ప్యాకేజీ అంచనా వ్యయం రూ.330 కోట్లు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ప్రస్తుతం రద్దీ సమయంలో వాహనాల సంఖ్య గంటకు 15,020గా ఉంది. ఈ రెండు ప్యాకేజీలకూ వెరసి మొత్తం రూ.505 కోట్లు ఖర్చు కానుంది. వీటిల్లో నానల్‌నగర్, రేతిబౌలి ఫ్లైఓవర్లు వన్వేవి కాగా, గచ్చిబౌలి వద్ద టూవే ఫ్లైఓవర్. మార్గాలివీ.. ఫ్లైఓవర్ 1 అత్తాపూర్ వైపు నుంచి మెహిదీపట్నం వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్. దీని వెడల్పు 8.5 మీటర్లు. ఫ్లైఓవర్ 2 టోలిచౌకి అప్రోచ్ నుంచి రెండు లేన్ల ఫ్లైఓవర్. ఫస్ట్ లెవెల్ నానల్‌నగర్ జంక్షన్ వరకు కొనసాగుతుంది. అక్కడి వరకు 8.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. క్రమేపీ ముందుకు సాగుతూ రేతిబౌలి జంక్షన్ దగ్గర రెండో లెవెల్ ఫ్లైఓవర్‌గా మారుతుంది. అక్కడ 7 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఒక డౌన్ ర్యాంప్ లంగర్‌హౌస్ వైపు వెళ్తుంది. మరొకటి పీవీ ఎక్స్‌ప్రెస్‌వేను రెండో లెవెల్లో క్రాస్ చేస్తుంది. అండర్ పాస్ మెహిదీపట్నం వైపు నుంచి టోలిచౌకి వైపు నేరుగా వెళ్లే వారి కోసం నానల్‌నగర్ జంక్షన్ వద్ద మూడు లేన్ల అండర్ పాస్ నిర్మిస్తారు. ఈ మూడు పనుల ప్యాకేజీ అంచనా వ్యయం రూ.175 కోట్లు. ప్రస్తుతం రేతిబౌలి వద్ద రద్దీ సమయంలో గంటకు 12,501 వాహనాలు, నానల్ నగర్ వద్ద 10,317 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. -
విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తోన్న ఖాజాపాషా(51) అనే వ్యక్తి నుంచి సీఐఎస్ఎఫ్ అధికారులు ఆది వారం ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌కు చెందిన హెడ్ కాని స్టేబుల్ ఖాజాపాషా బదిలీపై వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అతడి బ్యాగులో అధికారులు తనిఖీలు చేపట్ట గా.. 9 ఎంఎంకు చెందిన రెండు బుల్లెట్లు, 0.32 ఎంఎంకు చెందిన 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. సంబంధిత పత్రాలు లేక పోవడంతో ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. కరీంనగర్లో విధులు నిర్వహించనప్పటి బుల్లెట్లు డిపా జిట్ చేయకుండా దగ్గరే ఉంచుకున్నా నని.. వాటిని బ్యాగులో మరిచిపోయి నట్లు ఆయన తెలిపినట్లు సమాచారం. -
పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: అతివేగంతో వస్తున్న ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన ఆరాంఘర్ వద్ద పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరికి గాయలు అయ్యాయి. నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో వాహనాలు ఎక్కడిక్కడా నిలిచిపోయి భారీగా ట్రాఫిక్‌జామ్ నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శంషాబాద్‌కు వచ్చే విమానాల దారిమళ్లింపు
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించక ఏడు విమానాలను దారిమళ్లించారు. తీవ్ర ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో వాతావరణం భయానకంగా మారటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విమానాలను వేరే ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఆలస్యంగా హైదరాబాద్‌కు ఆరు విమానాలు చేరుకున్నాయి. అయితే వాటిలో కోల్‌కతా ఇండిగో 538 విమానం ఇంకా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోలేదని ఈ రోజు రాత్రి 11.05 ప్రాంతంలో హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కోల్కత్తా నుంచి సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరిన ఇండిగో విమానం హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించక బెంగళూరు ఎయిర్‌పోర్టుకు మళ్లించినట్టు చెప్పారు. ఈ విమానాన్ని బెంగళూరుకు మళ్లింపుతో 162మంది ప్రయాణికులు అయోమయంలో పడ్డారు. -
ఏయిర్ పోర్టుకు వెళ్లి వస్తూ..
శంషాబాద్: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు... హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన ఫరీన్ అతిలి(28), ఆమె కుమారుడు బురామ్(8), బంధువు విరాసిద్దీన్తో కలిసి ద్విచక్ర వాహనంపై శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంధువులకు వీడ్కోలు పలకడానికి గురువారం సాయంత్రం వచ్చారు. తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. కాగా మార్గమధ్యలో కిషన్‌గూడ ప్లై ఓవర్ వద్ద ఎదురుగా వస్తున్న స్కార్పియో వాహనం వీరిని ఢీకొట్టింది. దీంతో ఫరీన్అతిలి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా ఇద్దరికి స్వల్పగాయాలు కావడంతో 108 అంబులెన్స్ వాహనంలో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇక విమానంలో ప్రయాణం బోర్ కొట్టదట!
శంషాబాద్ (రంగారెడ్డి): విమానంలో ప్రయాణం బోర్ కొట్టకుండా ప్రయాణికుల కోసం డిమాండ్‌పై వినోదం అందించడానికి శంషాబాద్ విమానాశ్రయ అధికారులు బుధవారం ఓ యాప్‌ను ప్రారంభించారు. ఫ్రాప్‌కార్న్ సంస్థతో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ యాప్ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌లో చెకిన్ పూర్తి చేసిన తర్వాత... వైఫై ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రాఫ్కార్న్ పేరిట ఉన్న ఈ యాప్ ద్వారా సరికొత్త సినిమాలు, ఇతర వినోదాత్మకమైన వీడియోలు, చిత్రాలను కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌తో విమాన ప్రయాణం సరికొత్త అనుభూతిని అందిస్తుందని జీఎంఆర్ విమానాశ్రయ సీఈఓ ఎస్జీకే కిషోర్ ఈ సందర్భంగా తెలిపారు. భవిష్యత్తులో ఈ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని విమానాశ్రయంలోని అన్ని టెర్మినళ్లకు విస్తరించనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయోగాత్మకంగా ఈ యాప్ సౌకర్యాన్ని అందిస్తున్నామని ఫ్రాప్‌కార్న్ సహాయ వ్యవస్థాపకులు భన్సాల్ తెలిపారు. దేశంలోనే ఇలాంటి సౌకర్యం తొలిసారిగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిందన్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల అగచాట్లు
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు అగచాట్లు పడ్డారు. రాయపూర్ వెళ్లేందుకు టికెట్లు తీసుకున్న 70 మంది ప్రయాణికులను విమానం నుంచి దిగిపోయారు. విమానం ఎక్కే సమయంలో ఇండిగో సిబ్బంది, ప్రయాణికుల మధ్య గొడవ జరిగింది. దాంతో ఇండిగో సిబ్బంది తీరుకు నిరసనగా విమానం నుంచి ప్రయాణికులు దిగిపోయినట్టు తెలిసింది. ప్రయాణికులను వదిలి విమానాన్ని ఎయిర్ పోర్టు అధికారులు పంపించేశారు. దాంతో రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే ప్రయాణికులు ఉండిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అమెరికా నుంచి మళ్లీ తిప్పి పంపేశారు!
► 15 మంది విద్యార్థులు వెనక్కి.. ► ఉగ్రవాదులను ప్రశ్నించినట్లు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ► తెలుగు విద్యార్థులు అనగానే వేధిస్తున్నారు ► ప్రభుత్వమే న్యాయం చేయాలి: విద్యార్థులు హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థుల కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. న్యూయార్క్ ఎయిర్‌పోర్టు నుంచి తెలుగు విద్యార్థులను అక్కడి ఎయిర్‌పోర్టు అధికారులు వెనక్కి పంపారు. అమెరికా నుంచి తిరుగుపయనమైన విద్యార్థుల్లో ఇప్పటికే 15 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం ఇటీవల 25 మంది తెలుగు విద్యార్థులు అమెరికా వెళ్లారు. అన్ని డాక్యుమెంట్లు సరిగానే ఉన్నా తమను వెనక్కి పంపివేయడంపై బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదులను దర్యాప్తు చేసినట్లుగా విద్యార్థులను ప్రశ్నిస్తున్నారని వారు వాపోయారు. తెలుగు విద్యార్థులను చూడగానే ఏదో కారణంతో వేధిస్తున్నారనీ, ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
శంషాబాద్‌లో 5 కేజీల బంగారం స్వాధీనం
-
శంషాబాద్‌లో 5 కేజీల బంగారం స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా దుబాయి నుంచి వచ్చిన విమానంలో ప్రయాణికుల వద్ద సోదాలు చేశారు. ఓ ప్రయాణికుడి నుంచి 5 కేజీల బంగారాన్ని ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం
-
ట్రావెల్స్ బస్సు బోల్తా: ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: శంషాబాద్‌లో మదనపల్లి సమీపంలోని బెంగుళూరు వెళ్లే జాతీయరహదారిపై మురళీకృష్ణ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. బస్సు నంబర్ ఏపీ 28డీ 4844 గా పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
శంషాబాద్ లో 430 గ్రాముల బంగారం స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 430 గ్రాముల బంగారం బయటపడింది. ఈ రోజు ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని అదనపు వివరాల కోసం విచారణ చేపట్టారు. ప్రయాకుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
రాష్ట్రానికి కేసీఆర్
ముగిసిన 10 రోజుల చైనా పర్యటన సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పది రోజుల చైనా, హాంకాంగ్ పర్యటన విజయవంతంగా ముగించుకుని బుధవారం రాష్ట్రానికి చేరుకున్నారు. సీఎం, ఆయనతోపాటు వెళ్లిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల బృందం ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం హాంకాంగ్ నుంచి బయల్దేరి రాత్రి 8.30కు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. మంత్రులు హరీశ్‌రావు, నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పద్మారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సీఎం బృందానికి ఘన స్వాగతం పలికారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనడంతోపాటు పెట్టుబడుల సమీకరణ లక్ష్యంగా చైనా వెళ్లిన ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అక్కడి వివిధ నగరాలను సందర్శించారు. పలు సదస్సులు, సమావేశాల్లో పాల్గొని తెలంగాణలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానంపై అవగాహన కల్పించారు. పెట్టుబడులు పెట్టాల్సిందిగా చైనా, హాంగ్‌కాంగ్‌లోని పారిశ్రామికవేత్తలను సాదరంగా రాష్ట్రానికి ఆహ్వానించారు. వచ్చే ఏడాది వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం సీఎం నేరుగా అక్కణ్నుంచి ‘మైం హోమ్’ రామేశ్వర్రావు షష్టి పూర్తి కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రాత్రి పదింటికి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కుటుంబీకులతో పాటు మంత్రులు కేటీఆర్, జోగు రామన్న, మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య, విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్యేలు వినయభాస్కర్, ప్రశాంత్‌రెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, సీఎంఓ అధికారులు స్వాగతం పలికారు. -
3.3 కిలోల బంగారాన్ని పొడిగా మార్చి..
-
రెండు కిలోల బంగారం పట్టివేత
-
రెండు కిలోల బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో దోహా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద రెండు కిలోల బంగారు లభ్యమైంది. పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తాను పంజాబ్ రాష్ట్రానికి చెందిన వాడినని ఆ ప్రయాణికుడు చెప్పినట్టు సమాచారం. -
రన్‌వేపై ఆస్తి పన్ను చెల్లించాల్సిందే..
* శంషాబాద్ విమానాశ్రయానికి తేల్చిచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం * ఢిల్లీ, బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లు పన్ను కడుతున్నట్లు స్పష్టీకరణ * ఆస్తి పన్ను పరిధిలోకి రావన్న జీఎంఆర్ అభ్యర్థనల తిరస్కరణ సాక్షి, హైదరాబాద్: రన్‌వేపై ఆస్తి పన్ను చెల్లించాల్సిందేనని శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ యాజమాన్యం ‘జీఎంఆర్’కు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. విమానాల ల్యాండింగ్, టేకాఫ్ అవసరాలకు వినియోగించే ‘రన్ వే’తో పాటు ఎయిర్‌పోర్ట్‌లో వాహనాల పార్కింగ్‌కు వినియోగించే ‘ట్యాక్సీ వే’లు సైతం ఆస్తి పన్ను పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఇందుకోసం దేశంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లు స్థానిక విమానాశ్రయాలపై విధిస్తున్న రన్‌వే, ట్యాక్సీ వేకు సంబంధించిన ఆస్తి పన్నుల సమాచారాన్ని ప్రభుత్వం తెప్పించుకుంది. ఆ వివరాలను శంషాబాద్ విమానాశ్రయ యాజమాన్యానికి తెలియజేస్తూ.. పన్నులు చెల్లించాల్సిందేనని కోరింది. వాస్తవానికి మున్సిపల్ చట్టం ప్రకారం ఆస్తి పన్ను పరిధిలోకి వచ్చే ఆస్తుల జాబితాలో విమానాశ్రయాల రన్వేలు, ట్యాక్సీవేలు లేవు. అయినా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వసూలు చేస్తుండడంపై గతంలో కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో రెండేళ్ల నుంచి విమానాశ్రయ యాజమాన్యం వీటిపై ఆస్తి పన్ను చెల్లించడం ఆపేసింది. పన్ను విధింపుపై పునఃపరిశీలన జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై అధ్యయనానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రన్వేలు, ట్యాక్సీవేలపై దేశవ్యాప్తంగా ఆస్తి పన్ను విధిస్తున్నట్లు ధ్రువీకరించేందుకు ఈ కమిటీ కీలక ఆధారాలను సేకరించింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు నగరంలోని బేగంపేట విమానాశ్రయాలకు లేఖలు రాసి రన్వేలు, ట్యాక్సీవేలపై ఆస్తి పన్ను విధిస్తున్నట్లు సమాచారాన్ని రాబట్టింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయ యాజమాన్యం సైతం ఆస్తి పన్ను కట్టాల్సిందేనని కమిటీ తేల్చిచెపుతూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. త్వరలో ప్రత్యేక రేటు ఖరారు శంషాబాద్ విమానాశ్రయ పరిధిని ప్రభుత్వం ‘నోటిఫైడ్ ఏరియా కమిటీ’గా ప్రకటించడంతో పాటు ఓ మున్సిపల్ కమిషనర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించింది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ కమిటీ విమానాశ్రయ యాజమాన్యం నుంచి ఆస్తి పన్నులు వసూలు చేస్తుంది. రన్‌వే, ట్యాక్సీవే మినహా ఇతర ఆస్తులపై జీఎంఆర్ పన్నులు చెల్లిస్తోంది. తాజాగా రన్‌వే, ట్యాక్సీవేపై సైతం పన్నులు వసూలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఇందుకు సంబంధించి ప్రత్యేక రేటును త్వరలో ప్రభుత్వం ఖరారు చేయనుంది. -
విమానాశ్రయం బాత్రూమ్లో 4.5 కిలోల బంగారం
శంషాబాద్: విమానాశ్రయంలో నాలుగున్నర కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన విమానంలోని ప్రయాణికులు కస్టమ్స్ అధికారులు చేపడుతున్న తనిఖీలకు బయపడి విమానాశ్రయంలోని బాత్రూంలో లగేజీతో సహా బంగారాన్ని విడిచి వెళ్లిపోయారు. బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆలస్యంగా బయలుదేరిన ఎయిరిండియా విమానం
హైదరాబాద్(శంషాబాద్): ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో నిలిచిపోయిన ఎయిర్ ఇండియా జెడ్డా విమానం ఒకరోజు ఆలస్యంగా బయలుదేరింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు 155 మంది ప్రయాణికులతో శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన ఏఐ 965 విమానంలో సాంకేతిక లోపం తలె త్తడంలో అధికారులు దాన్ని నిలిపివేశారు. శనివారం సాయంత్రం వరకు కూడా విమానంలోని సాంకేతికలోపం సరికాకపోవడంతో ఓ దశలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. దీంతో సంబంధిత అధికారులు ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం 7 గంటలకు 155 ప్రయాణికులతో జెడ్డా విమానం ఇక్కడి నుంచి బయలుదేరినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. -
గవర్నర్ విమానాన్ని వెనక్కి రప్పించారు..
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రయాణిస్తున్న విమానాన్ని వెనక్కి రప్పించటం విమర్శలకు దారి తీస్తోంది. ప్రయాణికుల లగేజ్ లోడ్ చేయటంలో శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించిన తీరు వివాదానికి తెరలేపింది. వివరాలు.. గవర్నర్ నరసింహన్ మూడురోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ బయల్దేరారు. అయితే విమానం అరగంట ప్రయాణించిన అనంతరం ప్రయాణికుల లగేజ్ లోడ్ చేయలేదని.. వెనక్కి రావాల్సిందిగా పైలట్‌కు సమాచారం అందటంతో మళ్లీ శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. లగేజ్ లోడ్ అయిన అరగంట తర్వాత విమానం ఢిల్లీ బయల్దేరింది. అయితే గవర్నర్ ప్రయాణిస్తున్న విమానాన్ని వెనక్కి రప్పించటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా విచారణకు ఆదేశించింది. మరోవైపు తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు. -
400 గ్రాముల బంగారం పట్టివేత
శంషాబాద్ (రంగారెడ్డి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. సోమవారం వేకువ జామున నిర్వహించిన తనిఖీల్లో సింగపూర్ నుంచి వచ్చిన ఫణే సెల్వ అనే ప్రయాణికుడి నుంచి 400 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతడ్ని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.