కలకలం రేపిన ఘటన
న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్ కనిపించడం కలకలం రేపింది. దేశీయ విమానయాన సంస్థలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్న వేళ్ల చోటుచేసుకున్న ఈ ఘటన అలజడి సృష్టించింది. నంబర్ ఏఐ 916 ఎయిరిండియా విమానం అక్టోబర్ 27వ తేదీన దుబాయ్ నుంచి న్యూఢిల్లీలోని అంతర్జాతీయ వి మానాశ్రయంలో ల్యాండయ్యింది. ప్ర యాణికులంతా సురక్షితంగా కిందికి దిగి న తర్వాత ఒక సీటుపైనున్న బుల్లెట్ల కాట్రిడ్జ్‌ను సిబ్బంది గమనించారు. దీనిపై వెంటనే వారు విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి వాటిని విమానంలోకి తీసుకురావడం పూర్తి నిషేధం ఉంది.
ఇప్పటికే 400కు పైగా విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు రావడం..అవన్నీ ఉత్తుత్తివేనని తేలడం తెలిసిందే. భద్రతా చర్యలను తనిఖీలను ముమ్మరం చేసినా పేలుడు సామగ్రి కనిపించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా ఉండగా, సోమవారం నేపాల్‌లోని త్రిభువన్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు అందింది. విమానాశ్రయం అధికారులు వెంటనే సిబ్బందిని కిందికి దించి పూర్తి స్థాయిలో సోదాలు జరిపారు. ఎటువంటి ప్రమాదకర వస్తువులు లేకపోవడంతో కొద్ది సేపటికి విమానం టేకాఫ్ తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment