bengalore airport
-
విజయ్ సేతుపతిపై క్రిమినల్ కేసు.. ఎందుకంటే ?
Criminal Case Registered Against Vijay Sethupathi: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే బ్లాక్ బ్లస్టర్ మూవీ ఉప్పెన చిత్రంతో ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తమిళంలో విభిన్నమైన పాత్రలు చేస్తూ విలక్షణ హీరోగా పేరు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. ఆయన్ను అభిమానులు మక్కల్ సెల్వన్ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. విజయ్‌తోపాటు అతని మేనేజర్ జాన్సన్‌లపై చర్యలు తీసుకోవాలని సైదాపేట కోర్టులో కేసు వేశారు. నవంబర్‌లో బెంగళూరు విమానాశ్రయంలో విజయ్ సేతుపతిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. బెంగళూరు విజయ్‌పై గాంధీ అనే వ్యక్తి దాడి చేయగా.. అప్రమత్తమైన విజయ్ సేతుపతి మేనేజర్, ఇతర భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. ఈ విషయంపై పరువు నష్టం దావా వేసిన గాంధీ విజయ్‌పై తాజాగా క్రిమినల్ కేసు పెట్టాడు. నవంబర్ 2న తాను మెడికల్ చెకప్ కోసం మైసూర్ వెళ్తున్నాని, బెంగళూరు ఎయిర్‌పోర్టులో విజయ్‌ని కలిశానని చెప్పాడు. అప్పుడు వారి ఇద్దరి మధ్య అపార్థాలు రావడంతో విజయ్ సేతుపతి, అతని మేనేజర్ జాన్సన్ తనను కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను కూడా నటుడినని, కాబట్టే విజయ్ను పలకరించానని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా సూపర్ డీలక్స్ చిత్రానికిగానూ విజయ్ సేతుపతికి ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు వచ్చినందుకు అతడిని ప్రశంసించినట్లు తెలిపాడు. అయితే విజయ్ మాత్రం తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, తన కులాన్ని కించపరిచడాని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనపై జరిగిన దాడిలో తన చెవికి దెబ్బ తగిలిందని, దీంతో చెవి పూర్తిగా వినిపించడం లేదని తెలిపాడు. అంతేకాకుండా అతను విజయ్, అతని మేనేజర్‌పై అస్సలు దాడి చేయలేదని చెప్పాడు. అలాగే ఘటన జరిగిన సమయంలో తాను మద్యం సేవించి ఉన్నానని విజయ్ సేతుపతి తప్పుడు ప్రచారం చేయడంతో తన పరువు ప్రతిష్టకు భంగం వాటిల్లిందని, గతంలో రూ. 3 కోట్లు పరువు నష్టం దావా వేశాడు గాంధీ. ఇదీ చదవండి: విజయ్ సేతుపతిని తన్నమని రివార్డు.. వ్యక్తిపై కేసు నమోదు -
Covid Crisis : ‘శంషాబాద్’ నుంచి కేంద్రం అవుట్
హైదరాబాద్: పరిస్థితులు ఎలా ఉన్నా పెట్టుబడుల ఉపసంహారణ పట్ల కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. నలువైపులా విమర్శలు వస్తోన్నా... ముందుకే వెళ్తోంది. తాజాగా శంషాబాద్‌తో పాటు బెంగళూరులోని కెంపగౌడ ఎయిర్‌పోర్టులో ఉన్న వాటాల విక్రయానికి ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సిద్ధమైంది. ఏఏఐ వాటా సిలిక్యాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు, హైటెక్ సిటీ హైదరాబాద్‌లలో ఉన్న రెండు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో వాటాలు విక్రయించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సిద్ధమైంది. ఈ రెండు ఎయిర్‌పోర్టుల్లో ఏఏఐకి 13 శాతం వాటా ఉంది. ఇప్పుడు ఈ వాటాను కూడా అమ్మేసి ఎయిర్‌పోర్టుల నిర్వాహాణ వ్యాపారం నుంచి నెమ్మదిగా పక్కకు తప్పుకుంటోంది. ఈ మేరకు ఎయిర్‌పోర్టులో తమ వాటా విలువను మదింపు పనుల్లో ఏఏఐ బిజీగా ఉంది. అప్పులు తీర్చేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఉంది. కోవిడ్ సెకండ్‌వేవ్ కారణంగా వెయ్యి కోట్ల నష్టం వచ్చినట్టు ఏఏఐ ప్రతినిధులు చెబుతున్నారు. దీంతో ఎయిర్‌పోర్టుల్లో వాటాలు అమ్మకం ద్వారా నిధులు సమీకరించి అప్పులు తీర్చే పనిలో ఏఏఊ ఉంది. ముందుగా బెంగళూరు, హైదరాబాద్‌లలో ఉన్న వాటాలు విక్రయించి తర్వాత ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల నిర్వహాణ నుంచి కూడా తప్పుకోనుంది. ప్రభుత్వ వాటా 13 శాతమే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్ గ్రూపు ప్రధాన వాటా దారుగా ఉంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ కంపెనీ 63 శాతం వాటాతో మెజార్టీ షేర్ హోల్డర్‌గా ఉంది. కాగా మలేషియన్ ఎయిర్పోర్ట్ హోల్డింగ్ సంస్థకి 11 శాతం వాటాలు ఉన్నాయి. మొత్తంగా 74 శాతం వాటాలు ప్రైవేటు కంపెనీల చేతుల్లో ఉన్నాయి. కేవలం ఏఏఐ 13 శాతం, తెలంగాణ ప్రభుత్వం 13 శాతం వాటాలు కలిగి ఉన్నాయి. తాజాగా ఏఏఐ కూడా పెట్టుబడులు ఉపసంహరిస్తుండటంతో శంషాబాద్‌లో ప్రభుత్వ వాటా కేవలం 13 శాతానికే పరిమితం కానుంది. బెంగళూరు విషయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. చదవండి : రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ శుభవార్త! -
ఫేసే బోర్డింగ్ పాస్...!
త్వరలోనే బెంగలూరు విమానాశ్రయాల్లో మీ ముఖమే బోర్డింగ్ పాస్‌గా ఉపయోగపడనుంది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా 2019 ప్రధమార్థంలో బెంగలూరు ఎయిర్‌పోర్ట్‌లో దీనిని ప్రవేశపెడతారు. ఈ విధానాన్ని ముందుగా జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఆసియా, స్పైస్‌జెట్ ప్రయాణీకులు వినియోగించుకుంటారు. పాసింజర్లు విమానప్రయాణాల్లో భాగంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని తొలిసారిగా ఇక్కడ ఉపయోగించనున్నారు. అమల్లోకి వచ్చాక విమానయానంలో ఇదో మైలురాయి కానుంది. కాగితరహిత విమానప్రయాణ విధానాన్ని ( ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఫర్ పేపర్‌లెస్ ఎయిర్ ట్రావెల్లో భాగంగా) అమలుచేస్తున్న మొదటి ఎయిర్‌పోర్ట్‌గా బెంగలూరు నిలవనుంది. ఈ మేరకు పేపర్‌లెస్ బయోమెట్రిక్ సెల్ఫ్–బోర్డింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టే కాంట్రాక్ట్‌పై బుధవారం పోర్చుగల్‌లోని లిస్బన్లో బెంగలూరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (బీఐఏఎల్)–విజన్‌బాక్స్ సంస్థలు సంతకాలు చేశాయి. ‘విజన్‌బాక్స్ సంస్థ సొంతంగా రూపొందించిన బయోమెట్రిక్ టెక్నాలజీకి ఉపయోగించి ఫ్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటున్నాం. విమానప్రయాణం కోసం క్యూలైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా, బోర్డింగ్ కోసం రిజర్వేషన్, ఇతర ఇబ్బందులు లేకుండా ఇది దోహదపడుతుంది’ అని బీఐఏఎల్ ఎండీ, సీఈఓ హరి మరార్ వెల్లడించారు. దేశీయ విమానయానం కోసం ఎయిర్‌పోర్టుల్లో రిజిస్ట్రేషన్ మొదలుకుని బోర్డింగ్ వరకు కాగితాన్ని వినియోగించకూడదన్న లక్ష్యంలో భాగంగా ఈ పద్ధతిని అమలుచేస్తున్నట్టు విజన్‌బాక్స్ సంస్థ స్పష్టంచేసింది. ఎయిర్‌పోర్టులో ప్రయాణీకుల ముఖాలను బయోమెట్రిక్ టెక్నాలజీ ద్వారా గుర్తించి వారు విమానం ఎక్కేందుకు అనుమతించనున్నట్టు తెలియజేసింది. బోర్డింగ్‌పాస్‌లు, పాస్‌పోర్టులు, ఇతర వ్యక్తిగత గుర్తింపు కార్డులను పదేపదే చూపాల్సిన అవసరం లేకుండా ఇది దోహదపడుతుందని పేర్కొంది. -
శంషాబాద్‌కు వచ్చే విమానాల దారిమళ్లింపు
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వాతావరణం అనుకూలించక ఏడు విమానాలను దారిమళ్లించారు. తీవ్ర ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో వాతావరణం భయానకంగా మారటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా విమానాలను వేరే ఎయిర్‌పోర్టులకు మళ్లించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఆలస్యంగా హైదరాబాద్‌కు ఆరు విమానాలు చేరుకున్నాయి. అయితే వాటిలో కోల్‌కతా ఇండిగో 538 విమానం ఇంకా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోలేదని ఈ రోజు రాత్రి 11.05 ప్రాంతంలో హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, కోల్కత్తా నుంచి సాయంత్రం 6.40 గంటలకు బయల్దేరిన ఇండిగో విమానం హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించక బెంగళూరు ఎయిర్‌పోర్టుకు మళ్లించినట్టు చెప్పారు. ఈ విమానాన్ని బెంగళూరుకు మళ్లింపుతో 162మంది ప్రయాణికులు అయోమయంలో పడ్డారు.