సియోల్: 218 మంది ప్యాసింజర్లు, 12 మంది సిబ్బందితో టేకాఫ్‌కు సిద్ధమైన విమానంలో లైవ్ బుల్లెట్లు కన్పించడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన విమానయాన సంస్థ టేకాఫ్ క్యాన్సల్ చేసుకుని ఫ్లైట్‌ను తిరికి టెర్మినల్‌కు తీసుకెళ్లింది. ప్రయాణికులతో పాటు సిబ్బందిని కిందకు దింపేసింది.
దక్షిణకొరియాలోని ఇంచెవాన్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఓ ప్రయాణికుడి వద్ద 9ఎంఎం బుల్లెట్లు రెండు దొరకడంతో సిబ్బంది భయాందోళన చెంది టేకాఫ్ రద్దు చేసింది. అయితే పకడ్బంధీగా తనిఖీలు నిర్వహించినా బుల్లెట్లు విమానంలోకి ఎలా చేరాయో తెలియడం లేదని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని, విమానయాన సంస్థ కూడా దీన్ని పర్యవేక్షిస్తోందని తెలిపారు.
బుల్లెట్లు కన్పించిన కారణంగా ఉదయం 7:45కు టేకాఫ్ కావాల్సిన విమానం మూడు గంటలకుపైగా ఆలస్యంగా 11:00 గంటలకు టేకాఫ్ అయ్యింది. ఎలాంటి ఉగ్రముప్పు లేదని అధికారులు నిర్ధరించుకున్న తర్వాతే విమానం తిరిగి బయలుదేరింది.
దక్షిణ కొరియాలో కఠినమైన తుపాకీ చట్టాలు అమలులో ఉన్నాయి. ఎవరైనా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే 15 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. 75,300 డాలర్ల వరకు జరిమానా విధిస్తారు. అయినా విమానంలోకి బుల్లెట్లు ఎలా తీసుకెళ్లారో అంతుచిక్కడం లేదు.
చదవండి: చిలీలో రూ.262 కోట్ల దోపిడీకి యత్నం
Comments
Please login to add a commentAdd a comment