ruckus
-
ప్రశాంత్ కిశోర్ పార్టీ సమావేశంలో కుమ్ములాటలు
గయ: బీహార్‌లోని గయలో జన్ సూరజ్ పార్టీ సమావేశంలో కుమ్ములాటలు చోటుచేసుకున్నాయి. పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ పిలుపు మేరకు సమావేశానికి హాజరైన నేతలు, కార్యకర్తలు గలాటా సృష్టించారు. బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏర్పాటు చేసిన పార్టీ సమావేశం రసాభాసగా మారింది. వివరాల్లోకి వెళితే గయలోని బెలగంజ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలనుకుంటున్నట్లు పీకే గతంలో ప్రకటించారు. అయితే తాజాగా జరిగిన ఈ సమావేశంలో ఈ స్థానానికి టిక్కెట్ ఆశిస్తున్న ఇద్దరు అభ్యర్థుల మద్దతుదారులు తొలుత తమ నేతలకు మద్దతుగా నినాదాలు చేశారు. దీనిని గమనించిన ప్రశాంత్ కిషోర్ స్టేజి మీద నుంచి వారిని వారించారు. అయితే ప్రశాంత్ కిశోర్ మాటలను అక్కడున్నవారెవరూ పట్టించుకోలేదు. పైగా కుర్చీలు విసురుకుంటూ ఎవరికి దొరికిన దాన్ని వారు ధ్వంసం చేశారు. ఈ పరిస్థితుల నేపధ్యంలో ప్రశాంత్ కిశోర్ సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.దీనికి ముందు తొలుత బెలగంజ్ ఉప ఎన్నిక కోసం నాలుగు పేర్లను ప్రతిపాదించారు. వీరిలో అమ్జద్ హసన్, ప్రొ. ఖిలాఫత్ హుస్సేన్, డానిష్ ముఖియా, ప్రొ. సర్ఫరాజ్ ఖాన్లున్నారు. ఈ సమావేశంలో, అమ్జద్ హసన్‌కు మద్దతు పలుకుతూ డానిష్ ముఖియా తన పేరును ఉపసంహరించుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు. దీంతో అమ్జాద్ హసన్, ఖిలాఫత్ హుస్సేన్‌ల పేర్లు చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ బెలగంజ్ టిక్కెట్‌ను ఖిలాఫత్ హుస్సేన్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మాట వినగానే అమ్జాద్ హసన్, ఖిలాఫత్ హుస్సేన్‌ల మద్దతుదారులు కుమ్ముటాటకు దిగారు.ఇది కూడా చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో రూ.26 లక్షలకు కుచ్చుటోపీ -
సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
లక్నో: తొక్కిసలాట పరిస్థితులు తలెత్తడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఒక బహిరంగ సభ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ ఘటన ఆదివారం(మే19) ప్రయాగ్‌రాజ్‌లోని పుల్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగింది.సభా వేదికను చేరుకోవడానికి ఇటు ఎస్పీ, అటు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలకు సర్దిచెప్పడానికి రాహుల్, అఖిలేష్ ప్రయత్నించినప్పటికీ వారు వినకపోవడంతో భద్రతా పరమైన సమస్యలు వస్తాయని పోలీసులు హెచ్చరించారు. దీంతో రాహుల్,అఖిలేష్ ప్రసంగించకుండా మధ్యలోనే వెనుదిరిగారు. -
Video: ఏడు గంటలు ఆలస్యంగా విమానం.. ప్రయాణికులు రచ్చ రచ్చ!
ఢిల్లీ: విమానం ఆలస్యం కావడంపై ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులు రచ్చ రచ్చ చేశారు. సిబ్బందిపై వాగ్వాదానికి దిగారు. ఏకంగా ఏడు గంటలు విమానం ఆలస్యం గురించి తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని పేర్కొంటూ సహనం కోల్పోయిన ప్రయాణికులు సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పైస్‌జెట్‌కు చెందిన SG-8721 విమానం ఢిల్లీ నుంచి పాట్నా వెళ్లాల్సి ఉంది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు రావాల్సి ఉంది. కానీ ఏకంగా ఏడు గంటలు ఆలస్యంతో విమానాశ్రయానికి వచ్చింది. దీంతో సహనానికి కోల్పోయిన ప్రయాణికులు సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఆలస్యం గురించి తమకు ముందే ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగారు. మధ్యాహ్నం 3:00 సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. #WATCH | Delhi | "Today at about 3:10 pm, it came to notice that a group of passengers bound for Patna by Spicejet airline flight no. SG-8721/STD were creating nuisance at domestic boarding gate 54. On query, it was learnt that the flight was delayed for more than 7 hrs as the… pic.twitter.com/bugwhjdYOK — ANI (@ANI) December 1, 2023 ప్రయాణికుల ఆందోళనలతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది వారిని అదుపు చేశారు. విమానం ఆలస్యం కావడంపై ఎయిర్‌లైన్స్ కూడా స్పందించింది. నిన్న రాత్రి షెడ్యూల్లో మార్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొంది. ఆలస్యంపై ముందుగానే ప్రయాణికులకు తెలియజేశామని స్పష్టం చేసింది. దీని ప్రకారం తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని ప్రయాణికులను ఇప్పటికే కోరామని ఓ ప్రకటనలో తెలిపింది. ఇదీ చదవండి: పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం ప్రారంభం -
విమానంలో తాగి రచ్చ చేసిన ప్యాసింజర్లు.. చివరకు..
దుబాయ్ నుంచి ముంబై వచ్చిన ఇండిగో విమానంలో తప్పతాగి రచ్చ రచ్చ చేశారు ఇద్దరు ప్యాసింజర్లు. తోటి ప్రయాణికులతో దరుసుగా ప్రవర్తించారు. మద్యం మత్తులో మితిమీరి రెచ్చిపోయారు. అడ్డుకోబోయిన విమాన సిబ్బందిని కూడా లెక్కచేయకుండా దుర్భాషలాడారు. మద్యం బాటిళ్లను వారి వద్ద నుంచి తీసేసేందుకు ప్రయత్నించగా.. గొడవకు దిగారు. బుధవారం ఈ ఘటన జరిగింది. ఈ ప్యాసింజర్లను దత్తాత్రేయ బపార్డేకర్, జాన్ జార్జ్ డిసౌజాగా గుర్తించారు. యాజమాన్యం వీరిపై ఫిర్యాదు చేయడంతో విమానం ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఆ తర్వాత వారు బెయిల్‌పై విడుదల అయినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ ఇద్దరు గల్ప్ దేశంలో ఏడాదిగా పని చేసి ఇంటికి తిరిగి వస్తున్న సందర్భంగా మందుబాటిళ్లు కొనుగోలు చేసి విమానంలోనే పార్టీ చేసుకున్నారు. ఇబ్బందిగా ఉందని చెప్పిన తోటి ప్యాసింజర్లతో వాగ్వాదానికి దిగడంతో విమానంలో గందరగోళ వాతావరణం నెలకొంది. అయితే విమానంలో ఇలాంటి ఘటనలు జరగడం ఏడాదిలో ఏడోసారి కావడం గమనార్హం. ఈ నెల మొదట్లోనే లండన్-ముంబై విమానంలో సిగరెట్ తాగిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే జనవరిలో ఢిల్లీ నుంచి పట్నా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్యాసింజర్ మద్యం తాగి రచ్చ చేశాడు. గతేడాది డిసెంబర్లో కొంతమంది ప్యాసింజర్లు విమానంలోనే ఘర్షణకు దిగిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. చదవండి: ఆరేళ్లుగా కాపురం.. ఇద్దరు పిల్లలు.. భార్య తన సొంత చెల్లి అని తెలిసి భర్త షాక్..! -
పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస
-
రాజ్యసభ రగడ: విపక్ష ఎంపీలపై కేంద్రం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆందోళన వ్యవహారం అంతకంతకూ ముదురుతోంది. రాజ్యసభలో గందరగోళానికి కారణమైన విపక్ష ఎంపీలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష సభ్యలు అనుచిత ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం డిమాండ్ చేసింది. ఈ వ్యవహారంపై బీజేపీ చీఫ్ శివ ప్రతాప్ శుక్లా నేతృత్వంలోని రాజ్యసభ ఎథిక్స్ కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. ఈ సమాశేంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల చివరి రోజు బుధవారం కొంతమంది ప్రతిపక్ష సభ్యులు మార్షల్స్‌పై దాడి చేయడంతోపాటు, హౌస్ ఆస్తులను ధ్వంసం చేశారన్న ప్రభుత్వం ఫిర్యాదుపై చర్చించనుంది. మరోవైపు సభలో ప్రతిపక్షాలు, ట్రెజరీ ఆస్తులు రెండూ సమానమేనని, రెండూరెండు కళ్లలాంటివని రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు శుక్రవారం ప్రకటించడం గమనార్హం. కాగా పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వ తీరుపై మండిపడిన విపక్షాలు కేంద్రం విమర్శలు గుప్పించాయి. బయటి వ్యక్తులకు మార్షల్స్ డ్రస్‌లు వేసి బుధవారం పార్లమెంట్‌లోకి తీసుకొచ్చి మహిళా ఎంపీలపై దాడి చేయించారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో విపక్ష ఎంపీలే క్రమశిక్షణ ఉల్లంఘించి దురుసుగా ప్రవర్తించారని కేంద్రం కౌంటర్ ఎటాక్ చేసింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను రిలీజ్ చేసింది. కాగా సభలో జరిగిన పరిణామాలపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. Rajya Sabha Chairman M Venkaiah Naidu today asserted that the Opposition and Treasury benches in the House are like his two eyes and are equal for him. (File pic) pic.twitter.com/FKSwt7Ik4J — ANI (@ANI) August 13, 2021 -
జనసేన సభలో తీవ్ర గందరగోళం
సాక్షి, గుంటూరు : నగరంలో నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభకు తరలివచ్చిన అభిమానులు కొందరు బారికేడ్లు తోసేసి మరీ సభా ప్రాంగణం ముందుకు వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన బౌన్సర్లు కర్రలతో కార్యకర్తలపై దాడులు చేశారు. అయినా కార్యకర్తలు వెనుకకు తగ్గలేదు. వారు కుర్చీలతో ప్రతి దాడులకు దిగారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొని.. తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులసు కూడా గాయపడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఓ పోలీసు అధికారి కూడా ఉన్నారు. అదుపు తప్పిన పరిస్థితి.. సభా ప్రాంగణం దగ్గరకు రావాలని, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను దగ్గరగా చూడాలని అభిమానులు ప్రయత్నించడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకున్నట్టు కనిపిస్తోంది. కొందరు కార్యకర్తలు దురుసుగా ముందుకు తోసుకురావడంతో మొదటవారిపై బౌన్సర్లు, ప్రైవేటు సెక్యూరిటీ కర్రలతో దాడి చేశారు. పోలీసులు కూడా పవన్ అభిమానుల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బౌన్సర్లు, పోలీసులపై అభిమానులు దాడులకు దిగారు. అంతేకాకుండా కార్యకర్తలు, కార్యకర్తల మధ్య కూడా దాడులు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో సభాప్రాంగణంలో ఒక దశలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో దాదాపు 12మంది కార్యకర్తలు గాయపడారు. ఈ ఘటనలో పోలీసులు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించినట్టు సమాచారం. -
వేదికపై సింగర్ల గొడవ
-
మా అమ్మను వేధిస్తారా: వేదికపై సింగర్ల గలాట
ఆగ్రా: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన తాజ్ మహోత్సవ్‌లో ఇద్దరు సింగర్లు వేదికపై రభస చేశారు. ఈ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. తాజ్ మహోత్సవ్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమ్లాల్లో భాగంగా గాయకులు పలక్ ముచ్చల్, ఆమె సోదరుడు పలాష్ ముచ్చల్ సంగీత విభావరి ఇచ్చారు. అయితే, ఈ సమయంలో ఒక నిర్వాహకుడు తమ తల్లితో దురుసుగా ప్రవర్తించాడంటూ.. వారు వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై రచ్చ చేస్తూ.. నిర్వాహకుడి తీరుపై పలక్ మండిపడింది. అతను తన తల్లికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వేదిక మీద మైక్‌లో ఆమె పేర్కొనడం వీడియోలో వినిపిస్తోంది. సాంస్కృతిక కార్యక్రమం మధ్యలోనే గాయకులు ఇలా గొడవకు దిగడంతో నిర్వాహకులు జోక్యం చేసుకొని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. తాజ్‌మహల్‌ను, మొఘల్ సంస్కృతిని గుర్తుచేసుకునేందుకు ప్రతి ఏడాది యూపీ సర్కారు తాజ్ మహోత్సవ్ నిర్వహించే సంగతి తెలిసిందే. -
కేజ్రీవాల్ ఇంట్లో అసలు ఏం జరిగింది?
సాక్షి, న్యూఢిల్లీ : సరిగ్గా మంగళవారం ఉదయం 9గంటల ప్రాంతం. బీజేపీ ఢిల్లీ నగర అధ్యక్షుడు మనోజ్ తివారీ, ఐదురు ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మహిళా మేయర్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిలోకి సీలింగ్ డ్రైవ్ వ్యవహారంపై చర్చించేందుకు అడుగుపెట్టారు. కేజ్రీవాల్ సమావేశ మందిరంలోకి వారు అడుగుపెట్టారో లేదో అక్కడి వారిని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ ఆమ్ఆద్మీపార్టీ ఎమ్మెల్యేలతోపాటు బౌన్సర్లు కార్యకర్తలు మొత్తం కలిపి 150మంది వరకు ఉన్నారు. వీళ్లేమో మొత్తం కలిపి 20మందే. ఈలోగా అరవింద్ కేజ్రీవాల్ వచ్చి బీజేపీ నేతలకు స్వాగతం చెప్పి కూర్చోవాలని కోరారు. అయితే, సమావేశ మందిరంలో ఇంతమంది ఎందుకని, ఇదేదో సమస్యపై ప్రసంగించే అసెంబ్లీ కాదని, వారందరిని బయటకు పంపిస్తే కూర్చుంటామని చెప్పారు. ఇదే విషయాన్ని కేజ్రీవాల్‌కు బీజేపీ నేత విజేందర్ గుప్తా, ఎంపీ రమేశ్ బిదూరి పునరావృతం చేశారు. కేజ్రీవాల్ మాత్రం వారిని కూర్చోవాలని మాట్లాడుకుందామని మళ్లీ చెప్పారు. ఢిల్లీ ప్రజల భవిష్యత్‌కు సంబంధించిన విషయం కాబట్టి బహిరంగంగా మాట్లాడుకోవడంలో తప్పేమీ లేదని బీజేపీ నేతలతో చెప్పారు. కానీ, తివారీ మాత్రం ఆయన మాటలు వినేందుకు నిరాకరించి ఏదో విషయాన్ని చెప్పబోతుండగా వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జితేంద్ర సింగ్ తోమర్ గట్టిగా అరుస్తూ 'నీ ఉపన్యాసాలు వినడానికి కాదు మేం ఇక్కడ కూర్చుంది' అన్నారు. దీంతో బీజేపీలోని 20మంది నేతలకు ఆగ్రహం వచ్చింది. వెంటనే కేజ్రీవాల్ ఇంటి నుంచి బయటకు వస్తుండగా అందులోని 150 మంది ఆప్ నేతలు, కార్యకర్తలు, బౌన్సర్లు పకపకా నవ్వారు. దీంతో మరింత చిర్రుబుర్రులాడుతూ కేజ్రీవాల్ సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చి ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే వారు వెళ్లే సమయంలో ఒక్కరు కూడా బయట లేకపోగా తిరిగి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే దాదాపు 2000మంది ఆప్ నేతలు అక్కడ పోగయ్యారు. వారి మధ్య నుంచి వెళ్లే సమయంలో మరోసారి జితేంద్ర సింగ్ వేగంగా పరుగెత్తుకుంట తివారీని అడ్డగించి బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఓ గందరగోళ వాతావరణ నెలకొంది. దీనిపై మనోజ్ తివారీ స్పందిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ పక్కా ప్లాన్ ప్రకారం ఈ పనిచేసిందని, ఓ ముఖ్యమైన అంశంపై చర్చ జరిగే సమయంలో ఇంతమంది కార్యకర్తలను తెప్పించుకోవాల్సిన అవసరం ఏముందని మండిపడ్డారు. మహిళా మేయర్లు అని కూడా చూడకుండా ఆప్ కార్యకర్తలు గుండాల్లాగా ప్రవర్తిస్తూ దాడికి దిగారని చెప్పారు. నగర మావోయిస్టుల్లాగా ఆప్ కార్యకర్తలు తయారయ్యారని మండిపడ్డారు. వారు దాడి కారణంగా విజేందర్ గుప్తా కూడా గాయాలు అయ్యాయని ఈ ఘటనపై తాము పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేసింది. అసలు విషయాన్ని చర్చించడం బీజేపీ నేతలకు ఇష్టం లేకే వెళ్లిపోయారని ఆరోపించింది. -
విజిటర్స్‌గా వెళ్లి ఆప్ అసెంబ్లీని వణికించారు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ఇద్దరు వ్యక్తులు నానా రచ్చ చేశారు. అసెంబ్లీ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా లేచి మంత్రి సత్యేంద్ర జైన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో సభలో ఉన్న వారంతా ఉలిక్కి పడ్డారు. కాసేపట్లోనే గందరగోళ వాతావరణం నెలకొంది. నినాదాలు చేసినవరు వారు తాము ఆమ్ఆద్మీపార్టీ కార్యకర్తలం అని చెప్పుకున్నారు. బుధవారం ఢిల్లీ అసెంబ్లీ జరుగుతుండగా విజిటర్లుగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అనూహ్యంగా అక్కడి నుంచి లోపలికి దూసుకొచ్చారు. ఆ తర్వాత వెంటనే ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. జైన్‌కు వ్యతిరేకంగా నినాదులు చేస్తూ ఆయన ఓ అవినీతిపరుడని గట్టిగా అరుస్తూ ఏవో కాగితపు ముక్కలను అక్కడ కూర్చున్న చట్ట సభ ప్రతినిధులపైకి విసిరారు. దీంతో అక్కడే ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు వారితో గొడపడ్డారు. చేయికూడా చేసుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ప ఆ సమయంలోనే స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ వారిని అరెస్టు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఢిల్లీ పోలీసులు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
ఐఐటీ-బీ హాస్టళ్లలో కోతుల బీభత్సం
ముంబై: ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బొంబాయి(ఐఐటీ-బీ) విద్యార్ధులు ఇప్పుడు చదువుకు భయపడటం లేదు. రోజూ తమ హస్టళ్లపై దాడి చేసి విధ్వసం సృష్టిస్తున్న కోతులను చూస్తే బెంబేలెత్తిపోతున్నారు. క్యాంపస్ లోని నాలుగు హస్టళ్ల పరిస్థితి అయోమయంగా ఉంది. తలుపు తీస్తే ఎప్పుడు ఏ కోతి గదిలోకి వచ్చి దాడి చేస్తుందో తెలీక విద్యార్ధులు బిక్కుబిక్కుమంటున్నారు. విద్యార్థుల చేతుల్లోని తినుబండారాలను లాక్కోవడమే కాకుండా, తాళం వేయని గదుల్లోకి ప్రవేశించి ఎలక్ట్రానిక్ వస్తువులను నాశనం చేస్తున్నాయి. అక్కడితో ఆగకుండా గదిలోని మంచాలపై పడుకుని నిద్రపోతున్నాయి. దాదాపు 10 నుంచి 15కోతులు ఎప్పటినుంచో క్యాంపస్ లో ఉంటున్నాయి. వాటి వల్ల చాలా మంది విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చివరి సంవత్సర విద్యార్ధి ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను క్యాంపస్ మేగజీన్ లో విద్యార్ధులు ప్రచురించారు. దీంతో విద్యార్ధులు హాస్టళ్లకు నడిచివెళ్లేటప్పుడు చేతిలో చిన్న కర్రను ఉంచుకోవాలని, హాస్టల్ ప్రాంగణంలో టపాకాయలు కాల్చుతుండాలని క్యాంపస్ కోరింది. క్యాంపస్ అడవికి దగ్గరగా ఉండటం వల్లే కోతుల బెడద ఎక్కువగా ఉందని ఓ ప్రొఫెసర్ అన్నారు. తరచూ క్యాంపస్ లో గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంటాయని పేర్కొన్నారు. కేవలం హాస్టళ్ల మీదే కాక, గతంలో ఆఫీసుల మీద కూడా కోతులు దాడి చేసిన ఘటనలు ఉన్నాయని వివరించారు. జంతురక్షణ సంస్థలు తరచూ కోతులను సురక్షిత ప్రాంతాలకు పంపుతున్నా అవి మళ్లీ మళ్లీ తిరగి వస్తూనే ఉన్నాయని విద్యార్ధుల డీన్ తెలిపారు. విద్యార్ధులు వారి వస్తువులను జాగ్రత్త చూసుకోవాలని సూచించారు. -
బెంగళూరు మార్కెట్లో యువతి హల్చల్
బెంగళూరు: బెంగళూరులోని మార్కెట్ ప్రాంతంలో ఓ నైజీరియన్ యువతి హల్ చల్ చేసింది. ఫుల్లుగా డ్రగ్స్ తీసుకొని వీధుల్లో నానా రచ్చ చేసింది. ఈ సమయంలో ఆమెతోపాటు మరోకరు కూడా ఉన్నాడు. ముందుగా ఓ షాపింగ్ మాల్‌లోకి వెళ్లిన యువతి అక్కడి సామాన్లు నేలకేసి కొట్టడమే కాకుండా వ్యక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. అడ్డుచెప్పిన వారిపై చేయి చేసుకుంది. పోలీసులు కూడా ఆమెను ఆపలేకపోయారు. దీంతో లేడీ కానిస్టేబుళ్లను పిలిపించి ఆమెను కట్టడి చేసేందుకు యత్నించినా వారి వశం కూడా కాలేదు. దీంతో దొంగచాటుగా ఓ వ్యక్తి వెళ్లి ఆమెపై ఒక బట్టతో ముసుగేసి కిందపడేసి బందించారు. చేతులు కట్టేసి తొలుత పోలీస్ స్టేషన్ కు ఆ వెంటనే ఓ ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఆమె చెప్పడం మాత్రం నైజీరియన్ యువతి అని చెప్పింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో పాచిపోయిన ఆహారం!
ప్రముఖ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా.. ఇటీవల ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటోంది. తాజాగా విమానంలో నిల్వ పదార్థాలను సర్వ్ చేశారంటూ ప్రయాణీకులు గొడవకు దిగారు. మధ్యప్రదేశ్ పార్లమెంట్ సభ్యుడు సహా విమానంలోని అనేక మంది ప్రయాణీకులకు సిబ్బంది పాడైపోయిన, నాణ్యత లేని ఆహారాన్ని అందించడంతో అసలు గొడవ మొదలైంది. భోపాల్ నుంచి ఢిల్లీ కి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో నాణ్యత లేని ఆహరం అందించారంటూ ప్రయాణీకులు సిబ్బందితో వాదనకు దిగారు. ఎయిర్ ఇండియా ఫైట్ AI-435 లో జరిగిన సంఘటనలో, అదే సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న పార్టమెంట్ సభ్యుడు సహా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక ప్రశ్నించిన వారికి సరైన సమాధానం ఇవ్వని క్రూ ప్రవర్తనపై కూడ అభ్యంతరాలు తెలిపారు. సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ ఎయిర్ ఇండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఇటీవల తరచుగా విమానాలు ఆలస్యంగా నడవడం, పైలట్లతో గొడవలు వంటి అనేక కారణాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్ ఇండియా... ప్రస్తుతం నాణ్యత లేని పదార్థాలను ప్రయాణీకులకు అందించి మరోసారి వార్తల్లో నిలిచింది. -
ఎల్బీనగర్లో నైజీరియన్ల వీరంగం
హైదరాబాద్: హైదరాబాద్ నగర పరిధిలోని ఎల్బీనగర్లో ఆరుగురు నైజీరియన్లు వీరంగం సృష్టించారు. శనివారం రోడ్డుపై వెళ్తున్న ఇద్దరిని ఆరుగురు నైజీరియన్లు చితకబాదారు. ఈ ఘటనతో అప్రమత్తమైన స్థానికులు సదరు నైజీరియన్లను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. వీరు సెయింట్ మేరీ కాలేజీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
శోభాయాత్రలో రభస
మాచర్ల టౌన్(గుంటూరు): గణనాథుని శోభాయాత్రలో భాగంగా.. గుంటూరు జిల్లా మాచర్ల టౌన్‌లోని 14 వార్డుకు చెందిన మహిళలతో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ తమ్ముడు, గణేష్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆగ్రహించిన మహిళలు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తొపులాట జరిగి, ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఊరేగింపు ప్రాంతానికి చేరుకొని వాగ్వాదం పెరగకుండా అదుపు చేశారు. అనంతరం ఆర్య వైశ్య వర్గం మహిళలతో దురుసుగా మాట్లాడిన గణేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బెల్లంపల్లి మున్సిపల్ సమావేశం రసాభస
-
రసాభాసగా గుడివాడ కౌన్సిల్ సమావేశం
-
పాదచారులపైకి దూసుకెళ్లిన కారు, నలుగురు మృతి
-
పాదచారులపైకి దూసుకెళ్లిన కారు, నలుగురు మృతి
విశాఖ : విశాఖ జిల్లాలో దారుణం జరిగింది. రావికమతంలో బుధవారం ఉదయం స్థానిక టీడీపీ నేతకు చెందిన కారు బీభత్సం సృష్టించింది. కారు అదుపు తప్పి పాదచారులపైకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. గాయపడినవారిని ప్రాథమిక చికిత్స చేయించి అనంతరం మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో నర్నీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు కారు పాదచారులను ఢీకొన్న అనంతరం కొద్దిదూరంలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. డ్రైవింగ్‌పై అవగాహన లేకపోవటం వల్లే ఈప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రైతులపై ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం
-
దద్దరిల్లిన అసెంబ్లీ
రైతుల ఆత్మహత్యలపై చర్చకు విపక్షాల పట్టు ప్రశ్నోత్తరాల సమయంలో సభను అడ్డుకున్న సభ్యులు రెండో రోజు ఆరంభంలోనే అసెంబ్లీ రెండుసార్లు వాయిదా వ్యవసాయ మంత్రి పోచారం రాజీనామాకు ప్రతిపక్షాల డిమాండ్ రైతులపై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ ఆందోళన పోడియం వద్ద టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ సభ్యుల నినాదాలు విపక్షాలపై మండిపడ్డ అధికారపక్షం కాంగ్రెస్, టీడీపీలపై ఎదురుదాడి ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకుంటున్నారని ఆగ్రహం పది మంది టీడీపీ సభ్యులపై ఒకరోజు సస్పెన్షన్ వేటు బలవంతంగా లాక్కెళ్లిన మార్షల్స్ బడ్జెట్‌పై చర్చను ప్రారంభించిన విపక్ష నేత జానారెడ్డి, సభ ఎల్లుండికి వాయిదా సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల రెండోరోజు శుక్రవారం రైతుల ఆత్మహత్యల అంశంపై సభ దద్దరిల్లింది. విపక్షాల ఆందోళనతో బడ్జెట్‌పై చర్చ మొదలుకాక ముందే వాయిదాలు, సస్పెన్షన్లతో అసెంబ్లీ అట్టుడికింది. సభా కార్యక్రమాలను పదే పదే అడ్డుకుంటున్న కారణంతో పది మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. ఉదయం సభ ప్రారంభంకాగానే వాయిదా తీర్మానాలపై విపక్ష సభ్యులు పట్టుబట్టారు. రైతుల ఆత్మహత్యలపై చర్చించాలంటూ సభను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికార, విపక్షాల మధ్య రెండు గంటలకుపైగా మాటల యుద్ధం కొనసాగింది. పది గంటలకు సభ ప్రారంభమైన వెంటనే.. రైతులను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్, టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. ‘షేమ్.. షేమ్’ అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. రైతుల ఆత్మహత్యలపై చర్చించాలని ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పందిస్తూ.. ‘సభలో అన్ని సమస్యలను సంపూర్ణంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం. వారం పది రోజులు కాదు. నలభై రోజుైలైనా సమావేశాలు కొనసాగిస్తాం. సమస్యలపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది. బీఏసీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం సభ్యులు వ్యవహరించాలి. సభ నిర్వహించేందుకు సహకరించాలి. ఏదైనా ప్రధానాంశం ఉంటే వేరే రూపంలో చర్చకు రావాలి’ అని విజ్ఞప్తి చేశారు. అనంతరం స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. విద్యుత్‌పై మొదటి ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమిస్తుండగానే.. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. ‘టీఆర్ఎస్ నుంచి తెలంగాణను కాపాడండి. ఆత్మహత్యల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించండి. మంత్రి పోచారాన్ని వెంటనే బర్తరఫ్ చేయండి. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి. ఆత్మహత్యలపై వెంటనే వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి..’ అంటూ ప్లకార్డులు పట్టుకొని ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని, హుందాగా వ్యవహరించాలని స్పీకర్ నచ్చజెప్పినా సభ్యులు ఆందోళన వీడలేదు. దీంతో విధిలేక సభను పది నిమిషాల పాటు స్పీకర్ వాయిదా వేశారు. మళ్లీ సమావేశమైన తర్వాత కూడా విపక్షాల ఆందోళన కొనసాగింది. రైతులను అవమానపరిచిన పోచారంతో క్షమాపణ చెప్పించాలని నినాదాలు చేస్తూ పలువురు సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరారు. దీంతో మరోసారి సభ వాయిదా పడింది. మళ్లీ అడ్డుకున్న విపక్షాలు తఠిఉదయం 11.20 గంటలకు సభ తిరిగి ప్రారంభమైంది. అప్పటికీ సభ్యులు శాంతించకుండా.. రైతు ఆత్మహత్యలపై చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. సభ జరిగేందుకు సహకరించాలని శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు పదేపదే విజ్ఞప్తి చేశారు. ‘ప్రశ్నోత్తరాలు సభ్యుల హక్కు. అందుకే వాయిదా తీర్మానాలుంటే ప్రశ్నోత్తరాల తర్వాతే ప్రవేశపెట్టాలని బీఏసీ సమావేశంలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒప్పుకొన్నాయి. ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విపక్షాలు సభను అడ్డుకునేందుకే వచ్చినట్లున్నాయి. విద్యుత్‌పై చర్చ జరిగితే టీడీపీ భండారం బయటపడుతుంది. అందుకే ఉద్దేశపూర్వకంగాసభను అడ్డుకుంటున్నారు. ఇది సంస్కృతి కాదు. మీకు మైకులిస్తాం. మీరు మాట్లాడండి. సభా సమయం విలువైనది. చర్చకు సహకరించండి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. అప్పటికీ టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు ఆందోళన వీడలేదు. జోక్యం చేసుకున్న స్పీకర్.. సీఎల్పీ నేత జానారెడ్డికి మాట్లాడే అవకాశమివ్వడంతో కాంగ్రెస్ సభ్యులు పోడియం దగ్గర ఆందోళన విరమించి, తమ తమ సీట్లలో కూర్చున్నారు. ప్రశ్నావళి జరగకూడదని తమకేమీ లేదని, రైతుల ఆత్మహత్యలు ఆందోళనకరమైన అంశమని.. విద్యుత్ అంశంతో పాటు చర్చించేందుకు వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని జానారెడ్డి కోరారు. అత్యంత ప్రాధాన్యమైన విషయమైతే ప్రశ్నోత్తరాల కంటే ముందుగా చర్చకు సహకరిస్తామని బీఏసీలో అధికార పార్టీ అంగీకరించిందన్నారు. గజ్వేల్‌లో ఇందిరాగాంధీ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దోషులను శిక్షించాలని కూడా కోరారు. దీనికి హరీశ్‌రావు స్పందిస్తూ.. దోషులను శిక్షించాలని ఇప్పటికే పోలీసు శాఖను ఆదేశించినట్లు మంత్రి హరీశ్‌రావు చెప్పారు. సభలో చర్చ జరిపేందుకు ఎలాంటి బేషజాలు లేవని, విపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి సమాధానం చెప్తామన్నారు. పదేళ్ల నుంచి తాము ఇదే సభలో సభ్యులుగా ఉన్నామని, ఏ అంశంపైనైనా నేరుగా వాయిదా తీర్మానాన్ని స్వీకరించారా అని హరీశ్ ప్రశ్నించారు. బయట ఏదో సొంత పనులు ఉన్నందుకు... కొందరు సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సభను అడ్డుకుంటున్నారన్నారు. అయితే వ్యవసాయ శాఖ మంత్రి రైతులపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, వాయిదా తీర్మానాన్ని అంగీకరించాలని జానారెడ్డి పట్టుబట్టారు. జోక్యం చేసుకున్న ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పూర్తిస్థాయి చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం ప్రజల సమస్యల పరిష్కారానికి పచ్చజెండాల పార్టీకి చిత్తశుద్ధి లేదని, అందుకే సభ జరగకుండా చూస్తోందని టీడీపీ సభ్యులపై ఈటెల రాజేందర్ విరుచుకుపడ్డారు. వాళ్ల మూలాలు చంద్రబాబు వద్ద.. ఆంధ్రాలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. 