శంషాబాద్‌కు వచ్చే విమానాల దారిమళ్లింపు | Flights take divert to another airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌కు వచ్చే విమానాల దారిమళ్లింపు

Published Wed, May 4 2016 11:07 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

శంషాబాద్‌కు వచ్చే విమానాల దారిమళ్లింపు - Sakshi

శంషాబాద్‌కు వచ్చే విమానాల దారిమళ్లింపు

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించక ఏడు విమానాలను దారిమళ్లించారు. తీవ్ర ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో వాతావరణం భయానకంగా మారటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విమానాలను వేరే ఎయిర్‌పోర్టులకు మళ్లించారు.

ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఆలస్యంగా హైదరాబాద్‌కు ఆరు విమానాలు చేరుకున్నాయి. అయితే వాటిలో కోల్‌కతా ఇండిగో 538 విమానం ఇంకా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోలేదని ఈ రోజు రాత్రి 11.05 ప్రాంతంలో హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, కోల్‌కత్తా నుంచి సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరిన ఇండిగో విమానం హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించక బెంగళూరు ఎయిర్‌పోర్టుకు మళ్లించినట్టు చెప్పారు. ఈ విమానాన్ని బెంగళూరుకు మళ్లింపుతో 162మంది ప్రయాణికులు అయోమయంలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement