
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తోన్న ఖాజాపాషా(51) అనే వ్యక్తి నుంచి సీఐఎస్‌ఎఫ్ అధికారులు ఆది వారం ఆరు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌కు చెందిన హెడ్ కాని స్టేబుల్ ఖాజాపాషా బదిలీపై వచ్చి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
అతడి బ్యాగులో అధికారులు తనిఖీలు చేపట్ట గా.. 9 ఎంఎంకు చెందిన రెండు బుల్లెట్లు, 0.32 ఎంఎంకు చెందిన 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. సంబంధిత పత్రాలు లేక పోవడంతో ఆర్‌జీఐఏ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. కరీంనగర్‌లో విధులు నిర్వహించనప్పటి బుల్లెట్లు డిపా జిట్ చేయకుండా దగ్గరే ఉంచుకున్నా నని.. వాటిని బ్యాగులో మరిచిపోయి నట్లు ఆయన తెలిపినట్లు సమాచారం.