1984 నుంచి 2014 వరకు 25 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు టీడీపీ, కాంగ్రెస్ కారణం కాదా? కరెంటు కష్టాలకు కారణమేంటో తేల్చుకుందాం రండి? అని సవాల్ విసిరారు. అసలు రైతులపై టీడీపీకి చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. రాజకీయ భవిష్యత్తు లేదనే ఆందోళనతో సభను అడ్డుకుంటోందన్నారు. ‘ఇప్పటివరకు చేసింది చాలు.. ముంచింది చాలు.. తెలంగాణ ఉసురు పోసుకున్నది చాలు.. కూర్చొండి’ అంటూ మండిపడ్డారు. దీంతో టీడీపీ సభ్యులు ఎదురుదాడి చేశారు. తాము సమస్యలను లేవనెత్తుతుంటే.. మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. ఈ సమయంలో హరీశ్‌రావు అడ్డుపడేందుకు ప్రయత్నించగా.. ఎదురుదాడి చేయడం మానుకోవాలని, ఎవరూ భయపడేవారు లేరని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఆత్మహత్యలపై చర్చను ప్రారంభించాలని, రాష్ట్రంలో ఇప్పటికే 363 మంది రైతులు చనిపోయారని, గజ్వేల్‌లోనే అధికంగా ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. పోచారంతో క్షమాపణ చెప్పించిన తర్వాతే చర్చ ప్రారంభించాలని పట్టుబట్టారు. దీంతో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘విద్యుత్‌పై ఆందోళన చేసిన రైతులపై బషీర్‌బాగ్‌లో కాల్పులు జరిపింది చంద్రబాబు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే హిస్టీరియాతో రైతులు చనిపోతున్నారని అన్నది చంద్రబాబు.. ఇలా చెప్పుకొంటూపోతే గంట సేపైనా మాట్లాడుతా’ అని మంత్రి ఆవేశంగా అన్నారు. చర్చకు ప్రభుత్వం వెనక్కి పోవడం లేదని స్పష్టం చేశారు. కేవలం రాజకీయం చేసేందుకే సభా సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ఆత్మస్థైరం కోల్పోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పుండు మీద కారం చల్లినట్లుగా మంత్రి పోచారం వ్యాఖ్యానించడంపై సంజాయిషీ చెప్పాలని బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఆత్మహత్యల నివారణకు అందరి సలహాలు, సూచనలు స్వీకరించాలని అధికార పార్టీకి సూచించారు. అదే సమయంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి పత్రికల క్లిప్పింగ్‌లు చూపుతూ అధికార పార్టీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలపై చర్చించడం ఇష్టం లేని విపక్షాలు సభలో డ్రామాలు.. తమాషాలు చేస్తున్నాయన్నారు. మాట్లాడేందుకు ఏమీ లేనందుకే విపక్షాలు తప్పించుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. సభ జరగకుండా అడ్డుకునే సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానమైన ప్రశ్నలుంటే ప్రశ్నోత్తరాల వ్యవధి తర్వాత మరో అరగంట సమయం చర్చకు కేటాయించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించినట్లు గుర్తుచేశారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ టీడీపీ సభ్యులు ఎంతకీ ఆందోళన విరమించకపోవడంతో.. సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్న వారిని సస్పెండ్ చేయాలని మంత్రి హరీశ్‌రావు ప్రతిపాదించారు. దీంతో స్పీకర్ టీడీపీకి చెందిన పది మంది సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, అరికపూడి గాంధి, మాగంటి గోపినాధ్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, జి.సాయన్న, రాజేశ్వర్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, మాధవరం కృష్ణారావు సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరంతా పోడియం నుంచి కదలకపోవడంతో మార్షల్స్ రంగ ప్రవేశం చేశారు. ఎర్రబెల్లి, వెంకటవీరయ్య, రేవంత్‌రెడ్డిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. తప్పనిసరి పరిస్థితుల్లో సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు హరీశ్‌రావు ప్రకటించారు. దీనిపై జానారెడ్డి మాట్లాడుతూ.. తొలి శాసనసభలోనే సభ్యుల సస్పెన్షన్ చాలా దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ సభ్యులు టీడీపీతో జత కడుతున్నారని మంత్రి ఈటెల చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. సభ్యులు డ్రామాలాడుతున్నారంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలనూ ఉపసంహరించుకోవాలన్నారు. విద్యుత్, రైతు సమస్యలపై చర్చించాకే ముందుకు వెళదామన్నారు. దీంతో అక్బరుద్దీన్ స్పందిస్తూ.. తన మాటలకు సభ్యులు బాధపడినట్టున్నారని, అయితే ప్రధాన ప్రతిపక్షానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రశ్నోత్తరాలు జరగనీయాలని, ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలని సూచించారు. కాగా, అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతున్నా సభను అడ్డుకోవడం విజ్ఞత కాదని, ముందుగా బడ్జెట్‌ను ఆమోదించాల్సిన అవసరముందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సభ్యులను సస్పెండ్ చేయడం తమ అభిమతం కాదని వివరణ ఇచ్చారు. బడ్జెట్‌పై చర్చ ప్రారంభం అనంతరం బడ్జెట్‌పై చర్చ ప్రారంభించాలని జానారెడ్డికి స్పీకర్ మధుసూదనాచారి సూచించారు. అయితే జానారెడ్డి మాట్లాడకుండా కాంగ్రెస్ సభ్యుడు భట్టి విక్రమార్కకు మాట్లాడే అవకాశమివ్వాలని పేర్కొన్నారు. దీంతో కేసీఆర్ మళ్లీ స్పందిస్తూ.. ‘నేను అప్పీల్ చేశాను. సాయంత్రం వేళ చర్చకు కూడా సిద్ధమని చెప్పాను. అయినా సభకు పదే పదే అడ్డుపడితే ఎలా? బడ్జెట్‌ను పాస్ చే యడం ప్రధానం. ప్రజా సమస్యలపై ప్రాధాన్య క్రమంలో చర్చిద్దాం’ అని సీఎం పేర్కొన్నారు. అయినా కాంగ్రెస్ సభ్యులు సభను అడ్డుకునే వైఖరినే కొనసాగించడంతో వారితో మాట్లాడేందుకు వీలుగా టీ బ్రేక్ ఇవ్వాలని స్పీకర్‌కు కేసీఆర్ సూచించారు. దీంతో ఆయన టీ బ్రేక్ ఇచ్చారు. ఈ సమయంలో విపక్షాలతో సీఎం మాట్లాడారు. మధ్యాహ్నం 1.45 గంటలకు సభ తిరిగి సమావేశమైన తర్వాత బడ్జెట్‌పై చర్చను జానారెడ్డి ప్రారంభించారు. అయితే దీన్ని సోమవారం కొనసాగిస్తానని ఆయన కోరడంతో స్పీకర్ ఆ మేరకు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు
-
కాశ్మీర్ ప్రజలు పేరు మోసిన దొంగలు: ఫరూక్
రాజకీయ నాయకులు ముందు వెనుక చూడకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తారు. ఆతర్వాత దాని ఫలితం తర్వాత అనుభవించాల్సి వస్తుంది. దేశ రాజకీయాల్లో సీనియర్ రాజకీయవేత్తగా పేరున్న జమ్మూ, కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఫరూక్ మాట్లాడుతూ.. కాశ్మీర్ ప్రజలు దొంగలు కాదు.. పేరుమోసిన దొంగలు (మహా చోర్) అని అన్నారు. కాశ్మీర్ లోయలోని కొన్ని ప్రాంతాల్లో అక్రమ విద్యుత్ కనెక్షన్ల వినియోగించడం ద్వారా రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ ప్రజలను దొంగలు అంటూ ఫరూక్ చేసిన వ్యాఖ్యలు కాశ్మీర్ అసెంబ్లీలో పెద్ద దూమారాన్నే లేపాయి. ఫరూక్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ ఆందోళన కార్యక్రమాలను ప్రారంభించింది. నేషనల్ కాన్ఫరెన్స్ ఇలా సిగ్గుమాలిన ప్రకటనలు ఎలా చేస్తారంటూ మహబూబా ముఫ్టీ మండిపడ్డారు. -
గంటా చేరికతో విశాఖ టీడీపీలో ముసలం!
చిచ్చురేపుతున్న గంటా బృందం చేరిక కీలక సమావేశాన్ని బహిష్కరించిన అయ్యన్న వర్గం వెలగపూడి, పప్పల కూడా దూరం బాహాటమైన వర్గ విభేదాలు సాక్షి, విశాఖపట్నం: జిల్లా తెలుగుదేశంలో ముసలం మొదలైంది. రెండుగా చీలుతున్నట్లు స్పష్టంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. గంటా బృందాన్ని చేర్చుకోవద్దని స్వరం పెంచిన అయ్యన్న వర్గం శుక్రవారం మరో అడుగు ముందుకేసింది. గంటా పాల్గొన్న కీలక సమావేశాన్ని బహిష్కరించింది. దీంతో అసమ్మతి స్పష్టంగా పాగా వేసినట్టయింది. గంటాతోపాటు ఎమ్మెల్యేలు కన్నబాబురాజు, ముత్తంశెట్టి,అవంతి శ్రీనివాసరావు, పంచకర్ల తదితరులను పార్టీనేతలు,కార్యకర్తలకు పరిచయం చేసేందుకు గురువారం సాయంత్రం ఎంవీవీఎస్ మూర్తి నగరంలో ఓ సమావేశం నిర్వహించారు. దీనిని అయ్యన్న వర్గం పూర్తిగా బహిష్కరించింది. ఎలాగూ రారని పార్టీ తరఫున వీరికి ఆహ్వానం కూడా పంపలేదని తెలిసింది. అయ్యన్న మద్దతుదారులుగా పేరొందిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి, మరోనేత పప్పలచలపతిరావు, కోనతాతారావు తదితర సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. మహిళా సదస్సు ఏర్పాట్లపై ఉదయం జరిగిన సమావేశానికి మాత్రం వచ్చారు. అయ్యన్న వర్గం దానికి కూడా హాజరుకాలేదు. సమావేశంలో గంటాతోపాటు ఎమ్మెల్యేలు తమ ప్రసంగాల్లో పార్టీనేతలతో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు గాని అయ్యన్న వర్గం పేర్లను విస్మరించారు. పార్టీలో ఇతర నేతలు కూడా వీరిపేర్లను ప్రస్తావించలేదు. పప్పల చలపతిరావు పేరు మినసా అయ్యన్న వర్గం గురించి ప్రస్తావించలేదు. గంటారాకతో పార్టీలో ముదిరిపోయిన విబేధాలు పరిచయ కార్యక్రమం ద్వారాబయపడ్డాయి. చంద్రబాబు గురువారం విశాఖనుంచి హైదరాబాద్ బయలుదేరే సమయంలో ఆయన్ను అయ్యన్న కలిశారు. మరోసారి గంటారాకపై తన అభ్యంతరం వ్యక్తంచేశారు.అధినేతకూడా గంటావైపే మొగ్గుచూపడం,తన తనయుడికి అనకాపల్లి పార్లమెంట్ సీటుపై హామీ ఇవ్వకపోవడంతో ఆయన తీవ్రస్థాయిలో పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు శుక్రవారం సమావేశానికి కూడా అయ్యన్నవర్గం దూరమవడంతో మున్ముందు పార్టీలో వీరి పాత్ర ఎలా ఉంటుందనేదానిపై సస్పెన్స్ నెలకొంది. కాగా పరిచయ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంఛార్జులతోపాటు వీవీఎస్మూర్తి,బండారు,గవిరెడ్డి,ఆడారితులసీరావు తదితర నేతలు హాజరయ్యారు.