ఢిల్లీ: విమానం ఆలస్యం కావడంపై ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులు రచ్చ రచ్చ చేశారు. సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు. ఏకంగా ఏడు గంటలు విమానం ఆలస్యం గురించి తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని పేర్కొంటూ సహనం కోల్పోయిన ప్రయాణికులు సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్పైస్‌జెట్‌కు చెందిన SG-8721 విమానం ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సి ఉంది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు రావాల్సి ఉంది. కానీ ఏకంగా ఏడు గంటలు ఆలస్యంతో విమానాశ్రయానికి వచ్చింది. దీంతో సహనానికి కోల్పోయిన ప్రయాణికులు సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఆలస్యం గురించి తమకు ముందే ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగారు. మధ్యాహ్నం 3:00 సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది.
#WATCH | Delhi | "Today at about 3:10 pm, it came to notice that a group of passengers bound for Patna by Spicejet airline flight no. SG-8721/STD were creating nuisance at domestic boarding gate 54. On query, it was learnt that the flight was delayed for more than 7 hrs as the… pic.twitter.com/bugwhjdYOK
— ANI (@ANI) December 1, 2023
ప్రయాణికుల ఆందోళనలతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది వారిని అదుపు చేశారు. విమానం ఆలస్యం కావడంపై ఎయిర్‌లైన్స్ కూడా స్పందించింది. నిన్న రాత్రి షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఆలస్యంపై ముందుగానే ప్రయాణికులకు తెలియజేశామని స్పష్టం చేసింది. దీని ప్రకారం తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని ప్రయాణికులను ఇప్పటికే కోరామని ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదీ చదవండి: పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment